ఖమ్మం

పాఠశాల అభివృద్ధికి పాటుపడదాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వైరా, డిసెంబర్ 8: పూర్వవిద్యార్థులంతా కలసి మనకు ఓనమాలు నేర్పిన పాఠశాలను అభివృద్ధి చేసుకుందామని టిఆర్‌ఎస్ జిల్లా నాయకుడు, పూర్వవిద్యార్థుల సంఘం అధ్యక్షుడు మచ్చా వెంకటేశ్వరావు పిలుపునిచ్చారు. గురువారం మండల పరిధిలోని స్టేజి పినపాక ప్రాథమిక పాఠశాలకు బల్లలు, ఐరన్‌సేఫ్‌లు వితరణగా అందించారు. ఈసందర్భంగా ఆనాడు కలిసి చదువుకున్న మిత్రులంతా కలుసుకున్నారు. అనంతరం వారంతా కలసికట్టుగా పాఠశాలను దశలవారీగా అభివృద్ధి చేయాలని నిశ్చయించుకున్నారు. వచ్చే విద్యాసంవత్సరం ఆరంభానికి ముందే అక్కడ విద్యను ఆర్జించే విద్యార్థులకు కావలసిన దుస్తులు, పుస్తకాలు, బ్యాగులు ఒకటేమిటి భవిష్యత్ అవసరాలకు కావలసివన్నీ సమకూర్చుతామని ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమంలో గ్రామసర్పంచ్ తాటి వెంకటేశ్వర్లు, విద్యాకమిటి చైర్మన్ తడికమళ్ళ నరేష్, పూర్వవిద్యార్థులు తన్నీరు నాగేశ్వరావు, తుమ్మలపల్లి రామారవు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి. పద్మావతి, ఉపాధ్యాయులు జగపతిరావు, గ్రామస్థులు పాల్గొన్నారు.
ఆంజనేయస్వామి ఆలయంలో ధ్వజ స్తంభానికి పూజలు
ఎర్రుపాలెం, డిసెంబర్ 8: మండల పరిధిలోని తెల్లపాలెం గ్రామంలో నిర్మిస్తున్న భక్తాంజనేయస్వామి ఆలయంలో ఏర్పాటు చేయనున్న ధ్వజస్థంభాన్ని గ్రామానికి తీసుకురావడంతో పెద్దఎత్తున పూజలు చేసి ఊరేగింపు నిర్వహించారు.ఆలయంలో ఏర్పాటు చేసేందుకు భద్రాచలం అడవుల నుండి 42అడుగుల ధ్వజస్థంభాన్ని గ్రామస్థుల సహకారంలో తీసుకువచ్చినట్లు కమిటీ సభ్యులు తెలిపారు.
పెద్దనోట్ల రద్దు అనాలోచిత చర్య
జూలూరుపాడు, డిసెంబర్ 8: కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్లను రద్దుచేస్తూ తీసుకున్న నిర్ణయం అనాలోచిత చర్య అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సిపిఐ కార్యదర్శి ఎస్‌కె సాబీర్‌పాషా అన్నారు. మండల పరిధిలోని పాపకొల్లు గ్రామ పంచాయతీ పుట్టకోటలో మండల సహాయ కార్యదర్శి నాగుల్‌మీరా ఇంటి వద్ద గురువారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ నోట్ల రద్దుతో దేశంలోని పెట్టుబడి దారులు, కార్పోరేటర్లు ఎక్కడా ఇబ్బందులు పడిన దాఖలాలు కనిపించటం లేదన్నారు. బ్యాంకుల వద్ద ఎక్కడ చూసినా సామాన్య ప్రజలు మాత్రమే డబ్బుల కోసం రాత్రింబవళ్లు క్యూలో నిలుచోవాల్సి వస్తుందన్నారు. నకిలీ కరెన్సీ, నల్లధనానికి కమ్యూనిస్టులు వ్యతిరేకమని, ఇటువంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లో సమర్ధించేదిలేదన్నారు. నెల రోజులుగా సామాన్య ప్రజలు పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు బ్యాంకుల్లో నగదు నిల్వలను పెంచాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని బిజెపితోపాటు తెలంగాణ రాష్ట్రంలోని టిఆర్‌ఎస్ ప్రభుత్వం కూడా ప్రజలను మోసం చేస్తుందని ఆరోపించారు. ఎన్నికల్లో ప్రజలకిచ్చిన డబుల్ బెడ్‌రూం పథకం, దళితులకు మూడెకరాల భూమి, రైతులకు వ్యవసాయ రుణాలు, విద్యార్ధులకు ఫీజు రీయంబర్స్‌మెంట్ వంటి పథకాలను అమలు పరచటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పార్టీ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్త ఆందోళనలు చేపట్టనున్నట్లు ఆయన హెచ్చరించారు. సమావేశంలో పార్టీ మండల కార్యదర్శి గుండెపిన్ని వెంకటేశ్వర్లు, యల్లంకి మధు, చింతా స్వరాజ్యరావు, షేక్ చాంద్‌పాషా, వెంకటప్పయ్య, బెజవాడ సీతయ్య, రామకృష్ణలు పాల్గొన్నారు.