ఖమ్మం

అధికారులు సమన్వయంతో పనిచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, డిసెంబర్ 23: ముక్కోటి ఉత్సవాల్లో అధికారులంతా సమన్వయంతో పని చేసి విజయవంతం చేయాలని ఆర్డీవో బి.శివనారాయణరెడ్డి అన్నారు. తన కార్యాలయంలో ముక్కోటి ఉత్సవాలపై ఆయన శుక్రవారం అధికారులతో సమావేశం నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల నుంచి, అలాగే ఒడిషా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నందున భక్తుల భద్రతపై పోలీసుశాఖ ద్వారా చేపడుతున్న చర్యలను సీఐ శ్రీనివాసరావు వివరించరు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆర్డీవో చెప్పారు. గోదావరిలో లోతు తెలిపే బోర్డులు, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని, ఉత్సవాల్లో విధులు నిర్వహించే వారికి డ్యూటీపాస్‌లు తప్పనిసరిగా ఇవ్వాలని ఆదేశించారు. గ్రామ పంచాయితీ ద్వారా దేవాలయం పరిసర ప్రాంతాల్లో చెత్తాచెదారం లేకుండా చర్యలు చేపట్టాలని, పారిశుద్ధ్య పనులు మెరుగ్గా ఉండేందుకు పర్యవేక్షణ అధికారులను నియమించుకోవాలని చెప్పారు. సేకరించిన చెత్తను సూచించిన ప్రాంతంలో డంపింగ్ చేయాలని, సంబంధిత అధికారుల సహకారంతో విధులు నిర్వహించాలని ఆర్డీవో సూచించారు. 100 పర్మినెంట్ టాయిలెట్స్, 60 తాత్కాలిక టాయిలెట్స్ ఏర్పాటు చేస్తామని, అలాగే నిర్ధేశిత ప్రాంతాల్లో భక్తుల సౌకర్యార్ధం టెంట్లు ఏర్పాటు చేసి డ్రమ్ముల్లో తాగునీరు ఏర్పాటు చేస్తామని ఆర్‌డబ్య్లూఎస్ డీఈ శ్రీనివాసరావు ఆర్డీవోకు వివరించారు. ఆలయ పరిసరాల్లో 25 ట్యాప్‌లు ఏర్పాటు చేసి భక్తులకు అందిస్తామన్నారు. తెప్పోత్సవానికి వాడుతున్న హంసవాహనానికి విద్యుత్ అలంకరణ, మైక్ సిస్టం ఏర్పాటు చేసి ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలని సంబంధిత అధికారులకు ఆర్డీవో సూచించారు. ఉత్సవాలకు మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు వచ్చే అవకాశం ఉన్నందున ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. దేవస్థానం పరిసరాల్లో పాలు, పండ్లు సరసమైన ధరలకు అందించాలని అన్నారు. ఆర్డీసీ ద్వారా 105 బస్సులను నడుపుతున్నామని ఆర్టీసీ అధికారులు తెలపగా భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆర్డీవో సూచించారు. ఉత్సవాల రోజుల్లో మద్యం అమ్మకాలు నిషేధించేందుకు ఎక్సైజ్‌శాఖ చర్యలు తీసుకోవాలని, పార్కింగ్ సమస్యలు లేకుండా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని ఆర్డీవో ఆదేశించారు. ఎటువంటి అగ్నిప్రమాదాలు చోటు చేసుకోకుండా సంబంధిత శాఖ చర్యలు తీసుకోవాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ట్రాఫిక్ సమస్య లేకుండా పోలీసుశాఖ చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో తహసిల్దార్ రామకృష్ణ, ఎంపీడీవో రమాదేవి, సీఐ శ్రీనివాసులు, నీటిపారుదల శాఖ జేఈ రాధాకృష్ణ, ఏఈ వెంకటేశ్వర్లు, డిప్యూటీ డీఎంవో సింగరాజు, టెంపుల్ డీఈ రవీంధర్, ఆర్‌డబ్య్లూఎస్ డీఈ ఎన్.శ్రీనివాస్‌రావు, గ్రామ పంచాయితీ ఈవో శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
గుడుంబా నియంత్రించాలి

ఖమ్మం, డిసెంబర్ 23: గ్రామీణ ప్రాంతాల్లో గుడుంభా మహమ్మారిని తరిమికొట్టేందుకు పకడ్భందీగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డిఎస్ లోకేష్‌కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో తహశీల్దార్లు, మండల అభివృద్ధి అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామాలలో గుడుంబా విక్రయించే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామంలో గుడుంబా విక్రయాలు జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని, గుడుంబ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. అలాగే బియ్యం అక్రమ రవాణా చేసే వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని మండలాల్లో నగదు రహిత లావాదేవిలు జరిగేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, అన్ని దుకాణాలు, షాపుల యజమానులతో సమావేశపర్చి డిజిటల్ లావాదేవిలు పూర్తిస్థాయిలో అమలు జరిగే విధంగా చైతన్యపర్చాలని ఆయన సూచించారు. జిల్లాకు గురుకుల పాఠశాలలు మంజూరైన దృష్ట్యా నూతన భవన నిర్మాణాలు చేపట్టేందుకు అవసరమైన స్థలాలను సత్వరమే గుర్తించాలన్నారు. ప్రతి పంచాయతీలో డంపింగ్‌యార్డు, స్మశానవాటిక ఏర్పాటుకు అన్ని చర్యలు తీసుకోవాలని తెలిపారు. వ్యక్తిగత మరుగుదొడ్ల లక్ష్యాన్ని సాధించేందుకు ప్రణాళికబద్దంగా ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. వచ్చే హరితహారం కింద అన్ని మండలాల్లో 65లక్షల మొక్కలను నాటాలనే లక్ష్యంగా రూపొందించిన ప్రణాళికకు అనుగుణంగా ప్రతి మండలంలో మూడులక్షల మొక్కలను నాటేందుకు అవసరమైన ప్రదేశాలను గుర్తించాలని ఆదేశించారు. ఆసరా పెన్షన్లు ఖాతాలను పూర్తిస్థాయిలో ఆధార్ సీడింగ్ చేయించడానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. మండలాల్లో కోల్డ్ స్టోరేజ్‌లను రెగ్యులర్‌గా తనిఖీ చేయాలని, ప్రజావాణి ద్వారా వచ్చే విజ్ఞప్తులపై ప్రత్యేక దృష్టి సారించి త్వరితగతిన పరిష్కరించాలన్నారు. ఈ సమావేశంలో జెసి వినయ్‌కృష్ణారెడ్డి, డిఆర్వో జె శివశ్రీనివాస్, డిఆర్‌డిఓ ఆర్ మురళీధర్‌రావు, ఆర్డీఓ పూర్ణచందర్, కల్లూరు ఆర్డీఓ కుముదిని, ఎక్సైజ్ సూపరిండెంట్ విజయ్‌కుమార్, తహశీల్దార్లు, మండల అభివృద్ధి అధికారులు పాల్గొన్నారు.