ఖమ్మం

మణుగూరులో 45 కిలోల గంజాయి స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మణుగూరు, డిసెంబర్ 23: మణుగూరు పట్టణంలో శుక్రవారం జరిగిన పోలీసు తనిఖీల్లో 45 కేజీల గంజాయి పోలీసులకు పట్టుబడింది. ఈ సంఘటనకు సంబంధించిన మణుగూరు సీఐ కె.మొగిలి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పోలీసులు విధుల్లో భాగంగా వాహన తనిఖీలు చేస్తుండగా పోలీసుస్టేషన్ సమీపంలో అనుమానాస్పదంగా ఉన్న ఒక వాహనాన్ని తనిఖీ చేయగా వాహనంలో 45కేజీల గంజాయితీ పాటు ఒక కత్తి, ఇనుపరాడ్ లభించాయి. ఏపీ 31 ఏవై 3355 నెంబర్ గల స్కార్పియో వాహనంలో ఈ గంజాయిని హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు పట్టుబడిన ఇద్దరు నిందితులు కాండ్రు ఫ్రాన్సిస్, దాసరి శ్యామ్‌లు ఒప్పుకున్నట్లు సీఐ తెలిపారు. ఈ సంఘటనకు సంబంధం ఉన్న మరో ముగ్గురు నిందితులు కాండ్రు హేమంత్, కాండ్రు భాస్కర్, ఎండీ పాషాలు తనిఖీ నిర్వహిస్తుండగానే సంఘటన స్థలం నుంచి తప్పించుకొని పరారయ్యారని, ఆ ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకుంటామని ఆయన తెలిపారు. పట్టుబడిన గంజాయి బహిరంగ మార్కెట్‌లో రూ.4.50లక్షలు విలువజేస్తుందని తెలిపారు. పట్టుబడిన నిందితులు తెలిపిన వివరాల ప్రకారం కొంతకాలంగా సమితిసింగారం ఎన్టీఆర్ నగర్‌కు చెందిన ఫ్రాన్సిస్ ఆధ్వర్యంలో ముఠాగా ఏర్పడి ఆంధ్రాలోని సీలేరు నుంచి గంజాయిని మణుగూరుకు దిగుమతి చేసి అక్కడ నుంచి నేరుగా హైదారాబాద్‌కు తరలిస్తున్నట్లు ఒప్పుకున్నారని తెలిపారు. కేసును మరింత లోతుగా దర్యాప్తు చేసి కఠిన చర్యలు చేపడతామని ఆయన తెలిపారు. ఈ తనిఖీల్లో సీఐ వెంట ఎస్సై నరహరి, సిబ్బంది వీరన్న, సుహాని, మోహన్ ఉన్నారు.

బొగ్గు ఉత్పత్తిలో సింగరేణి సంస్థను దేశంలో అగ్రగామిగా నిలుపుతాం

కొత్తగూడెం, డిసెంబర్ 23: థర్మల్ పవర్ స్టేషన్ల నుండి వస్తున్న డిమాండ్లకు అనుగుణంగా అధిక బొగ్గు ఉత్పత్తి సాధించి సింగరేణి సంస్థను దేశంలో అగ్రగామిగా నిలుపుతామని సింగరేణి కాలరీస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్ తెలిపారు.
సింగరేణి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుక్రవారం స్థానిక ప్రకాశం స్టేడియంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తి రంగంతో పాటు, విద్యుత్ తయారీలో కీలకపాత్ర పోషిస్తుందని తెలిపారు. సింగరేణి సంస్థలో 20 సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న వారసత్వ ఉద్యోగాలు ఇస్తున్నట్లు ప్రకటించారు. రానున్న పది సంవత్సరాలలో సింగరేణి సంస్థలో 30 వేల మంది కార్మికుల వారసులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని తెలిపారు. జనవరి 1వ తేదీ నుండి వారసత్వ ఉద్యోగాలకు దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సింగరేణిలో ఐదు వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు తెలిపారు. 128 సంవత్సరాల చరిత్ర కల్గిన సింగరేణి సంస్థ ఈ ఏడాది 15 శాతం అధిక ఉత్పత్తి సాధించి సుమారు రూ 1000 కోట్ల లాభాలను ఆర్జించిందని తెలిపారు. సంస్థకు వచ్చిన లాభాల నుండి కార్మికులకు 23 శాతం లాభాలను కార్మికులకు అందజేశామన్నారు.
సింగరేణి కార్మికులకు మెరుగైన వైద్య సదుపాయం అందించేందుకు సూపర్ స్పెషాలిటీ వైద్యుల సేవలు ఉపయోగించుకుంటున్నామన్నారు. కార్మిక వాడల్లో అంతర్గత రహదారులు, డ్రైనేజి వ్యవస్థను మెరుగుపరచడం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. నిరుద్యోగ యువకులకు వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆలోచనలకు అనుగుణంగా బంగారు తెలంగాణ సాధించేందుకు సింగరేణి కార్మికులు, ఉద్యోగులు కృషి చేయాలని కోరారు.
విలేఖరుల సమావేశంలో సింగరేణి డైరెక్టర్ (పా) పవిత్రన్ కుమార్, ప్రాజెక్టు అండ్ ప్లానింగ్ డైరెక్టర్ మనోహర్‌రావు, ఇఅండ్‌ఎం డైరెక్టర్ రమేష్‌బాబు, జిఎం పర్సనల్ ఆనందరావు, మురళీసాగర్‌కుమార్, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అధ్యక్షుడు బి వెంకట్రావు, సిఎంఒఎ అధ్యక్షుడు గడిపల్లి కృష్ణప్రసాద్, గుర్తింపు సంఘం నాయకులు ఆకునూరి కనకరాజు తదితరులు పాల్గొన్నారు.

త్రివేణిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

కొత్తగూడెం రూరల్, డిసెంబర్ 23: క్రిస్మస్ వేడుకలను లక్ష్మీదేవిపల్లి మండల కేంద్రంలోని త్రివేణి పాఠశాలలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా పాఠశాలలో సాంప్రదాయబద్దంగా క్రిస్మస్ కేక్‌ను కట్‌చేసి చిన్నారులకు పంపిణీ చేసారు. అనంతరం పాఠశాల డైరెక్టర్ గొల్లపూడి జగదీష్ మాట్లాడుతూ ప్రతి హృదయంలో క్రీస్తుజ్యోతి వెలగాలని శాంతి, ప్రేమ, కరుణ దానంచేసే గుణం ప్రతి ఒక్కరిలో ఉండాలని యేసు మార్గంలో అందరూ పయణించాలన్నారు. చిన్నారులచే యేసుక్రీస్తు జనన దృశ్యాలను నాటిక రూపంలో ప్రదర్శించిన తీరు విద్యార్థుల ప్రదర్శించిన నృత్యాలు, శాంటాక్లాజ్, ఏంజీల్స్, మరియమ్మ, గొర్రెల కాపరి వేషధారణలో ఆకట్టుకున్నాయి.