ఖమ్మం

మభ్యపెట్టే మాటలను మానాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గార్ల, జనవరి 13: తెలంగాణ సెంటిమెంట్‌తో అధికారం చేపట్టిన టిఅర్‌ఎస్ పార్టీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఅర్ ఈ రెండున్నర సంవత్సరాల పాలనలో ప్రజలకు చేసిన మేలేమిటో స్వష్టం చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. సిపిఎం ఆధ్యర్యంలో గత కొద్ది రోజులు నుండి సాగుతున్న మహాజన పాదయాత్ర సందర్భంగా గార్లలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణకు కాపాలాగా ఉంటానని, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని నాడు చెప్పి మాటలు నేడు వాటిని విస్మరించి అధికారం దాహంతో రాష్ట్రంలో నియంతలాగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాగులు, వంకలు నుంచి వృధాగా సాగునీరు పోతున్న నేడు రైతులు వినియోగించలేని స్థితిలో ఉన్నారని, వృధా నీటిని వినియోగంలోకి తేవటంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. దశాబ్దాలుగా సర్వేలకే పరిమితమైన మునే్నరు ప్రాజెక్టుపై దృష్టి కేంద్రీకరించకుండ మిషన్ కాకతీయ, మిషన్ భగీరధతో పైపులైన్ల నిర్మాణం గావిస్తున్నారే తప్ప నీటి వసతుసులేమిటో ప్రభుత్వానికే స్వష్టత లేదన్నారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమను నెలకోల్పుతామని చేసిన హామీని అమలు చేయాలని లేని పక్షంలో సిపిఎం పార్టీ ఆధ్యర్యంలో దశల వారి ఉద్యమం చేపట్టుతామని హెచ్చరించారు. పాలక విధానాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు, ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల ఉద్యోగుల ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఎన్నికల ముందు ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ వర్గాల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని బీరాలు పలికిన ముఖ్యమంత్రి కెసిఅర్ వాటిని పట్టించుకోకుండ నియంతృత్వ విధానాలతో పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. దళితులకు మూడెకరాల భూమి, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు, బిసిలు, మైనార్టీల సంక్షేమం కోసం కార్పోరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పిన మాటలు నీటి మూటలైయ్యాయన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సిపిఎం పార్టీ ఆధ్యర్యంలో నిర్వహిస్తున్న మహాజన పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజల నుంచి ఆధరణ లభిస్తుందని, వీరభద్రం అన్నారు. కాగా గురువారం రాత్రి మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నుంచి గార్ల సరిహద్దు చేరుకున్న మహాజన పాదయాత్రకు ప్రజలు, సిపిఎం పార్టీ కార్యకర్తల నుంచి అపూర్వ స్వాగతం లభించింది. ఈ కార్యక్రమంలో భద్రాచలం నియోజక వర్గశాసన సభ్యుడు సున్నం రాజయ్య, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు మల్లు స్వరాజ్యం, సిపిఎం మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి సాధుల శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు పోతినేని సుదర్శన్, పాలడుగు భాస్కర్, నున్న నాగేశ్వరరావు, ఎస్.రమా, గార్ల మండల కార్యదర్శి కందునూరి శ్రీనివాస్, నాయకులు ఈశ్వరలింగం, హరి, రాజారావు, జాన్‌వెస్లి తదితరులు పాల్గొన్నారు. అనంతరం గార్ల మండలం పరిధిలోని దళిత వాడలతో పాటు మండలం పరిధిలోని సత్యనారాయణపురం వరకు పాదయాత్ర నిర్వహిస్తూ ప్రజా వినతులను స్వీకరించారు.
