ఖమ్మం

విద్యాలయాల్లో జెడ్పీ చైర్‌పర్సన్ ఆకస్మిక తనిఖీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జూలూరుపాడు, డిసెంబర్ 8: మండల కేంద్రంలోని జూలూరుపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, జూలూరుపాడు న్యూకాలనీలోని అంగన్‌వాడీ కేంద్రం, కస్తూరీబా గాంధీ బాలికా విద్యాలయాలను జిల్లా పరిషత్ ఛైర్మన్ గడిపల్లి కవిత గురువారం ఆకస్మికంగా తనిఖీచేశారు. ఉన్నత పాఠశాలలో విద్యార్ధులతో ఆమె మాట్లాడారు. ఉపాధ్యాయుల సమయపాలన, పనితీరు వంటి విషయాలపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జెట్టి రాంబాబును అడిగి తెలుసుకున్నారు. పాఠశాలకు మధ్యాహ్న భోజనం బియ్యం సరఫరా జరుగలేదని తెలియటంతో ఎంఈవో వెంకట్‌తో మాట్లాడారు. ఇంతే కాకుండా పాఠశాల ఎస్‌ఎంసి ఛైర్మన్ ఎన్నిక నిలిచిపోవటంతో అభివృద్దికి ఆటంకంగా మారిందనే విషయం తెలుసుకున్న ఛైర్మన్ సమస్యను తక్షణమే పరిష్కరించాలని జిల్లా విద్యాశాఖాధికారిని కోరారు. అనంతరం న్యూకాలనీలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించారు. కేంద్రంలో చిన్నారుల సంఖ్య, పిల్లలు, బాలింతలు, గర్భిణీలకు అందుతున్న పౌష్టికాహారంపై ఆరా తీశారు. కస్తూరీబా గాంధీ విద్యాలయంలో విద్యార్ధినుల ప్రగతిని పరిశీలించారు. 10వ తరగతి విద్యార్ధులు కష్టపడి చదవటంతోపాటు నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలని ఆమె కోరారు. దీంతోపాటు ఉపాధ్యాయులు విద్యాభివృద్ది కోసం బాధ్యతగా పనిచేయాలని సూచించారు. ఈకార్యక్రమంలో టిఆర్‌ఎస్ పార్టీ జిల్లా నాయకులు యల్లంకి సత్యనారాయణ, సర్పంచ్ పాయం వెంకట రమణ, ఉప సర్పంచ్ తాళ్లూరి రామారావు, ఎంపిటిసి సాయిల నాగేశ్వరరావులు ఉన్నారు.