ఖమ్మం

అంతరాయం లేకుండా నగదు చెల్లింపులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం రూరల్, డిసెంబర్ 2: బ్యాంక్ ఖాతాదారులందరికీ ఎటువంటి అంతరాయం లేకుండా నగదు చెల్లింపులు చేస్తున్నామని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ మేనేజర్ రవిశంకర్ తెలిపారు. గత నెల 8వ తేదీ నుంచి ఇప్పటివరకూ ఐఓబి పరిధిలో జరిపిన బ్యాంక్ లావాదేవీలపై శుక్రవారం ఆయనను కలిసి వివరణ కోరగా పైవిధంగా స్పందించారు. ఐఓబి పరిధిలో ఖమ్మం రూరల్ మండలంలోని 14 గ్రామాలు, వరంగల్ జిల్లా ముల్కలపల్లి మండలంలోని 8 గ్రామాలకు సంబంధించి 24వేల మంది ఖాతాదారులు ఉన్నట్టు చెప్పారు. వారిలో క్రాప్‌లోన్‌కు సంబంధించి ఎనిమిది వేల మంది ఖాతాదారులు, పెన్షనర్లు సుమారు మూడువేల వరకు ఉన్నట్టు తెలిపారు. వీరందరికీ చెల్లింపుల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్టు వివరించారు. నేషనలైజ్ బ్యాంకులన్నింటికీ ఒకే ప్రాతిపదికన నగదు విడుదల చేయడం వల్ల క్రాప్‌లోన్లు, పెన్షన్‌లు చెల్లించే బ్యాంకులకు కొంత ఇబ్బంది ఎదురైందన్నారు. అయినప్పటికీ వీలైనంత వరకు నగదును పెద్ద మొత్తంలో తీసుకొని వచ్చి ఖాతాదారులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా పంపిణీ చేసినట్టు వెల్లడించారు. బ్యాంక్‌లో లావాదేవీలు ప్రశాంతంగా జరిగేలా తోడ్పాటునందించిన ఖాతాదారులు, ఎటువంటి అల్లర్లు, అరాచకాలు చోటు చేసుకోకుండా సహకరించిన పోలీసులు, అదేవిధంగా ఖాతాదారుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పటికీ ఎంతో ఓర్పుతో సేవలందిస్తున్న సిబ్బందిని ఆయన అభినందించారు.

అర్ధాకలితో అలమటిస్తున్న హాస్టల్ విద్యార్థులు
* పిడిఎస్‌యు ఆందోళన
ఖమ్మం(ఖిల్లా), డిసెంబర్ 2: ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో విద్యార్థులు అర్ధాకలితో అలమటిస్తున్నారని, పాఠశాల, హాస్టల్ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పిడిఎస్‌యు ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. శుక్రవారం నగరంలో ప్రదర్శన నిర్వహించి స్థానిక జడ్పిసెంటర్‌లో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా సహయ కార్యదర్శి ఎన్ అజాద్ మాట్లాడుతూ పెద్దనోట్ల రద్దు, ప్రభుత్వం మద్యాహ్న భోజన బిల్లులు రాక విద్యార్థులు అర్థాకలితో గడపవల్సి వస్తుందన్నారు. విద్యార్థులకు బంగారు భవిష్యత్‌ను అందిస్తానని చెప్పిన కెసిఆర్ విద్యాసంవత్సరం ప్రారంభమై అర్థ సంవత్సరం కావస్తున్నప్పటికి అరకొరగా అందిన పాఠ్యపుస్తకాలతోనే విద్యార్థులు కాలం వెళ్ళబుచ్చుతున్నారన్నారు.