అధికారేతర పార్టీల సంఘీభావం
సమాజిక న్యాయం-తెలంగాణ సమగ్రాభివృద్ధి కోరుతూ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నేతృత్వంలో జరుగుతున్న పాదయాత్రకు గార్ల మండలంలోని అధికారేత పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ రావూరి వెంకటరామయ్య, ఇల్లందు ఎ బ్లాక్ అధ్యక్షుడు జర్పుల భీముడునాయక్, మండల కార్యదర్శి పానుగంటి రాధాక్ణృ, ఎంఏ జలీల్, తెలుగుదేశం పార్టీ మండల కమిటి అధ్యక్ష, కార్యదర్శులు క్రిష్ణారెడ్డి, లింగయ్య, సుజ్ఞానప్రసాద్, తోట కొండల్‌రావు, సిపిఐ జిల్లా నాయకుడు కట్టబోయిన శ్రీనివాస్, మండల కార్యదర్శి జంపాల వెంకన్న, వైఎస్‌అర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బాపనపల్లి సుందర్, ధారవత్ సక్రు, మాలమహనాడు నాయకులు శేశమల్ల రాజశేఖర్, సిపిఎం పార్టీ అనుభంద సంఘాలకు చెందిన మండల బాధ్యులు పాల్గొన్నారు.

భక్తరామదాసు ప్రాజెక్టుకయ్యే ఖర్చు ఎంతో
లెక్కతేల్చాలి
* ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన పూర్తిచేసి, రైతాంగాన్ని ఆదుకోవాలి
* సిపిఎం జిల్లా కార్యదర్శి పొన్నం వెంకటేశ్వరరావు

ఖమ్మం, జనవరి 13: జిల్లాలోని తిరుమలాయపాలెం మండలంలో ని ర్మాణం చేపట్టిన భక్తరామదాసు ప్రాజెక్టుకు ఎంత ఖర్చు అవుతుందో లెక్కలేల్చి, యుద్ధప్రాతిపదికన ప్రాజెక్టును పూర్తిచేసి రైతాంగానికి నీళ్ళు అందించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పొన్నం వెంకటేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక సుందరయ్యభవన్‌లో జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టు ఖర్చులు, అంచనాలపై అధికారులు, మంత్రులు, ముఖ్యమంత్రి మాట్లాడే మాటలపై పలు అనుమానాలు వున్నాయన్నారు. శంకుస్థాపన రోజున 90,87 కోట్లతో ప్రాజెక్టు నిర్మిస్తున్నట్లు కెసిఆర్ ప్రకటించారని, మంత్రి తుమ్మల అనేక సందర్భాల్లో 600 కోట్ల రూపాయల ఖర్చుతో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుందని, ప్రస్తుతం ఎస్‌ఈ 330.59 కోట్ల అంచనాలతో ప్రణాళికలు సిద్ధం చేశామని చెపుతున్నారన్నారు. ఇంతమంది ఇన్ని రకాల లెక్కలు చూపిస్తున్నారు, ఇందులో ఏ లెక్క సరైందో అర్థం కావడం లేదన్నారు. డిబిఆర్ లెక్కప్రకారం 65.73 కోట్లకే ఎస్టిమేషన్ ఉందన్నారు.దీనికి వాడే పైపులు, మోటర్లు గతంలో ఇందిరాసాగర్, రాజీవ్‌సాగర్‌ల కోసం తెచ్చినవే వాడుతున్నట్లు చెపుతున్నారని తెలిపారు. అయితే వాటికి గతంలో డబ్బులు చెల్లించారు కదా? వాటికి మళ్ళీ ఖర్చుచూపుతున్నారా లేదా ప్రజలకు వివరించాలన్నారు. అసలు ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అంచనాలు ఇన్నిసార్లు ఎందుకు మారతున్నాయో, 3 రకాల అంచనాల్లో ఏది కరక్టో వివరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2016వ సంవత్సరం ఆగస్టులోనే పంటలకు నీళ్ళు అందిస్తామని శంకుస్థాపన రోజే చెప్పారని, కాలువల కొరకు భూసేకరణే పూర్తికాలేదని విమర్శించారు. జిల్లాలోనే అత్యంత కరువు ప్రాంతమైన తిరుమలాయపాలెం మండలంలో చిన్న చిన్న మార్పులతో 9గ్రామాల పరిధిలోని 8 వేల ఎకరాలకు నీరు ఇవ్వవచ్చునన్నారు. గోదావరి నుండి నీళ్ళను పాలేరుకు అనుసంధానం చేస్తే నీటి గురించి అలోచించే అవసరమే లేదన్నారు. కమ్యూనిస్టుల పోరాటల ఫలితంగానే తానంచెర్ల వరదకాలువ, చెక్‌డ్యామ్‌లు, దుమ్ముగూడెం ప్రాజెక్టుతో పాటు, నందికొండ తదితర ప్రాజెక్టులు సాధించుకోవడం జరిగిందని, ఆ కాలంలో టిఆర్‌ఎస్ ఎక్కడుందని ఆయన ప్రశ్నించారు. ఎవరెన్ని ప్రకటనలు చేసినా గోదావరి నీరు పాలేరులో కలవనిదే సమస్య పరిష్కారం కాదన్నారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు నున్నా నాగేశ్వరరావు, యర్రా శ్రీకాంత్, బత్తుల లెనిన్ పాల్గొన్నారు.
వైభవంగా గోదాదేవి కల్యాణం
* పోటెత్తిన శ్రీరామదివ్యక్షేత్రం
భద్రాచలం, జనవరి 13: వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో శుక్రవారం గోదాదేవి-రంగనాథుల కల్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. భక్తులు అధికసంఖ్యలో పాల్గొని భోగి పండుగ వేళ గోదాదేవి కల్యాణంలో పాల్గొని తరించారు. ముందుగా గోదావరి నుంచి తీర్ధబిందెను తీసుకొచ్చారు. భోగి వేళ ప్రత్యేక పూజలు చేశారు. సుప్రభాత సేవ అనంతరం స్వామికి బాలభోగం నివేదించి స్వామిని ప్రాకార మండపానికి తీసుకెళ్లారు. భాస్యం జగన్నాథాచార్యులు తిరుప్పావైలోని చివరి పాశురాలను భక్తులకు ప్రవచించారు. శ్రీసీతారామచంద్రస్వామి సన్నిధిలో రంగనాథుడు-గోదాదేవిని ఉంచి కల్యాణ క్రతువును చేపట్టారు. ఈ సందర్భంగా ధనుర్మాసంలో ఆలయంలో తిరుప్పావై ప్రవచనాన్ని చెప్పిన భాస్యం జగన్నాథాచార్యులను ఘనంగా దేవస్థానం సత్కరించింది. తర్వాత శ్రీసీతామచంద్రస్వామికి కల్యాణం చేశారు. పుష్యమి సందర్భంగా స్వామికి పట్ట్భాషేకాన్ని నిర్వహించారు. భక్తరామదాసు చేయించిన నగలను స్వామికి అలంకరించి రాజముద్ర, గద, ధనుర్భాణాలు, శంఖుచక్రాలు అలంకరించారు.
పునర్వసు మండపంలో: సాయంత్రం స్వామికి దర్బారు సేవ అనంతరం గోదావరి తీరాన పునర్వసు మండపంలో వైకుంఠరామునికి రాపత్తు సేవను చేశారు. స్వామిని ఊరేగింపుగా గోదావరి తీరానికి తీసుకెళ్లారు. ప్రత్యేక పూజలు చేశారు. వేదవిన్నపాలు జరిగాయి. భక్తులకు తీర్ధప్రసాదాలు పంపిణీ చేశారు. వాకర్స్ అసోషియేషన్ ఆధ్వర్యంలో ఈ రాపత్తు సేవ జరిగింది.

