ఖమ్మం

మహానుభావుల అడుగుజాడల్లో నడచి జిల్లా ప్రతిష్ఠ పెంచుతా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మధిర, జనవరి 12: ఖమ్మం జిల్లాలో ఎంతో మంది మహానుభావులు ప్రజా ప్రతినిధులు పనిచేశారని వారి అడుగుజాడల్లో నడుస్తూ జిల్లా కీర్తి ప్రతిష్ఠలను ఇనుమడింప చేస్తానని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. గురువారం మధిర మండల పరిధిలోని జాలిముడి, రామచంద్రాపురం గ్రామం వద్ద పదికోట్లతో నిర్మించిన ఎత్తిపోతల పథకాన్ని స్థానిక ఎమ్మెల్యే భట్టివిక్రమార్కతో కలసి ప్రారంభించారు. అనంతరం ఇల్లూరు, ఖమ్మంపాడు గ్రామాల మధ్య వైరానదిపై 15.5కోట్లతో నిర్మించనున్న బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భట్టివిక్రమార్క అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ జిల్లా నుండి దేశం గర్వించదగిన వారు ప్రజా ప్రతినిధులుగా నిస్వార్థంగ పనిచేసి జిల్లా కీర్తిప్రతిష్ఠలను దేశ, విదేశాలలో ఇనుమడింపజేశారన్నారు. కలుషిత రాజకీయాల్లో కూడా తాను జిల్లా నుండి పనిచేసిన మహానుభావుల అడుగుజాడల్లో నడుస్తానన్నారు. తాను అధికారులపై కాని, పార్టీ శ్రేణులపైన కాని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నానంటే అది జిల్లా అభివృద్ధి కోసమేనన్నారు. ఇల్లూరు వద్ద వైరానదిపై నిర్మిస్తున్న వంతెనతో పాటు చెక్‌డాం కూడా నిర్మించాలని అధికారులను అదేశించడం జరిగిందన్నారు. ఖమ్మం పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ది, సంక్షేమ పథకాలకు ప్రాధాన్యతనిస్తుందన్నారు. జిల్లాలో మధిరలో కాని, సత్తుపల్లిలో కాని డ్రైఫోర్ట్ ఏర్పాటుకు ప్రభుత్వంతో మాట్లాడతామన్నారు. ఎమ్మెల్యే భట్టివిక్రమార్క మాట్లాడుతూ గత కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఈ బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాధనలు పంపించడం జరిగిందన్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి అయితే రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయన్నారు. కార్యక్రమంలో జడ్పి చైర్‌పర్సన్ గడిపల్లి కవిత, ఎమ్మెల్సీ బాలసాని, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, చేకూరి కాశయ్య, మధిర నగర పంచాయితీ చైర్‌పర్సన్ మొండితోక నాగరాణి, ఐడిసి చైర్మన్ ఈదా శంకర్‌రెడ్డి, ఎంపిపి వేమిరెడ్డి వెంకట్రావమ్మ, జిల్లా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఐతం సత్యం, టిఆర్‌ఎస్ నాయకులు, వివిద శాఖల అధికారులు పాల్గొన్నారు.

వివేకానంద మార్గం
యువతకు ఆదర్శం
ఖమ్మం(జమ్మిబండ), జనవరి 12: యువతరానికి స్వామి వివేకానంద ఆదర్శనీయుడని, ఆయన సూచించిన మార్గంలో నడిచి మంచి ఫలితాలు సాధించవచ్చని పలువురు వ్యాఖ్యానించారు. స్వామి వివేకానంద 153వ జయంతి సందర్భంగా గురువారం ఇల్లెందు క్రాస్‌రోడ్డులోని ఆయన విగ్రహానికి బిజెపి నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. నాడు ప్రపంచ సదస్సులో భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను ప్రపంచానికి చాటిన వ్యక్తి వివేకానందుడని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఉదయ్‌ప్రతాప్ పేర్కొన్నాడు. దేశభక్తి, ఆత్మవిశ్వాసం, సేవాగుణం ఆయన సూచించిన మార్గాల్లో ప్రధానమైనవన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నేతలు శ్రీ్ధర్‌రెడ్డి, ప్రదీప్, గెల్లా సత్యనారాయణ, దిద్దుకూరి వెంకటేశ్వర్లు, కొండి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
సెట్‌కం ఆధ్వర్యంలో :స్వామి వివేకానంద జయంతిని ప్రభుత్వ యోజన క్రీడల శాఖ ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా క్రీడాశాఖాధికారి పరందామరెడ్డి, సాంఘీక సంక్షేమ శాఖ డిడి అచ్చుతానందగుప్తాలు వివేకానంద బోధనలు, రచనలు, ఆయన ప్రపంచానికి చాటిన భారతీయ సంస్కృతిపై విద్యార్థులకు బోధించారు. యువజన సంఘాల ఆధ్వర్యంలో స్వచ్ఛ్భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు.