ఖమ్మం

క్యాష్‌లెస్, ప్లాస్టిక్ రహిత సమాజం ఏర్పడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేలకొండపల్లి, డిసెంబర్ 21: గ్రామాలలోక్యాష్‌లెస్ లావాదేవీలు, ప్లాస్టిక్ రహిత సమాజం ఏర్పడాలని నేలకొండపల్లి ఎంపిడిఓ ఆళ్ళ శ్రీనివాసరావు అన్నారు. బుధవారం నేలకొండపల్లి మండల పరిషత్ కార్యాలయంలో వ్యాపారస్తులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపిడిఓ మాట్లాడుతూ గ్రామాలలో వ్యాపారం చేసేవారు తప్పకుండా నగదురహిత లావాదేవీలు నిర్వహించాలన్నారు. దానికోసం డిజిటల్ వ్యవస్థ అమలు ఉందన్నారు. వ్యాపారస్థులు తమ వ్యాపార లావాదేవీలు అన్ని స్వైపింగ్ మిషన్ల ద్వారా చేయాలన్నారు. అలాగే ప్రతి ఒక్కరిలో చైతన్యం తీసుకురావాలని అన్నారు. అలాగే ప్రతి ఒక్కరూ పేటిఎం ద్వారా గానీ, ఇంటర్‌నెట్ ద్వారా గానీ తమ లావాదేవీలు చేసుకోవాలని అన్నారు. అలాగే త్వరలో పెన్షన్‌దారులకు, పని వర్కర్స్‌కు రూపే కార్డులను అందిస్తున్నట్లు తెలిపారు. ఈ మండలంలో దాదాపు ఇరవైవేల మందికి రూపే కార్డును అందిస్తున్నట్లు తెలిపారు. వ్యాపారుస్థులు తమ వ్యాపారాలను జీరో నుండి తీసివేసి పిఓఎస్ ద్వారా లావాదేవీలు నిర్వహించాలన్నారు. స్థానిక తహశీల్దార్ సైదులు మాట్లాడుతూ ప్లాస్టిక్ నియంత్రణను ప్రతిఒక్కరూ పాటించాలన్నారు. గ్రామాలను శుభ్రంగా ఉంచాలని, వాటికి వ్యాపారస్థులు సహకరించాలన్నారు. ప్రతి ఒక్కరూ తమ చెత్తను డంపింగ్‌యార్డులో వేయాలన్నారు. అలాగే ఎరువుల షాపులు, కల్తీ విత్తనాలను అరికట్టాలన్నారు. పురుగు మందులకు సంబంధించి ఎటువంటి ప్రకటనలు ఉండరాదన్నారు. ఎస్‌ఐ సుమన్ మాట్లాడుతూ గ్రామంలో వ్యాపారస్థులు తమ లావాదేవీలు నగదు రహితంగా నిర్వహించాలన్నారు. కల్తీ విత్తనాల సమాచారం అందించాలన్నారు. రోడ్లపై చెత్తఉంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. దుకాణాదారులు ప్లాస్టిక్ సంచుల్లో సరుకులు ఇవ్వకుండా ఉండేలా గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలకు ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే అనర్ధాలను వివరించి అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకత ప్రజాప్రతినిధులకు ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వంగవేటి నాగేశ్వరరావు, వ్యాపారస్థులు నకిరికంటి శ్రీనివాసరావు, సర్వేశ్వరరావు, గెల్లా జనార్థన్, శ్రీను, ప్రసాద్, వెంకటేశ్వరరావు, రాయపూడి శ్రీనివాస్, కొప్పు కృష్ణమూర్తి, రేగూరి హన్మంతరావు తదితరులు పాల్గొన్నారు.

టిఆర్‌ఎస్ నేతలు చెప్పేవన్నీ అసత్యాలే
* కాంగ్రెస్ మైనార్టీ విభాగం ఆరోపణ
ఖమ్మం(ఖిల్లా), డిసెంబర్ 21: మైనార్టీ అభివృద్ధికి తామే అంతా చేసినట్లు టిఆర్‌ఎస్ మైనార్టీ నాయకులు చెబుతున్నవన్నీ అసత్యాలేనని, వాస్తవాలు తెలియకుండా తమ నోటికి వచ్చినట్లు మాట్లాడటం వారి అజ్ఞానానికే నిదర్శనమని కాంగ్రెస్ మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు తాజుద్దీన్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మైనార్టీ విభాగ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పుడున్న షాదీఖానాను తూతూ మంత్రంగా మరమ్మతులు నిర్వహిస్తూ తామే అంతా అయినట్లు మాట్లాడటం హాస్యస్పదంగా ఉందన్నారు. నగరంలో మరొక షాదీఖానా నిర్మాణం కోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అనేక ఆందోళనలు నిర్వహించామని, కొందరు కాంగ్రెస్ పార్టీకి ముస్లిం మైనార్టీల ఆదరణ పెరుగుతుండటం చూడలేక కావాలనే తమపై బురదజల్లే చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉర్ధుఘర్, షాదీఖానా అభివృద్ధికంటే ముస్లిం మైనార్టీల అభివృద్ధి ప్రధానమైనదిగా కాంగ్రెస్ భావిస్తుందన్నారు. అందుకు రాజకీయాలకతీతంగా ముస్లిం పెద్దలను మేధావులు, విద్యావంతులందరిని కలుపుకొని పోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ నాయకులు ఫజల్, జహీర్, ఇషాక్, చోటాబాబా, షకీల్, ఎస్‌డి గౌస్, ఇస్మాయిల్ మహ్మద్, ఖదీర్ తదితరులు పాల్గొన్నారు.