ఖమ్మం

స్కీమ్ వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొణిజర్ల, జనవరి 20: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడుస్తున్న వివిధ పథకాలో పనిచేస్తున్న వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని సిఐటియుమండల అధ్యక్ష కార్యదర్శులు అన్నారపు వెంకటేశ్వర్లు, అనుమోలు రామారావు డిమాండ్ చేశారు. సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ శుక్రవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్కీమ్ వర్కర్లను కార్మికులుగా గుర్తించాలని, కనీస వేతనం నెలకు 18 వేలు ఇవ్వాలని, పెండింగ్ వేతనాలు వెంటనే విడుద చేయాలని, సామాజిక భద్రత కల్పించాలన్నారు. అనంతరం తహశీల్దార్ పి సాంబశివరావుకు వినతి పత్రం అందచేశారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకురాళ్ళు అరుణ, కవిత, సువార్త, శివరంజని, సాయిబీ తదితరులు పాల్గొన్నారు.
వేంసూరులో...
వేంసూరు: కేంద్ర ప్రభుత్వ స్కీంలో పని చేస్తున్న స్కీం వర్కర్లను రెగ్యులర్ చేయాలని కోరుతూ శుక్రవారం మండల కేంద్రమైన వేంసూరులో ఎర్రారామయ్య భవనం నుండి మర్లపాడు రింగు సెంటర్ వరకు ప్రదర్శన నిర్వహించి మానవ హారం నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో సి ఐ టి యు మండల కార్యదర్శి, స్కీంవర్కర్ల మండల కార్యదర్శి , మల్లూరు చంద్రశేఖర్, కినె్నర సునీతలు మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పాలకులు అమలు పర్చటం లేదని విమర్శించారు. ఈకార్యక్రమంలో స్కీం వర్కర్లు సుశీల ,పుష్ప, పద్మ, సత్యావతి, సామ్రాజ్యం, నాగరత్నం,లతో పాటు మహిళా కార్మికులు పాల్గొన్నారు.
సత్తుపల్లిలో...
సత్తుపల్లి: అంగన్‌వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన, సర్వశిక్ష అభియాన్ తదితర స్కీమ్‌లో పనిచేసే కార్మికులకు కనీస వేతనాలు అందించి సమస్యలు పరిష్కరించాలని సిఐటియూ ఉపాధ్యక్షులు ఎం. పాండు డిమాండ్ చేశారు. సత్తుపల్లిలో దేశవ్యాప్త సమ్మెలో భాగంగా శుక్రవారం ఆశా, అంగన్‌వాడీ, మధ్యాహ్న కార్మికుల ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. వీరికి చట్టబద్ద సౌకర్యాలు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో సిఐటియూ కార్యదర్శి కె సర్వేశ్వరరావు, కాశింబాబు, గణపతి, ఉదయ శ్రీ, సువర్ణ, శారద, మహాలక్ష్మి, జయశ్రీ, లక్ష్మీ, షకీనా, భాగ్యలక్ష్మి,. నాగేంద్ర, సంధ్య పాల్గొన్నారు.
కల్లూరులో...
కల్లూరు: స్కీం వర్కర్లను కార్మికులుగా గుర్తించాలని సిఐటియు ఆధ్వర్యంలో శుక్రవారం తహశీల్దార్ డి నాగూబాయికి వినతిపత్రం అందజేసారు. ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి పి ముత్తారావు మాట్లాడుతూ అంగన్‌వాడి, ఆషా, గ్రామదీపికలను, ఎఎన్‌ఎమ్, మధ్యాహ్న భోజన, సాక్షరభారత్ తదితర రంగాలలో పనిచేస్తున్న కార్మికులను గుర్తించకుండా వెట్టి చాకిరి చేయిస్తున్నారని ఆరోపించారు. వీళ్లందరిని స్కీం వర్కర్లుగా గుర్తించి రూ. 18వేలు వేతనం ఇవ్వాలని డిమాండ్ చేసారు. ప్రతి ఒక్కరికి జీవనోపాధి కింద సంవత్సరానికి రూ. 3వేలు చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆషావర్కర్లు, మధ్యాహ్న భోజన వర్కర్లు, ఆషా, గ్రామదీపికలు పాల్గొన్నారు.
ఖమ్మం రూరల్‌లో...
ఖమ్మం రూరల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో కొనసాగుతున్న 16 రంగాల శాఖలకు సంబంధించిన స్కీంలను సమర్థవంతంగా నిర్వహించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు తుశాకుల లింగయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం స్కీం వర్కర్ల దేశవ్యాపిత సమ్మెలో భాగంగా మండలంలోని జలగంనగర్‌లో నిర్వహించిన సమ్మెలో సిఐటియు అనుబంధ స్కీం వర్కర్లు, అంగన్‌వాడీ, ఆషా, ఐకెపి విఓఏ, మధ్యాహ్న భోజన, కస్తూరిబా గురుకుల పాఠశాల, గోపాలమిత్ర, ఎన్‌ఆర్‌ఇజిఎస్ ఎఫ్‌ఏ, సాక్షర భారతి పథకాలలో పనిచేస్తున్న వర్కర్లు పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్‌వాడీ, ఆషా, విఓఏ ఎఫ్‌ఏల చేత వెట్టిచాకిరి చేయించుకొని కనీసం వేతనాలు అమలు చేయడం లేదని విమర్శించారు. సిఐటియు జిల్లా సహాయకార్యదర్శి పి మోహన్‌రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 2017 బడ్జెట్‌లో స్కీం వర్కర్లకు కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు బోడా జ్యోతి, శ్రీవిద్య, జి రాధాలక్ష్మి, ఉమాదేవి, రత్నం, ఎస్‌డి అత్తర్‌బేగం, రజిత, నాగరాణి, భాగ్యమ్మ, కోటమ్మ, సరిత, సుజాత, గాయత్రి, దేవ్‌జా, యాదమ్మ, పుష్ప, రేవతి తదితరులు పాల్గొన్నారు.