ఖమ్మం

సింగరేణి కార్మికులకు వేతనాల వెతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, డిసెంబర్ 8: కేంద్రప్రభుత్వం తీసుకున్న పెద్దనోట్ల రద్ధుతో సింగరేణి కార్మికులకు వేతన కష్టాలు తీవ్రంగా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ధ పారిశ్రామిక సంస్థగా సింగరేణి విరాజిల్లుతున్న విషయం విదితమే. మొత్తంగా సింగరేణిలో 54,858 ఎన్‌సిడబ్ల్యు ఎ కార్మికులు, 2,435 ఎగ్జిక్యూటివ్‌లు కలిపి 57,293మంది ఉన్నారు. సింగరేణిలో డిసెంబర్ 1నుండి 7వ తేదీ వరకు సింగరేణి వ్యాప్తంగా వేతనాలను వారి వారి బ్యాంకు ఖాతాలలో యాజమాన్యం జమ చేసింది. కొన్ని ప్రాంతాలలో మొబైల్ ఎటిఎంల ద్వారా రూ 2వేలు తీసుకొనే అవకాశాన్ని కల్పించడంతో పాటు ఆర్‌బిఐ నిబంధనల ప్రకారం రూ.24వేలు విత్‌డ్రాను బ్యాంకుల ద్వారా అవకాశమున్నప్పటికీ బ్యాంకులలో నగదు నిల్వలు లేకపోవడంతో రూ 10వేల వరకు మాత్రమే బ్యాంకుల ద్వారా విత్‌డ్రా చేసుకునే అవకాశాన్ని కల్పించారు. అయితే నెలంతా కష్టపడ్డా పెద్దనోట్ల రద్దుతో కష్టపడి పొందిన వేతనాన్ని కూడా తీసుకో లేకపోవడం వల్ల తమ కుటుంబాలు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నాయని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సింగరేణి వ్యాప్తంగా వున్న 11 ఏరియాలలో జనరల్ మేనేజర్లు బ్యాంకర్లతో ముందస్తు సమావేశాలు నిర్వహించి, మొబైల్ ఎటి ఎం లద్వారానే కాకుండా బ్యాంకులలో సింగరేణి కార్మికుల కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని కోరినప్పటికీ కొన్ని ప్రాంతాలలో మొబైల్ ఎటిఎంల ద్వారా రూ 2వేలు డ్రా చేసుకునే అవకాశాన్ని కల్పించిన బ్యాంకర్లు బ్యాంకులలో మాత్రం ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయడంలో విఫలమవుతున్నారు. దీంతో కుటుంబ ఖర్చు ఏ విధంగా కొంత డబ్బుతో సరిపుచ్చుకోవాలో అర్థం కాని పరిస్థితులకు సింగరేణి కార్మికులు నెట్టబడ్డారు. నవంబర్ 8వ తేదీన పెద్దనోట్ల రద్దు నిర్ణయం జరిగిన తర్వాత అనేక కష్టనష్టాలను నవంబర్ మాసంలోనే ఎదుర్కొన్న సింగరేణి కార్మికులకు డిసెంబర్ నెలలో కొంత ఊరట లభిస్తుందనే ఆశాభావం ఉండేది. కానీ బ్యాంకులలో నగదు నిల్వలు సరిగ్గా లేకపోవడం, ఎక్కువ శాతం ఎటిఎంలు మూతపడి ఉండటం కార్మికులకు శాపంగా పరిగణించింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రూ.10వేలు విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ పాస్‌బుక్‌తో సహా విత్‌డ్రా ఫామ్ తప్పకుండా తీసుకు వెళ్తున్నప్పటికీ కొన్నిచోట్ల భారీ క్యూలైన్లలో నిలుచుని తీరా తమ దాకా వచ్చేసరికి నో క్యాష్ బోర్డులు వెక్కిరిస్తుండటంతో దిగాలుగా వెనుతిరుగుతున్నారు. సింగరేణి విస్తరించివున్న ఆరు జిల్లాలో పనిచేస్తున్న కార్మికులకు ప్రతినెల రూ 230కోట్లు వేతనాల రూపంలో ఉంటుంది. వేతనాలు పడిన మొదటి వారంలోపే 60శాతం వేతనాలు విత్‌డ్రా చేసుకుంటారు. కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది. పెద్దనోట్ల రద్దు సింగరేణి కార్మికులకు తీవ్ర శరాఘాతమైంది. అయితే గుడ్డిలో మెల్ల అన్నచందంగా సింగరేణి ఆధ్వర్యంలో నడుస్తున్న సూపర్‌బజార్లలో రూ 10వేల వరకు కార్మికులకు అరువు పద్ధతిన నిత్యావసర వస్తువులను సమకూర్చుతుండటంతో కొంత వెసులుబాటుగా ఉంది.

బ్యాంక్‌ల వద్ద తగ్గని రద్దీ
కొణిజర్ల, డిసెంబర్ 8: పెద్దనోట్లను రద్దు చేసి నెలరోజులు గడుస్తున్న బ్యాంక్‌ల వద్ద తగ్గటం లేదు. రోజు, రోజుకు రద్దీ పెరుగుతుంది తప్ప తగ్గటం లేదు. స్థానిక స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ కార్యాలయం వద్ద నగదు కోసం గురువారం ఖాతాదారులు భారీగా క్యూలో నిలబడ్డారు. నగదు సరిపడ రాకపోటంతో ఒక్కరికి రెండువేలు మాత్రమే అందచేస్తున్నారు. ఖాతాలో డబ్బులున్నా తీసుకునే అవకాశం లేకపోటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేవలం రెండువేల కోసం గంటలు తరబడి నిబడల్సి వస్తుందని ప్రజలు ఆవేతన వ్యక్తం చేస్తున్నారు.
బ్యాంకు ముందు ఆందోళన
ముదిగొండ: బ్యాంకులో నగదు ఇవ్వకపోవడంతో గురువారం ముదిగొండ ఎస్‌బిహెచ్ శాఖ ముందు ఖాతాదారులు ఆందోళన నిర్వహించారు. ఉదయం నుంచి నగదు కోసం వేచి ఉన్నా కొంత మందికి మాత్రమే డబ్బులు ఇవ్వడంతో మిగిలిన ఖాతాదారులు బ్యాంకు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.నగదు లేకపోవడంతో బ్యాంకు ఎదుట ఆందోళన నిర్వహించారు. కనీస అవసరాలకు కూడా నగదు ఇవ్వకపోవడంతో తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు.