ఖమ్మం

వామనావతార రామా నీకు వందనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, జనవరి 3: వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో పగల్‌పత్ ఉత్సవాల్లో భాగంగా శ్రీసీతారామచంద్రస్వామి మంగళవారం వామనావతారంలో భక్తులకు దర్శనం ఇచ్చాడు. వామనావతార రామయ్యను ఒళ్లంతా కళ్లు చేసుకుని తిలకించి భక్తకోటి పులకించింది. జై శ్రీరామ్ అంటూ వారు చేసిన పూజలకు భద్రగిరులు పరవశించి పోయాయి. శ్రీరామదివ్యక్షేత్రంలో ఏ గిరిని తాకినా రామనామమే స్మరిస్తోంది. అధ్యయనోత్సవాలు ఆధ్యాత్మికతను పంచుతున్నాయి. శ్రీసీతారామచంద్రస్వామికి తెల్లవారుఝామున గోదావరి నుంచి తీర్ధబిందెను తెచ్చి సుప్రభాత సేవ చేశారు. స్వామికి విశేషమైన ప్రత్యేక పూజలు చేసి బాలభోగం ఇచ్చారు. గాలిగోపురానికి ఎదురుగా ఉన్న ఆంజనేయస్వామికి పంచామృతాలతో మంగళవారం సందర్భంగా అభిషేకం చేశారు. అప్పాల, తమలపాకు మాలలు నైవేద్యంగా అలంకరించి హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. శ్రీసీతారామచంద్రస్వామి ఉత్సవమూర్తులను ఊరేగింపుగా బేలమండపానికి తీసుకెళ్లి వామనావతారంలో స్వామిని అలంకరించారు. ఈ సందర్భంగా తిరుప్పావై గోష్టిలో అర్చకులు వేదవిన్నపాలు, దివ్యప్రబంధ, శ్రీమద్రామాయణం, నాల్గు వేదాలు పారాయణం చేశారు. భక్తులకు దర్శనం కల్పించారు. రాజభోగం సమర్పించారు.
సాయంత్రం వేళ స్వామి కోలాటాలు, రామభజనల నడుమ ఆలయం నుంచి ఊరేగింపుగా మిథిలాస్టేడియానికి చేరుకున్నారు. దారి పొడవునా భక్తులు స్వామికి స్వాగతం పలికారు. మిథిలాస్టేడియం వద్ద వేదికపై స్వామిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. స్వామికి ఆరాధన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. ఈ సందర్భంగా వేదిక వద్ద జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు ఉత్సవ శోభను ప్రదర్శించాయి. శ్రీహరి సేవా భజన మండలి రామభజన, పద్మనాభశాస్ర్తీ భక్త పోతన హరికథా కాలక్షేపం, గడ్డం రాములు యక్షగానం, హైదరాబాదుకు చెందిన ప్రమోద్‌కుమార్ రెడ్డి భరతనాట్యం, రాజమండ్రికి చెందిన పరిమళ కూచిపూడి నృత్యం, శ్రీవినాయక సురభి వారి శ్రీసీతారామ కల్యాణం నాటకం భక్తులను ఆనంద డోలికల్లో ముంచెత్తాయి. సంగీత సాంస్కృతిక కార్యక్రమాలు శ్రావ్యంగా సాగాయి. అనంతరం వామనావతార రామయ్య తిరువీధి సేవ రాజవీధుల్లో వైభవంగా సాగింది. స్వామి రాజవీధి నుంచి గోవిందరాజస్వామి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలందుకుని తిరిగి ఆలయానికి చేరుకున్నారు.

కుక్కల దాడిలో విద్యార్థికి తీవ్రగాయాలు
జూలూరుపాడు, జనవరి 3: మండల పరిధిలోని పాపకొల్లు గ్రామ పంచాయతీ శివారు గ్రామం భీమ్లాతండాలో ఒకటవ తరగతి చదువుతున్న విద్యార్థిపై కుక్కలు దాడి చేయటంతో తీవ్ర గాయాలపాలైన సంఘటన మంగళవారం జరిగింది. గ్రామస్ధులు తెలిపిన వివరాల ప్రకారం.. భీమ్లాతండాకు చెందిన ధర్మసోత్ గౌతమ్ స్థానిక గిరిజన ప్రాధమిక పాఠశాలలో ఒకటవ తరగతి చదువుతున్నాడు. మధ్యాహ్న సమయంలో పాఠశాల నుంచి బయటకు రావటంతో రోడ్డుపై ఉన్న కుక్కలు ఒక్క సారిగా బాలుడిపై దాడి చేయటంతో తీవ్రంగా గాయపడ్డాడు. బాలుడిని వైద్యం కోసం తల్లిదండ్రులు, బంధువులు ఖమ్మం ఆసుపత్రికి తీసుకెళ్లారు.

కాంట్రాక్ట్ లెక్చరర్లను క్రమబద్ధీకరించాలి
ఖమ్మం(ఖిల్లా), జనవరి 3: ప్రభుత్వ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్‌లను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం తెలంగాణ రాష్ట్ర కళాశాల కాంట్రాక్ట్ లెక్చరర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక ధర్నాచౌక్‌లో కళ్ళకు గంతలు కట్టుకొని మోకాళ్ళపై నిల్చుని వినూత్న నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా జెఎసి కన్వినర్లు వినోద్‌బాబు, మురళీకృష్ణలు మాట్లాడుతూ కాంట్రాక్ట్ లెక్చరర్‌ల ఉద్యోగాలు క్రమబద్దికరించడంతో పాటు తక్షణమే వేతనాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఒకేషనల్ రెండవ పోస్టును మంజూరు చేయాలని, మహిళలకు వేతనాలతో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వాలన్నారు. తమ సమస్యలను అనేక సార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినప్పటికి ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైన సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చొరవ చూపాలన్నారు. కార్యక్రమంలో కాంట్రాక్ట్ లెక్చరర్లు పరశురాం, స్వరూపా, సుభాషిణి, శ్రీలత, నరేష్ పాల్గొన్నారు.