‘ఆపరేషన్ స్మైల్’తో చిన్నారులను ఆదుకుందాం
* డిఎస్పీ సురేష్‌కుమార్
ఖమ్మం(జమ్మిబండ), జనవరి 13: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆపరేషన్ స్మైల్ పథకం ద్వారా చిన్నారులను ఆదుకుంటామని ఖమ్మం డిఎస్పీ సురేష్‌కుమార్ అన్నారు. శుక్రవారం డిఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆపరేషన్ స్మైల్‌ను సిఐడి విభాగం సహకారంతో జిల్లాలోని చైల్డ్‌సైల్ 1098, మహిళా శిశుసంక్షేమం అభివృద్ధి సమితి పోలీస్, కార్మిక విభాగం, ఎడ్యుకేషన్ విభాగాల సహకారంతో దీనిని ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. ఆపరేషన్ స్మైల్‌లో భాగంగా తప్పిపోయిన పిల్లలను తల్లిదండ్రుల వద్దకు చేర్చడం, బాలలతో వెట్టిచాకిరి చేయించేవారిపై కేసులు నమోదు చేయడం, వారిని పాఠశాలల్లో చేర్పించడం, వీధి బాలలను బాలల సదనములలో చేర్పించడం, బిక్షాటన చేస్తున్న వారిని అది మాన్పించి విద్యనభ్యసించే విధంగా తగు చర్యలు చేపట్టడం జరుగుతుందని ఆయన చెప్పారు. జనవరి 1 నుండి ఇప్పటి వరకు దీని ద్వారా మొత్తం 40మంది బాలలను గుర్తించడం జరిగిందని, వాటిలో 14మంది బాల కార్మికులను గుర్తించి వారి యజమానులపై యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. 14 సంవత్సరాలలోపు బాలలను గుర్తించి వారి యజమానులపై కేసులు నమోదు చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. 14మంది వీధిబాలలు డ్రాప్‌అవుట్‌గా గుర్తించి తిరిగి వారిని బడికి వెళ్ళేవిధంగా కౌన్సిలింగ్ చేశామని చెప్పారు. నలుగురు తల్లులు చిన్న పిల్లలతో బిక్షాటన చేయిస్తున్నారని, ఆ తల్లులను పిలిపించి ఆ విధంగా చేయవద్దని హెచ్చరికలు చేశామన్నారు. తప్పిపోయిన ఒక బాలుడిని గుర్తించి తల్లిదండ్రులకు చైల్డ్‌లైన్ 1098ద్వారా తల్లిదండ్రులకు అప్పగించామని ఆయన వివరించారు. పిల్లలను వేదించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమాన్ని జనవరి నెల మొత్తం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో డిసిపిఓ విష్ణువందన, ఏఎల్‌ఓ జయప్రకాష్, చైల్డ్‌లైన్ జిల్లా సమన్వయకర్త ఎన్ రఘురామ్, ఆపరేషన్ స్మైల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

హక్కుల సాధన కోసమే పాదయాత్ర
* ఐద్వా రాష్ట్ర నాయకురాలు అఫ్రోజ్ సమీనా
కొణిజర్ల, జనవరి 13: ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ వర్గాల హక్కుల సాధన కోసమే మహాజన పాదయాత్ర లక్ష్యమని మాజీ మున్సిపల్ చైర్మన్ అఫ్రోజ్ సమీనా అన్నారు. మండల పరిధిలోని తనికెళ్ళలో సంక్రాంతి, మహాజన పాదయాత్ర సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. అనంతరం విజేతలకు బహుమతులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పాలకులు ప్రజా సంక్షేమాన్ని విస్మరించాయన్నారు. ఎన్నికల ముందు టిఆర్‌ఎస్ పార్టీ ఇచ్చిన హామీలు రెండున్నరేళ్ళు గడుస్తున్నా