ఖమ్మం

అంబరాన్నంటిన క్రిస్మస్ సంబరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం (కల్చరల్), డిసెంబర్ 25: జిల్లా వ్యాప్తంగా క్రిస్మస్ సంబరాలు అంబరాన్నంటాయ్. లోకరక్షకుడు ఏసు ప్రభువు పుట్టిన రోజు వేడుకల్ని క్రిస్టియన్ సోదరులు వాడ వాడలా ఘనంగా నిర్వహించారు. విద్యుత్ దీపాల వెలుగులు, రంగురంగు పూల అలంకరణలతో చర్చిలను సుందరంగా అలంకరించారు. క్రిస్టియన్లు నిర్వహించే అతి పవిత్రమైన, పెద్ద పండుగను ఇంటిల్లి పాది ఆడంభరంగా జరుపుకున్నారు. ఆర్‌సియం చర్చిలో ఈ వేడుకల్ని శనివారం రాత్రి నుండే నిర్వహించగా, ఇండిపెండెంట్ చర్చిల్లో మాత్రం ఆదివారం ఉదయం నుండి అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకున్నారు. క్రిస్టియన్లు ముందుగా తమ ఇండ్ల వద్ద కేకులు కట్‌చేసి బంధువులకు, స్నేహితులకు పంచిపెట్టి ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. సుదూర ప్రాంతాల్లో ఉన్న బంధువులకు, స్నేహితులకు తమ ఫోన్ల ద్వారా సంక్షిప్త సందేశాలను, శుభాకాంక్షలు తెలుపుకోవడం విశేషం. కుటుంబ సమేతంగా ఆయా పరిధిలోని చర్చిలకు వెళ్ళి ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. క్రీస్తు జన్మదినం సందర్భంగా అన్ని దేశాల్లో ఈ వేడుకలు ఘనంగా జరుగుతాయని ఆయా చర్చి ఫాదర్లు తమ సందేశంలో తెలిపారు. ఈ సందర్భంగా లోకమంతా శాంతి సమాధానాలతో, అయురారోగ్యాలతో, సిరి సంపదలతో, పాడి పంటలతో, పశుపక్షాదులతో, ప్రజలంతా సుఖసంతోషాలతో, ఏసు ప్రభువు దీవెనలతో జీవించాలని వారు ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. చర్చిల్లో శాంతాక్రాజ్ వేషధారణలు భక్తులను ఎంతగానో అకట్టుకున్నాయి. పిల్లలను ఈ వేషధారణలు మరింత ఆకట్టుకోవడంతో శాంతాక్రాజ్‌తో వివిధ భంగిమల్లో ఫోటోలు దిగి ఆనందం పంచుకున్నారు. ఆయా చర్చిల్లో ఫాదర్లు సందేశాలకు ముందు, అనంతరం కళాకారులు, పిల్లలచే ప్రదర్శించిన ఏసుక్రీస్తు పాటలు నృత్యాలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. వైరా రోడ్‌లోని ఆర్‌సియం చర్చి, కరుణగిరి చర్చి, గుట్టలబజార్ చర్చి, బల్లేపల్లి, పల్లిపాడు తదితర చర్చిల్లో శనివారం రాత్రి నుండే వేడుకలు జరగగా, చర్చి కాంపౌండ్‌లోని సియస్‌ఐ చర్చి, ఎన్‌ఎస్‌టి రోడ్‌లోని ట్రినిటి చర్చి తదితర చర్చిల్లో ఆదివారం ఉదయం నుండి వేడుకలు ఘనంగా జరిగాయి. నగరంలోని వైరా రోడ్‌లోని ఆర్‌సియం చర్చి, చర్చి కాంపౌండ్‌లోని సియస్‌ఐ చర్చి, ఎన్‌ఎస్‌టి రోడ్‌లోని ట్రినిటి చర్చిల్లో ఏసుప్రభువు జీవిత చరిత్రను ప్రతిబింబించే తాత్కాలిక కట్టడాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మతాలకు అతీతంగా నగరంలోని అనేక మంది ఈ ఏర్పాట్లను వీక్షించేదుకు చర్చిల్లో బారులు తీరారంటే కళాకారులు ఎంత నైపుణ్యం ప్రదర్శించారో అర్దం అవుతుంది. అనేక మంది భక్తులు, వీక్షకులు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఫోటోలు తీయించుకున్నారు. మరికొందరు మాత్రం తమ సెల్‌ఫోన్‌లలో ఫోటోలు తీసుకున్నారు.
రాష్ట్ర రోడ్లు భవనాలు, మరియు స్ర్తి శిశు సంక్షేమశాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, స్దానిక శాసనసభ్యుడు పువ్వాడ అజయ్‌కుమార్, తెలుగుదేశం పార్టీ పోలిబ్యూరో సభ్యుడు మాజీ పార్లమెంట్ సభ్యుడు నామా నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్, ఎస్‌పి షానవాజ్ ఖాశీం, టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బేగ్, కాంగ్రేస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఐయిత సత్యం, టిడిపి జిల్లా అధ్యక్షుడు తాళ్ళూరి బ్రమ్మయ్య, సిపియం జిల్లా కార్యదర్శి పొన్నం వెంకటేశ్వరరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి బాగం హేమంతరావు, బిజెపి జిల్లా అధ్యక్షుడు సనె్న ఉదయ్‌ప్రతాప్, సిపిఐ ఎంఎల్ న్యూడెమాక్రసీ జిల్లా కార్యదర్శి పోటు రంగారావు తదితరులు జిల్లా ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.

కెజి టూ పిజి ఉచిత విద్య ఉత్త నినాదమే

సత్తుపల్లి, డిసెంబర్ 25: బంగారు తెలంగాణ చేస్తానని గడిచిన మూడేళ్ల కాలంలో విద్యారంగంలో సిఎం కేసిఆర్ ఇచ్చిన హామీలు అమలు కాలేదని విజ్ఞన తెలంగాణ సాధించే వరకు పోరాడుతామని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి బి. సాంబశివ అన్నారు. సత్తుపల్లిలోని మదర్ థెరిస్సా టెక్నో స్కూల్‌లో ఆదివారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కెజి టూ పిజి నినాదంగానే మారిందని ఆయన విమర్శించారు. మూడేళ్ళుగా మూడు వేల కోట్ల ఫీజు రియంబర్స్‌మెంట్ విడుదల చేయకుండా విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని దుయ్యబట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా హాస్టల్స్‌లో 12లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని వీరికి జూన్‌నుంచి ఇప్పటి వరకు బిల్లులు, మెస్, కాస్మోటిక్ చార్జీలు పెంచకుండా ఉన్న బిల్లులను ఆరునెలలుగా పెండింగ్‌లో పెట్టిందని ఆందోళన వ్యక్తం చేశారు.హాస్టల్ సమస్యలు పరిష్కరించకుండా దళిత, గిరిజన, బలహీన వర్గాల విద్యార్థులను చదువుకు దూరం చేస్తుందని విమర్శించారు. పాఠశాల విద్యారంగంపట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టులు, నాన్‌టీచింగ్ పోస్టులు భర్తీ చేయకుండా ప్రయివేటు విద్యను ప్రోత్సహిస్తుందని విమర్శించారు. తెలంగాణాలో ప్రైవేటు యూనివర్సిటీలను అనుమతించడం ద్వారా ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసి కార్పొరేట్ శక్తులకు చదువును దారాదత్తం చేయటమేనని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కె రమేష్ అన్నారు. విద్యార్థుల సమస్యలపై జనవరి 6,7,8 తేదీలలో జరిగే ఎస్‌ఎఫ్‌ఐ తెలంగాణా ద్వితీయ మహాసభలలో భవిష్యత్ పోరాటాలకు రూపకల్పన చేస్తామని తెలిపారు. సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎల్. బాలరాజు, ఆంజనేయలు, రవికుమార్, సహాయ కార్యదర్శులు శ్రీకాంత్, రవి, శివవర్మ, ప్రకాష్ కారత్, రాష్ట్ర బాలికల కన్వీనర్ రజిని,. జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నాగరాజు, గోవర్థన్ తదితరులు పాల్గొని ప్రసంగించారు.