ఖమ్మం

కుటుంబ పాలనలో రాష్ట్రం అప్పుపాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పినపాక, డిసెంబర్ 8: మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మారుస్తూ కేసీఆర్ కుటుంబ పాలన సాగిస్తున్నారని, ఇది రోజురోజుకు తుగ్లక్ పాలనగా మారుతుందని సీపీఎం జిల్లా కార్యదర్శి కాసాని ఐలయ్య ఆరోపించారు. గురువారం పినపాక మండల స్థాయి పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో కేసీఆర్ పాలన సామాన్యుడికి గుదిబండగా మారుతుందన్నారు. దీనిపై పేదలే తిరుగుబాటు చేయాలన్నారు. పేదల పాలిట పెన్నిధిగా చెప్పుకుంటున్న కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల నిజస్వరూపం కొద్ది రోజుల్లో బయటపడుతుందన్నారు. రాష్ట్రంలో మిగులు బడ్జెట్ ఉంటే దుబారా ఖర్చుతో లోటు బడ్జెట్‌కు చేర్చారని, రెండున్నర సంవత్సరాలైనా రాష్ట్రంలో భారీ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి కాలేదన్నారు. భారీ మాటలే తప్ప ఆచరణలో ఈ ప్రభుత్వం చేస్తుందని శూన్యమని ఆరోపించారు. దీనిపై సీపీఎం నాయకులు, కార్యకర్తలు పోరాటాలు సిద్ధంగా ఉండాలన్నారు. ప్రజల అనుమతితో పాలనలో కొనసాగుతున్న ఏ నాయకుడినైనా ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను సమర్ధవంతంగా ఆలోచించి పాలన కొనసాగించిన రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనిస్తుందన్నారు. ఈ సమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యుడు అన్నవరపు కనకయ్య, మండల కార్యదర్శి వెంకన్న, బండారి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.