ఖమ్మం

క్రమశిక్షణతో పనిచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(జమ్మిబండ), డిసెంబర్ 6: పోలీస్ శాఖలో భాగస్వామ్యమైన హోంగార్డులు తమ విధులను నిబద్ధతతో, క్రమశిక్షణతో చేయాలని ఎస్పీ షానవాజ్‌ఖాసీం అన్నారు. 54వ హోంగార్డు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలీస్ కుటుంబంలో హోంగార్డులు కూడా ఒకరని, క్రమశిక్షణతో ఉంటే మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. ఖమ్మం జిల్లా హోంగార్డులు తమ పనితీరుతో రాష్ట్రంలోనే మంచిపేరు సంపాధించుకున్నారన్నారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో ప్రతిభ కనబర్చిన కమాండర్ వెంకటేశ్వర్లు, సత్యనారాయణ, మురళీకృష్ణ, శేషయ్య, వీరస్వామి, రమేష్, శంకర్, మల్లిఖార్జున్‌రావు, రూపవతి, నాగేశ్వరరావులకు ప్రశంసాపత్రాలు అందించారు. అనంతరం హోంగార్డులు నగరంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో డిఏస్పీ సురేష్‌కుమార్, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.