ఖమ్మం

కెటిఆర్ వ్యాఖ్యలను ఖండించిన టిజెఎసి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(గాంధీచౌక్), డిసెంబర్ 4: తెలంగాణ ఉద్యమంలో ప్రత్యేక భూమిక పోషించి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కారకుడైనా ప్రొఫెసర్ కొదండరాం పట్ల కెటిఆర్ చేసిన వ్యాఖ్యలు సరికాదని టిజెఎసి జిల్లా కమిటీ కన్వీనర్ డాక్టర్ పాపారావు తీవ్రంగా ఖండించారు. ఆదివారం స్థానిక సంఘ కార్యాలయంలో జరిగిన ముఖ్యనాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టులు కట్టడాన్ని టిజెఎసి ఎన్నడు వ్యతిరేకించలేదని అందులో జరుగుతున్న అక్రమాలను ప్రశ్నించిందన్నారు. ప్రాజెక్టులు రైతాంగానికి ఉపయోగపడాలే గాని ప్రజలకు కష్టాలను కల్పించేది ఉండకూడదన్నారు. ప్రజల పక్షాన ఉండి ప్రజల సమస్యల కోసం పోరాడుతున్న కొదండరాంను విమర్శించే అర్హత కెటిఆర్‌కు లేదన్నారు. ప్రాజెక్టుల విషయంలో జరుగుతున్న అక్రమాలను పట్టించుకోకుండా వారి ప్రభుత్వంపై ఎవరు విమర్శలు చేస్తే వారిపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ వారి అధికార గర్వన్ని చాటుకుంటున్నారని విమర్శించారు. ప్రశ్నించినందుకు బాధ్యహితమైన పదవిలో ఉన్న మంత్రి కెటిఆర్ ప్రజా స్వామ్యవాదనను అవమానించటం తగదన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మురళి, ప్రభకర్, రమేష్, బాస్కర్, ప్రసాద్, రవి తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ పోరాట స్ఫూర్తితో జిల్లా ఉద్యమాన్ని కొనసాగిస్తాం
సత్తుపల్లి, డిసెంబర్ 4 : తెలంగాణ రాష్ట్ర సాధనకు పోరాడిన తీరులోనే సత్తుపల్లి జిల్లా సాధన ఉద్యమాన్ని నిర్వహిస్తామని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. స్థానిక అంబేద్కర్ సెంటర్‌లో జరుగుతున్న నిరవధిక రిలే దీక్ష 37వ రోజు కార్యక్రమంలో పాల్గొన్నారు. సత్తుపల్లి ప్రాంతంలో తెలంగాణ ఉద్యమానికి బాటలు వేసింది తొలుత ఉపాధ్యాయులేనన్నారు. అదే స్ఫూర్తితో జిల్లా సాధన ఉద్యమంలో సైతం కీలక పాత్ర వహిస్తున్నారన్నారు. అశ్వారావుపేట, సత్తుపల్లి నియోజకవర్గాలను కలుపుతూ సత్తుపల్లి కేంద్రంగా జిల్లా ఏర్పాడాలని ప్రజలు కోరుకుంటున్నారని, ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఐక్య కార్యాచరణ వేదిక నాయకత్వంలో ఉపాధ్యాయులు భాగస్వాములవుతున్నారని ఉపాధ్యా సంఘాలు నేతలు పేర్కొన్నారు. 37వ రోజు దీక్షలో అజయ్‌కుమార్, మధుసూధన్‌రాజు, దారా ఏసురత్నం, సలీం, రామగోపి, నర్సయ్య, బాలకేశవరావు, పానెం శ్రీనివాసరావు, వసంత తిరుపతిరావు, అలీం పాల్గొన్నారు.