ఒక్కశాతం కూడా అమలు కాలేదన్నారు. రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు కరువై నిరుద్యోగం పెరుగుతుందని, బడి ఈడు పిల్లలు చదువు మానేసి పనికెళ్తున్నారని ఆరోపించారు. వామపక్షాలు ఏకమై ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. పెద్దనోట్ల రద్దుతో కేంద్రం ప్రజలపై దాడి చేసిందని, రెండువేల రూపాయల నోటుకు చిల్లర దొరక్క సామాన్య ప్రజలు కిరాణ సరుకులు కూడా కొనుగోలుకు కష్టంగా మారిందన్నారు. మహాజన పాదయాత్ర ఫిబ్రవరి 13న కొణిజర్ల మండలం తనికెళ్ళకు రానుందని, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని మహాపాదయాత్రను జయప్రదం చేయాలని కోరారు. అక్టోబర్ 17న ప్రారంభమైన పాదయాత్ర ద్వారా తెలంగాణలో అనేక సమస్యలు వెలుగులోకి వస్తున్నాయని, ప్రతిరోజు ఒక సమస్యలపై మహాజన పాదయాత్ర రధసారధి తమ్మినేని వీరభద్రం ముఖ్యమంత్రికి లేఖ రాస్తున్నారని తెలిపారు. లేఖలపై ముఖ్యమంత్రి కనీసం స్పందించడం లేదని, దీనిని బట్టి చూస్తే ప్రజా సమస్యల పరిష్కారంలో ముఖ్యమంత్రికి ఏ పాటి చిత్తశుద్ది ఉందో అర్ధం చేసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఐద్వా నాయకురాలు మరుగు రమణ, మంగా కవిత, సిపిఐ మండల కార్యదర్శి పివిరావు, సిపిఎం నాయకుడు అన్నారపు వెంకటేశ్వర్లు, బండారుపల్లి లక్ష్మయ్య, యుటిఎఫ్ మండల అధ్యక్షుడు రంజాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ ముగ్గుల పోటీలకు జడ్జీలుగా ఉపాధ్యాయులు ఎల్ గోపాల్‌రావు, బూదె పాపయ్య వ్యవహరించారు.

సిపిఎంను విమర్శించే స్థాయి
టిఆర్‌ఎస్ నేతలకు లేదు
నేలకొండపల్లి, జనవరి 13: సిపిఎంను విమర్శించే స్ధాయి టిఆర్‌ఎస్ నాయకులకు లేదని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి గుడవర్తి నాగేశ్వరరావు, మండల ఎంపిపి ఉపాధ్యాక్షుడు రచ్చానర్సింహారావు విమర్శించారు. శుక్రవారం రావెళ్ళ భవనంనందు విలేఖర్లతో మాట్లాడుతూ మహజన పాదయాత్రకు వచ్చిన తమ్మినేని వీరభధ్రం పై టిఆర్‌ఎస్ నాయకులు విమర్శిలు చేయటం అర్థంలేదని అన్నారు. గ్రామాల ప్రజలకు నీటిని విడుదల గూర్చి ముఖ్యమంత్రికి లేఖ రాస్తే అభివృద్ధిని అడ్డకోవటమా అని ప్రశ్నించారు. సిపిఎం పార్టీ ఓట్ల కోసం, సీట్లు కోసం పని చేసే పార్టీ కాదని అన్నారు. ప్రజల సమస్యలకు నిరంతరం పని చేసే పార్టీ అన్ని అన్నారు. దుమ్ముగూడెం ప్రాజెక్ట్ సాధన కోసం జిల్లాలో పాదయాత్రలు చేసిన ఘనత సిపిఎం పార్టీదే అన్ని అన్నారు. బడ్జెట్ల్ దుమ్ముగూడెం నిధులు కెటాయింపు కోసం అప్పటి వైఎస్‌ఆర్ ముఖ్యమంత్రి ఉన్న ఖమ్మం ఎంఎల్‌ఎగా ఉండి పాదయాత్ర చేసిన బృదంలో తమ్మల నాగేశ్వరరావుకూడా ఉన్నారని అన్నారు. ప్రజల సమస్యలపై పోరాటాలు, ఉద్యమాలతో సాధించిన పార్టీ సిపిఎం అని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు ఎటుకూరి రామరావు, రెడ్డి, చారి, మల్లిఖర్జున్‌రావు, లెనిన్ పాల్గొన్నారు.

