ఖమ్మం

రెండున్నరేళ్లలో రూ. 4166 కోట్ల పనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, డిసెంబర్ 12: గడిచిన రెండున్నరేళ్ళ కాలంలో ఖమ్మం జిల్లా లో 4,166 కోట్ల రూపాయలతో అభివృ ద్ధి పనులు చేపట్టామని రాష్ట్ర రోడ్లు, భవ నాల శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. సోమవారం కూసుమంచి మండలం ఎర్రగడ్డ తండావద్ద భక్తరామదాసు ప్రాజెక్ట్ నిర్మాణ ప నులను పరిశీలించిన అనంతరం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభు త్వం తెలంగాణ పునర్నిర్మాణ కార్యక్రమాలను వేగవంతం చేసిందన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఇంటింటి కి మంచినీళ్ళు అందించేందు కు మిష న్ భగీరథ పథకం పనులు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు. ఖమ్మం జిల్లాలో రెండు ప్రధాన ఇరిగేషన్ ప్రాజెక్టులు మంజూరు చేశామని, ఇందులో 60వేల ఎకరాలకు సాగునీరందించేందుకు 600కోట్ల రూపాయలతో భక్తరామదాసు ప్రాజెక్టును నిర్మిస్తున్నామన్నారు. ఈ ప్రాజెక్ట్ భూసేకరణతో పాటు నిర్మాణ పనులను ఏడాదిలోగా పూర్తిచేసిన ఘనత జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్లతే దక్కుతుందన్నారు. భక్తరామదాసు ప్రాజెక్టు ద్వారా పాలేరు నియోజకవర్గం శాశ్వతంగా కరవు నుంచి భయటపడుతుందన్నారు. మిషన్ కాకతీయ ద్వారా 4500 చెరువులకు పూర్వవైభవం తీసుకువస్తున్నామన్నారు. ఇప్పటికే 1800 చెరువుల్లో పనులు పూర్తయి జలకళను సంతరించుకున్నాయన్నారు. గోదావరి జలాలను వినియోగంలోకి తెచ్చేందుకు ఖమ్మం జిల్లాలో సీతారామ ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి కెసిఆర్ ఆరునెలల క్రితం శంకుస్థాపన చేశారని, ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఇప్పటికే ప్రభుత్వం ఏడువేల కోట్ల రూపాయలు విడుదల చేసిందన్నారు. ఖమ్మం జిల్లా గోదావరి జలాలను వినియోగంలోకి తీసుకువస్తే సస్యశ్యామలం అవుతుందని, శాశ్వతంగా కరవును దూరం చేయడంతో పాటు ఉపాధి అవకాశాలను మెరుగుపర్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. సంక్రాంతిలోగా టెండర్లు పూర్తి చేస్తామని వెల్లడించారు. 1783 కోట్లతో జిల్లాలో రహదారుల వెడల్పు కార్యక్రమం ముమ్మరంగా సాగుతుందన్నారు. 88 సబ్‌స్టేషన్ల నిర్మాణం పూర్తయిందని, భద్రాద్రి పవర్‌ప్లాంట్, కెటిపిఎస్ ద్వారా వచ్చే ఏడాది 2080 మెగావాట్ల విద్యుత్‌ను అందించడం జరుగుతుందన్నారు. విద్య, వైద్య రంగాల అభివృద్ధి కోసం వేలకోట్ల రూపాయలు ఖర్చుచేశామన్నారు. సమావేశంలో కలెక్టర్ లోకేష్‌కుమార్, ఖమ్మం ఎమ్మెల్యే అజయ్‌కుమార్, ఖమ్మం మార్కెట్ చైర్మన్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

టూరిజం అభివృద్ధి పనుల పరిశీలన
కొత్తగూడెం, డిసెంబర్ 12: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 25 కోట్ల రూపాయలతో చేపట్టిన టూరిజం అభివృద్ధి పనులను కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు, కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకటరావులు సోమవారం పరిశీలించారు. కొత్తగూడెం క్రాస్‌రోడ్డువద్ద నిర్మిస్తున్న టూరిజం హోటల్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. నిర్మాణ మ్యాపును పరిశీలించారు. ఈకార్యక్రమంలో డిఎస్పీ సురేందర్‌రావు, పంచాయితీరాజ్ ఇఇ రామచంద్రం, డిఇ సుధాకర్, తహశీల్దార్ గన్యా, సిఐ షుకూర్ లు పాల్గొన్నారు.

అభివృద్ధిలో జిల్లా ముందంజ
ఖమ్మం(ఖిల్లా), డిసెంబర్ 12: అభివృద్ధిలో ఖమ్మం జిల్లా ముందంజలో ఉందని, అందుకు కారణం మంత్రి తుమ్మల నాగేశ్వరరావేనని టిఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు కమర్తపు మురళీ అన్నారు. సోమవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో గత పాలకులు ఖమ్మం జిల్లాను నిరాశపరిస్తే తుమ్మల నాగేశ్వరరావు మంత్రిగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్నారు. వందకోట్లతో నగర అభివృద్ధి, గోళ్ళపాడు ఛానెల్ మెరుగు, షాదీఖానా పునర్నిర్మాణం, ధంసలాపురం ఆర్‌ఓబి, లకారం చెరువు సుందరీకరణ తదితర ప్రతిపాదనలు తుమ్మల తెచ్చినవేనన్నారు. మంత్రిగా ఆయన రెండు సంవత్సరాల పాలనలో ఖమ్మం జిల్లా అభివృద్ధిలో ముందుందని స్పష్టం చేశారు. విలేఖరుల సమావేశంలో పగడాల నాగరాజు, రాంబాబు, చింతనిప్పు కృష్ణచైతన్య తదితరులు పాల్గొన్నారు.

మోదీ నిర్ణయంతో ఆర్థిక ఇబ్బందులు
* తెలంగాణలో గాడితప్పిన పాలన: కూనంనేని
ఖమ్మం(జమ్మిబండ), డిసెంబర్ 12: ప్రధాని మోదీ ఏకపక్షంగా 500,1000 పెద్దనోట్లను రద్దుచేస్తూ తీసుకున్న నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసిందని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. సోమవారం స్థానిక పార్టీ కార్యాలయంలో జరిగిన సిపిఐ ఖమ్మం జిల్లా సమితి సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఛాయ్‌వాలానని చెప్పుకునే మోదీ తన నిర్ణయాన్ని మాత్రం సంపన్నవర్గాలకు అనుకూలంగా తీసుకుంటున్నారని ఆరోపించారు. ప్రకటనలకు మాత్రం పేదలపక్షాన చేస్తూ నిర్ణయాలు కార్పొరేట్ సంస్థల కనుసైగల్లోనే జరుగుతున్నాయన్నారు. నోట్ల రద్దుతో నల్ల కుబేరులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారని, సామాన్యులు రెండువేల నోటుకోసం రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారన్నారు. మోదీ నిర్ణయాలను సరికాదన్న వారిని దేశద్రోహులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని, దీనిని ప్రజలు ఎన్నటికీ నమ్మరన్నారు. కాగా రాష్ట్రంలో కెసిఆర్ పాలన గాడితప్పిందని, అవినీతితో పాటు కమీషన్ల దందా పెచ్చుమీరుతుందన్నారు. కెసిఆర్ పాలన ఫామ్‌హౌజ్‌కె పరిమితమవుతూ వాగ్దానాల అమలులో వందశాతం ఘోరంగా విఫలమైందన్నారు. రైతు రుణమాఫీ మొదలుకొని కెజిటుపిజి ఉచిత విద్య, డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి సహా ఏ హామీని నెరవేర్చలేకపోతున్నారన్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ అధికార పార్టీ నేతలకు కమీషన్ల అడ్డాగా మారాయని దుయ్యబట్టారు. పాలకులు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడేందుకు ప్రజలు సిద్ధం కావాలన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి బాగం హేమంతరావు, పువ్వాడ నాగేశ్వరరావు, టివి చౌదరి తదితరులు పాల్గొన్నారు.

