ఖమ్మం

విమానాశ్రయ నిర్మాణానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం రూరల్, జనవరి 20: ఆదివాసి, గిరిజన, పేద ప్రజలను నిర్వాసితులుగా చేస్తున్న విమానాశ్రయ ఏర్పాటుకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తామని విరసం నేత వరవరరావు స్పష్టం చేశారు. విమానాశ్రయ ఏర్పాటును వ్యతిరేకిస్తూ కొత్తగూడెం క్లబ్ (సోయంగంగులు ప్రాంగణం) లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఆదివాసీ గిరిజన చట్టాలను ఉల్లగిస్తూ గిరిజన గ్రామలలో గ్రామ సభల తీర్మానం లేకుండా విమానాశ్రయ ఏర్పాటును ఏవిధంగా చేస్తారో తెలపాలన్నారు. ఆదివాసీ గిరిజనులు దశాబ్దాలుగా సాగుచేసుకుంటున్న పోడుభూముల నుండి వెల్లగొట్టి కార్పోరేట్ శక్తుల కోసం విమానాశ్రయ ఏర్పాటుకోసం ప్రయత్నించడం అప్రజ్వామిక చర్య అని దుయ్యబట్టారు. ఏయిర్‌పోర్ట్ నిర్మాణంతో నిర్వాసిత గ్రామాలైన మైలారం, పునుకుడు చెలక, తోకబందాల, మర్రిగూడెం, ఎర్రచెలక, పాయంగుంపు, గొళ్లగూడెం తదితర గ్రామాలు కనుమరుగువుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్డీ రాష్ట్ర నాయకులు ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య మాట్లాడుతూ ప్రాణాలనైనా అర్పించి విమానాశ్రయ ఏర్పాటు అడ్డుకుందామని పిలుపునిచ్చారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం హరితాహారం పేరుతో ఆదివాసీల నుండి బలవంతంగా భూములు లాకుంటూ ఆదివాసీలను ఇబ్బందులకు గురిచేయడం సరైనది కాదన్నారు.
ఎయిర్‌పోర్ట్ నిర్మాణం కోసం కేటాయించిన 16వందల ఎకరాల భూమిలో ఆదివాసీ సాగుచేసుకుంటున్న సాగుభూమితో పాటు ఆదివాసీ సంస్కృతిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాలరాస్తుందని విమర్శించారు. ఆదివాసీ సమాజంతోపాటు ప్రజాస్వామిక వాదులు, అన్ని రాజకీయ పక్షాల నాయకులు, అన్ని వర్గాల ప్రజలు ఏయిర్‌పోర్ట్ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. బహిరంగ సభలో తెలంగాణ ప్రజాఫంట్ రాష్ట్ర అధ్యక్షులు నల్లమాసా కృష్ణ, తెలంగాణ ఉద్యమ వేదిక నాయకులు చెరుకు సుధాకర్, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కూనంనేని సాంబశివరావు, తుడుందెబ్బ నాయకులు రమణాల లక్ష్మయ్య, ఒట్టం ఉపేందర్, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కె సాబీర్‌పాషా, సిపిఎం జిల్లా కార్యదర్శి కాసాని ఐలయ్య, టిపిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మెంచు రమేష్, టిపిఎఫ్ జిల్లా కార్యదర్శి చారువాక, రడం శ్రీను, ఏయిర్‌పోర్ట్ నిర్వాసితుల కమిటీ చైర్మన్ పాయం పోతయ్య, టిజె ఎసి చైర్మన్ మల్లెల రామనాధం, రైతు సంఘం నాయకులు మండె వీరహనుమంతరావు, ఎన్డీ నాయకులు మాచర్ల సత్యం, ఎల్ విశ్వనాదం, విద్యార్ధి సంఘం నాయకులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.