అంగరంగ వైభవంగా గోదారంగనాథుల కల్యాణం
నేలకొండపల్లి, జనవరి 13: నేలకొండపల్లిలో అంగరంగ వైభవంగా గోదాదేవి రంగనాయకుల కళ్యాణం జరిగింది. శుక్రవారం మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయం, శ్రీ్భక్తరామదాసు జ్ఞాన మందిరంలో గోదాదేవీ రంగనాయకుల కళ్యాణం కనుల పండుగగా అర్చకులు నిర్వహించారు. ధనుర్మాసోత్సవాలలో భాగంగా అమ్మవారికి నిత్యం ప్రత్యేక పూజలు నిర్వహించి భోగి పర్వదినంనాడు అమ్మవారికి కళ్యాణం నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయం నందు బండి వెంకటేశ్వరావు, విజయ్‌కుమార్ దంపతులచే అమ్మవారి అయ్యవారుల కళ్యాణం నిర్వహించారు. శ్రీ భక్తరామదాసు మం దిరం నందు దంపతులచే కళ్యాణం వేద పండితుల మత్చ్రోనలతో మద్య అత్యంత ఘనంగా కళ్యాణం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆలయంను సర్వంగ సుందరంగా తయారు చేశారు. ఈ కళ్యాణ మహోత్సవంను తిలకించేందుకు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వంగవేటి నాగేశ్వరరావు, ఉపసర్పంచ్ రాజపుత్ర శ్రీనివాససింగ్, నకిరికంటి సత్యనారాయణ, అర్చకులు మధసూదనచార్యులు, స్వామినాధ చార్యులు, గోపాల చార్యులు, రాజనీకాంత్‌చార్యులు, శ్రీకర్ అచార్య, ఇవొ నారాయణ చార్యులు, రాధకృష్ణమూర్తి, మధవయ్య పాల్గొన్నారు.
కల్లూరులో...
కల్లూరు: స్థానిక శ్రీసంతానవేణుగోపాలస్వామి ఆలయంలో శుక్రవారం భోగి పండుగను పురస్కరంచుకొని గోదాదేవి కళ్యాణాన్ని కన్నులపండుగవగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి వేదపండితులు నిర్వహించిన కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి పరవశించిపోయారు. కళ్యాణమహోత్సవంలో భక్తులు కె నరసింహాచార్యులు తిరుప్పాయి ప్రవచనాలతో భక్తులను పరవశింపచేసారు. ఈ కార్యక్రమంలో అర్చకులు కొండకింది రామాచార్యులు, వేణుగోపాలచారి, రామానుజా చార్యులు, ఆలయ మాజీ చైర్మన్ కె ఆంజనేయులు, ఇఒ ఎస్‌విడి ప్రసాదు, బొడ్డు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
పెనుబల్లిలో...
పెనుబల్లి: పెనుబల్లి మండలం బయన్నగుడెం గ్రామంలో గల శ్రీ రమాసహిత సత్యనారాయణస్వామి దేవాలయంలో శుక్రవారం గోదాదేవి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ధనుర్మాసం సందర్భంగా దేవాలయ అర్చకులు రంగాచార్యులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు తెల్లవారు ఝామునే పెద్ద ఎత్తున తరలివచ్చి కళ్యాణవేడుకలను తిలకించారు. పెనుబల్లి మండలపరిధి నుండి మహిళా భక్తులు అధికసంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వామి వార్ల విగ్రహాలను మాజీమంత్రి జలగం ప్రసాదరావు ఆధ్వర్యంలో ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు.
గార్లలో....
గార్ల: గార్ల శ్రీలక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో శుక్రవారం గోదారంగనాథుల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. తొలుతగా అమ్మవారిని అభిషేకం చేసి నూతన వస్త్రాలు అలంకరింపజేసి భక్తుల జయజయధ్వానాల మధ్య కళ్యాణ మండపంలోప్రతిష్టించి వేదపండితుడు కాండూరి లక్ష్మీనారాయణచార్యులు వేదమంత్రాలు వల్లిస్తుండగా కళ్యాణం జరిపించారు.
గార్లకు చెందిన కొదుమూరి సీతారాములు-శోభరాణి దంపతులు కన్యాదానం చెయ్యగా కళ్యాణ మహోత్సవంలో బనుకు శ్రీనివాస్, మాటేటి హరి, పుల్లఖండ శ్రీను, బూడిద అరుణ్‌గౌడ్, గూడూరి సంపత్, నాగయ్య, రాంప్రసాద్ దంపతులు పీటలపై కూర్చోని కళ్యాణం జరిపించారు. ఈ మహోత్సవాన్ని మండలం పరిధిలోని అయా ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.