చెరువులో పడి
విద్యార్థి మృతి

తిరుమలాయపాలెం, డిసెంబర్ 12: చెరువులో పడిన పతంగిని తెచ్చుకోవటానికి వెళ్ళిన 11 సంవత్సరాల విద్యార్థి ఈత రాక చెరువులో మునిగి మృతి చెందిన సంఘటన బీరోలు గ్రామంలో సోమవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం తోట శ్రీనివాస్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో నాల్గవ తరగతి చదువుతున్నాడు. శ్రీనివాస్ పతంగులు ఎగురవేసేందుకు ఊరుబయటకు వెళ్లాడు. ఈ క్రమంలో పతంగి తెగి చెరువులో పడింది. పతంగిని తీసుకునేందుకు చెరువులో దిగిన శ్రీనివాస్‌కు ఈత రాకపోవడంతో చెరువులో మునిగి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, తోటి విద్యార్థులు సంఘటనాస్థలానికి చేరుకొని కన్నీరుమున్నీరయ్యారు. బందువుల ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ ఎం నాగరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పెద్దనోట్ల రద్దుతో పేదలకే కష్టాలు
ఖమ్మం(ఖిల్లా), డిసెంబర్ 12: కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం 500,1000 రూపాయల పెద్దనోట్ల రద్దు పేదలకే కష్టాలని, బడా వర్గాలు ముందుగానే సర్ధుకున్నాయని సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసి జిల్లా కార్యదర్శి గోకినేపల్లి వెంకటేశ్వరరావు అన్నారు. సోమవారం స్థానిక రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నోట్లు రద్దుచేసి నెలరోజులు దాటినప్పటికీ సమస్య ఏ మాత్రం పరిష్కారానికి నోచుకోలేదన్నారు. ప్రతిరోజు తమ డబ్బులు తెచ్చుకునేందుకు బ్యాంకులవద్ద గంటల తరబడి వేచి ఉండక తప్పడంలేదన్నారు. సామాన్యుడు రెండువేల నోటుకోసం నానా తంటాలు పడుతుంటే బడాబాబులు వందలకోట్ల రెండువేల నోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయని ప్రశ్నించారు. దీనివెనుక పాలకులు, బ్యాంక్ అధికారుల హస్తం ఉంటుందని ఆరోపించారు. వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం కుదేలవుతున్నప్పటికీ నివారణ చర్యలు తీసుకోకపోవడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు 14.18లక్షల పాత కరెన్సీ స్థానంలో 13లక్షల కోట్లు బ్యాంకులకు చేరిపోయాయన్నారు. పెద్దనోట్ల రద్దుకు ప్రత్యామ్నయ చర్యలను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. విలేఖరుల సమావేశంలో నాయకులు ఆవుల వెంకటేశ్వర్లు, జి రామయ్య, అశోక్, ఝాన్సీ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

మధుకన్, బౌద్ధ స్తూపాన్ని
సందర్శంచిన 31 జిల్లాల విద్యార్థులు
నేలకొండపల్లి, డిసెంబర్ 12: దక్షిణ భారతదేశంలో అతి పెద్దదైన బౌద్ధస్తూపాన్ని విద్యార్థులు సందర్శించారు. సోమవారం జనవిజ్ఞాన వేదిక, నేలకొండపల్లి ఎంఇఒ పురుషోత్తమరావు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర స్థాయి సైన్స్ సంబరాలలో భాగంగా రాష్ట్రంలోని 31 జిల్లాల విద్యార్థులు రాజేశ్వరపురం గ్రామ సమీపంలోని మధుకన్ షుగర్ అండ్ పవర్ ప్యాక్టరిని, నేలకొండపల్లి గ్రామ సమీపంలోని బౌద్ధస్తూపాన్ని సందర్శించారు. చెకుముకి పోటీలలో భాగంగా పరీక్షను రాసి దాదాపు 469 మంది విద్యార్థులు సందర్శించారు. విద్యార్థులకు ఎంఇఒ పురుషొత్తమరావు బౌద్దస్ధూపం చరిత్రను వివరించారు. బౌద్ధస్ధూపం చూట్టు తిరిగి ఆధారాలను పరిశీలించారు. మధుకన్ ప్యాక్టరీ పనితీరును వివరించారు. విద్యార్థులకు స్ధానిక భక్తరామదాసు సర్వీస్ సొసైటి ఆధ్వర్యంలో అల్పాహరం అందించారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన్ వేదిక బాస్కర్‌రెడ్డి, పిఆర్‌పిలు రత్నకుమార్, శ్రావణ్‌కుమార్, సతీష్, భక్తరామదాసు సర్వీస్ సొసైటి కార్యదర్శి వెలంపల్లి శ్రీనివాసరావు, మచ్చా రఘపతి, కొంగర సత్యనారాయణ, రామరావు, వీరబాబు, లెనిన్ తదితరులు పాల్గొన్నారు.

జానపద కళాకారులను ప్రోత్సహించాలి
గార్ల, డిసెంబర్ 12: ప్రపంచీకరణ నేపథ్యంలో అంతరించి పోతున్న తెలంగాణ జానపద కళలలను తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహించాలని తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం మహబూబాబాద్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ భూక్య సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. స్థానిక తెలంగాణ విద్యావంతుల వేదిక కార్యాలయంలో సోమవారం జరిగిన జానపద కళాకారుల మండల మహసభలో అయన ప్రసంగిస్తూ ఒగ్గుకథ, కోలాటం, చిరుతభజన, గంగిరెద్దులు, సింధుయక్షగానం, బుర్రకథ తదితర కళాకృతులు మటుమాయం కాకుండ ప్రభుత్వం చొరవ చూపాలన్నారు. కళాకారులు సహితం తమ కళలకు పదుపెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా సలహాదారుడు జె.విశ్వ, మహబూబాబాద్ డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు కుదురుపాక భిక్షమయ్య, తాళ్ళూరి నాగయ్య, రాజమల్లు, షర్ఫోద్ధీన్, బండారి నాగేశ్వరరావు పాల్గొన్నారు. అనంతరం మండల నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కన్వీనర్‌గా తాళ్ళూరి లక్ష్మీనర్సయ్య, కో-కన్వీనర్‌గా ఏనుగంటి రాజమల్లులను ఎన్నుకున్నారు.

