ఖమ్మం

చర్చల ద్వారానే సమస్యలు పరిష్కరించుకున్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(గాంధీచౌక్), డిసెంబర్ 8: విద్యుత్‌శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను 6నెలలకు ముందు చర్చల ద్వారానే పరిష్కరించుకున్నామని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం రీజినల్ కార్యదర్శి ఎస్‌వివి ప్రసాద్ పేర్కొన్నారు. గురువారం ఖమ్మం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యుత్‌శాఖలో పనిచేస్తున్న 2,300మంది కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని విద్యుత్‌శాఖ మంత్రి జగదీష్‌రెడ్డిని కలసి చర్చలు జరిపినట్లు తెలిపారు. కార్మికుల సమస్యలపై కొన్ని సంఘాలు టిపిటిఎఫ్ పేరుతో సమ్మె చేస్తామని గత 6నెలలుగా కార్మికులను మభ్యపెడుతూ ఇబ్బందులకు గురిచేశారన్నారు. మన రాష్ట్రంలో మన ప్రభుత్వంతో చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. టిటిఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమ్మెకు ముందే ముఖ్యమంత్రి కెసిఆర్, విద్యుత్‌శాఖ మంత్రి జగదీష్‌రెడ్డితో చర్చలు జరిపి ఒకేసారి 2,300మంది కార్మికులను రెగ్యులరైజ్ చేయటం గొప్ప విషయమని ఇది కేవలం కెసిఆర్ వల్లనే సాద్యమన్నారు. ఈ సందర్భంగా రెగ్యూలరైజేషన్‌కు చేయవలసిన విధివిధానాలను త్వరలో పూర్తి చేసి కార్మికుల జీవితాలలో వెలుగు నింపాలని ట్రాన్స్‌కో యాజమాన్యన్ని కోరారు. దీనిలో భాగంగా కెసిఆర్, జగదీష్‌రెడ్డిలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. విలేఖరుల సమావేశంలో నాయకులు బివిఎస్ మూర్తి, నాగేశ్వరరావు, శ్రీనివాసరెడ్డి, అప్పిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
10,11 తేదీల్లో
స్ర్తి వైద్యనిపుణుల
రాష్ట్ర సభ
ఖమ్మం(ఖిల్లా),డిసెంబర్ 8: ఈ నెల 10,11తేదీలలో ఖమ్మంలో స్ర్తివైద్యనిపుణుల రెండవ రాష్టస్రభ జరపనున్నట్లు ఓబెస్టిరిక్ అండ్ గైనకాలజిస్ట్ సోసైటీ అధ్యక్షురాలు డాక్టర్ శైలజ తెలిపారు. గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి సభ వరంగల్‌లో జరిగిందన్నారు. రెండవ రాష్ట్ర సభను ఖమ్మం శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సభకు అన్ని రాష్ట్రాల నుండి ప్రముఖ వైద్య నిపుణులు హాజరుకానున్నారని వివరించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా నవీన పద్ధతులలో వైద్యం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై చర్చించనున్నట్లు ఆమె పేర్కొన్నారు. స్థానిక మమతా ఆసుపత్రి ఆడిటోరియంలో నిర్వహించనున్న సభలో ఆసుపత్రిలో చేస్తున్న శస్త్ర చికిత్సలను ప్రత్యేక్ష ప్రసారం ద్వారా ప్రముఖ వైద్య నిపుణులు చర్చించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌లు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరౌతున్న ఈ సభలకు దేశవ్యాప్తంగా దాదాపు 600మంది ప్రముఖ వైద్యనిపుణులు పాల్గొంటున్నట్లు ఆమె వెల్లడించారు. విలేఖరుల సమావేశంలో డాక్టర్లు ఎం విజయశ్రీ, ఆంధ్రజ్యోతి, లక్ష్మిరాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.