ఖమ్మం

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(గాంధీచౌక్), జనవరి 20: రైతుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని ఖమ్మం ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌లు పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక వ్యవసాయ మార్కెట్‌లో ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కాంగ్రెస్ పాలనలో వ్యవసాయానికి కావల్సిన సౌకర్యాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. గత పాలకులు అవలంభించిన విధానాల వల్ల కందిపప్పు ధరకు రెక్కలోచ్చాయన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాడి పాలన చేపట్టిన కెసిఆర్ పాలనలో వ్యవసాయానికి అన్ని సౌకర్యాలు సమగ్రవంతంగా అందించటంతో వ్యవసాయం పచ్చగా ఉండటంతో పాటు రైతులకు పంటలకు మంచి ధరలు లభిస్తున్నాయన్నారు.

జాతీయ ఫెస్ట్‌ను ఖమ్మంలో
నిర్వహించడం అభినందనీయం

ఖమ్మం(ఖిల్లా), జనవరి 20: విద్యార్థుల్లో ఎంతో ప్రతిభ దాగి ఉంటుందని, వారిని ప్రోత్సహించి సృజనాత్మకతను వెలికితీసేందుకు అధ్యాపకులు విద్యను ప్రోత్సహించాలని జెఎన్‌టియుహెచ్ మంథని ప్రిన్సిపాల్ మార్కండేయ, నగర మేయర్ పాపాలాల్‌లు పేర్కొన్నారు. శుక్రవారం బొమ్మా ఇంజనీరింగ్ కళాశాలలో బిపిఎల్-2కె17 ప్రారంభ వేడుకల్లో పాల్గొన్న వారు మాట్లాడుతూ జాతీయ ఫెస్ట్‌ను ఖమ్మంలో నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొని విద్యార్థులు మరింత విజ్ఞాన్ని పెంచుకోవాలని సూచించారు. విద్యాసంస్థ చైర్మన్, వైస్‌చైర్మన్ బొమ్మా రాజేశ్వరరావు, సత్యప్రసాద్‌లు మాట్లాడుతూ క్రమశిక్షణ, పట్టుదలతో విద్యను అభ్యసిస్తే యువ ఇంజనీర్లకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. విద్యార్థుల్లో దాగిఉన్న ప్రతిభ ఈ ఫెస్ట్‌లతో వెల్లడవుతుందన్నారు. వివిధ రాష్ట్రాల నుండి 500మంది విద్యార్థులు, హాజరయ్యారు.
అప్రమత్తతతో వాహనాలు నడపాలి
* డిఎస్పీ సురేష్‌కుమార్
ఖమ్మం(గాంధీచౌక్), జనవరి 20: వాహనాలను నడిపే ప్రతి వాహనదారుడు వారి ముందు వెళ్తున్న, వారి వెనుక వస్తున్న వాహనాల సిగ్నల్స్‌లను గమనిస్తూ వాహనాలను నడపాలని ఖమ్మం డిఎస్పీ సురేష్‌కుమార్ వాహన డ్రైవర్లకు సూచించారు. 28వ రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా శుక్రవారం ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో స్థానిక రాజ్‌ఫద్ పంక్షన్‌హలులో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో వివిధ వాహన డ్రైవర్లుకు సూచనలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వాహన డ్రైవర్ ట్రాఫిక్ నిబందనలను తప్పకుండా పాటించాలన్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ఉద్యోగ రిత్య, సామాజిక బాధ్యతగా పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రతి వాహనం కూడ కంపెనీ, నిపుణులచేత తయారు చేయబడిన డిజైన్‌తో రోడ్డుపైకి వస్తున్నాయని, అలాంటి వాహనాలను రీడిజైన్, ఆధనపు ఫిటింగ్స్‌తో నడుపుతున్నందున కూడ రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. వాహనాలను నడిపే ప్రతి వాహనదారుడు రోడ్డుసెన్స్‌తో నడపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌అండ్‌బి డిఇ యుగంధర్‌రావు, ఎంవిఐ బజాజ్ ధన్‌రాజ్, మాదిరాజు ఆశోక్, త్రీటౌన్ సిఐ రాజారెడ్డి, ట్రాఫిక్ సిఐ నరేష్, డి పృద్విధర్‌గౌడ్, దేవేందర్‌రావు, ఎన్ గౌతమ్, ఎన్ ప్రభాకర్, ట్రాఫిక్ సిబ్బంది, డ్రైవర్లు పాల్గొన్నారు.