ప్రజా సమస్యలపై సమరశీల పోరాటాలు
* సిపిఎం రాష్ట్ర నాయకుడు నున్నా
కామేపల్లి, డిసెంబర్ 12: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధినాలపై సమరశీల పోరాటాలకు సిద్ధంకావాలని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నున్నా నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక సిపిఎం కార్యాలయంలో జరిగిన మండల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నోట్ల రద్దు అనాలోచిత చర్యన్నారు. దీని వల్ల పేద ప్రజానీకానికి, సామాన్యులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. కేవలం బడాబాబులకు మాత్రమే ఉపయోగపడుతుందని విమర్శించారు. అదే విదంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజ సమస్యలను పట్టించుకోకుండ కుటుంబ పాలన చేస్తుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను వ్యతిరేకిస్తూ తమ పార్టీ ఆధ్యర్యంలో పెద్ద ఎత్తున ఆందోళను చేపట్టనున్నట్లు ఆయన వెల్లండించారు. గ్రామాలలో ప్రజలను చైతన్యం చేస్తూ ఆందోళన చేపట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు దుగ్గి కృష్ణ, డివిజన్ నాయకులు మెరుగు సత్యనారాయణ, మండల కార్యదర్శి బాదావత్ శ్రీను, సలీం, హుస్సేన్, మల్లెంపాటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

పర్యావరణ పరిరక్షణకు నడుంకట్టిన చిన్నారులు
* స్వచ్ఛ్భారత్ పాటించాలని ప్రచారం
సత్తుపల్లి, డిసెంబర్ 12: సిద్ధారం పంచాయితీలో గల రాజీవ్‌నగర్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకునేందుకు ఆ కాలనీ చిన్నారులు స్వచ్ఛ్భారత్ కార్యక్రమానికి సోమవారం శ్రీకానం చుట్టారు. పాఠశాలలకు సెలవు రోజుల్లో కాలనీలో ప్రతి వీధి పరిశుభ్రంగా ఉండేందుకు ఇంటి యజమానులకు అవగాహన కల్పించి, పిచ్చిమొక్కలను తొలగించి, రోడ్లు శుభ్రం చేయటం జరుగుతుందన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంటుందని, ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటారని వివరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో హిమేష్, కృష్ణవంశీ, సాయి తన్మయి, మునీరా, సమీరా, కుష్మిత, షాహిన్, సింధు ప్రియ, అస్మిత, సంగీత, కావ్య తదితరులు పాల్గొన్నారు.

సామాజిక న్యాయం రాజ్యాంగ హక్కు
* సిపిఎం జిల్లా నాయకుడు నర్సయ్య
ఖమ్మం(కల్చరల్), డిసెంబర్ 12: సామాజిక న్యాయం అనేది రాజ్యాం గం కల్పించిన హక్కు అని, అది ఏ ప్రభుత్వం యొక్క దయాధర్మం కాదని సిపిఎం జిల్లా నాయకుడు కె నర్సయ్య అన్నారు. సోమవారం స్థానిక సుందరయ్య భవన్‌లో జరిగిన సిపిఎం ఖమ్మం అర్బన్ మండల కమిటి జనరల్‌బాడి సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో పాలకులు మారారే తప్ప విధానాల్లో మార్పురాలేని ఆరోపించారు. అట్టడుగు వర్గాల్లో అభివృద్ధి జరగాలంటే ప్రత్యామన్యయ పాలన కావాలన్నారు. అందుకోసం సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి జరగాలంటే ప్రత్యామ్నాయ రాజకీయాలు రావాలన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని ఆధ్వర్యంలో జరిగే మహాజన పాదయాత్రలో అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలన్నారు. ఈ సమావేశంలో సిపిఎం మండల కార్యదర్శి షేక్ మీరాసాహెబ్, రాష్ట్ర నాయకులు బుగ్గవీటి సరళ, మండల నాయకులు ముక్కపాటి నాగమణి, బొగ్గారాపు రాజు, ఉపేందర్, గుడికందుల సత్యనారాయణ, ఎర్రబోయిన లింగయ్య తదితరులు పాల్గొన్నారు.