ఖమ్మం

కందుల కొనుగోలులో రైతుల్ని ఇబ్బంది పెట్టొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేలకొండపల్లి, పిబ్రవరి 13 : కందుల కొనుగోలులో రైతులను ఇబ్బంది పెట్టావద్దని రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు ఆదేశించారు. సోమవారం నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో కందుల కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ రైతులు కందులు తీసుకువచ్చినపుడు వారిని ఎటువంటి ఇబ్బంది పెట్టాకుండా కొనుగోలు చేయాలని అన్నారు. పాలేరు పాత కాలువకు శిధిలం కావటంతో రైతుల చివరి భూములకు నీరు అందక పోవటంతో దానిని ఆధునీకరణ చేసేందుకు గాను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావును నిధులు కావాలని కోరాగా వెంటనే నిధులు మంజూరు చేశారని అన్నారు. ఈ సంవత్సరంలో పనులను పూర్తి చేసి వచ్చే వంద సంవత్సరాల వరకు నీటి పూర్తిగా రైతులు వాడుకునేందుకు చర్యలు తీసుకుంటున్నాట్లు తెలిపారు. ఈ పాలేరు పాత కాలువ ఆధునీకరణ పనులకు యాబై కోట్లు కంటే ఏక్కువ అయిన సంవత్సరంలో పూర్తి చేస్తామని అన్నారు. పాత కాలువ పనులు జరిగే సమయంలో నీటిని విడుదల కాదు కాబట్టి రైతులు ఈ సంవత్సరం త్యాగం చేస్తే వచ్చే వంద సంవత్సరాల వరకు నీటిని చివరి భూముల వరకు అందించవచ్చవని అన్నారు. ఈ నెల 16న ఈ పాత కాలువ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన జరుగుతుందని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు, తలసాని శ్రీనివాసయాదమ్ పాల్గొంటారని అన్నారు. వచ్చే బడ్జెట్‌లో గ్రామిణ వ్యవస్దలో చితికిపోయిన కులాలకు, ఆర్ధికంగా వెనుకబడిన కులాలకు ఏక్కవ నిదులను కేటాయించేందకు గాను మంత్రి తలసాని శ్రీనివాసయాదమ్‌ను తీసుకువస్తున్నట్లు తెలిపారు. పాత కాలువ ఆధునీకరణకు పనుల శంఖుస్ధాపనకు రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్ని జయపద్రం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ గడిపల్లి కవిత, డిసిసిబి చైర్మన్ మువ్వ విజయ్‌బాబు, ఖమ్మం వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఆర్‌జేసి కృష్ణ, జిల్లా పరిషత్ సిఇవో నాగేష్, డిఎంవో ప్రసాద్, నేలకొండపల్లి ఎంపిపి నందిగామ కవిత రాణి, నేలకొండపల్లి గ్రామ సర్పంచ్ వంగవేటి నాగేశ్వరరావు, తహసీల్ధార్ దొడ్డారపు సైదులు, ఎంపిడివొ ఆళ్ళ శ్రీనివాసరెడ్డి, ఎపివో ఆశోక్‌రాణి, సునిత, ఎంపిటిసి శీలం వెంకటలక్ష్మి, చిలకల సీతారావమ్మ, టిఆర్‌ఎస్ నాయకులు నెల్లూరి భద్రయ్య, సామినేని వెంకటయ్య, కాసాని నాగేశ్వరరావు, పాలేరు సర్పంచ్ మాదవిరెడ్డి, జానకిరామయ్య, వెన్నపూసల సీతారాములు, వేణు, శంకర్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

కందుల కొనుగోలు కేంద్రంను ప్రారంభించిన మువ్వ

కందుల కొనుగోలు కేంద్రంను డిసిసిబి చైర్మన్ మువ్వ విజయబాబు ప్రారంభించారు. నూతనంగా నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్ నందు నాఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రంను మువ్వ విజయ్‌బాబు ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ జిల్లాలో పండిన పంటలో సగం పంట పాలేరు రైతులు పండించారని అన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు కంది పంటపై అవగాహన కలిపించారని అన్నారు. రైతులకు, ప్రజలకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్ని రంగాలలో అదుకుంటున్నారని అన్నారు. భక్తరామదాసు ప్రాజెక్ట్‌తో నీటిని అందించి వాటితో పాటు అన్ని రంగాలను అభివృద్ధి చేస్తున్నారని అన్నారు.

కాటాను ప్రారంభించిన ఆర్‌జేసి

కందుల కొనుగోలు కేంద్రంలో ఏర్పాటు చేసిన కాటాను ఖమ్మం వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఆర్‌జేసి కృష్ణ ప్రారంభించారు. మొదట కాటాకు కొబ్బరికాయ కొట్టి కందుల కాటాను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ రైతులకు మద్దతు ధర కలిపించేందుకు గాను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నేలకొండపల్లిలో కందుల కేంద్రం ఏర్పాటు చేశారని అన్నారు. రైతులు పూర్తి స్ధాయిలో కేంద్రంను వినియోగించుకోవాలని కోరారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ నందు పూర్తి స్ధాయిలో కందుల కొనుగోలు జరగకపోవటం వల్ల రైతులు ఇబ్బందిపడుతున్నారని దాదాని దృష్టలో ఉంచుకోని మంత్రి తుమ్మల నాగేశ్వరరావునేలకొండపల్లిలో కందుల కొనుగోలు కేంద్రంను ఏర్పాటు చేశారని అన్నారు. ఖమ్మం సమిపంలోని వ్యవసాయ మార్కెట్‌లను సంయుక్తం చేసి రైతులను అన్ని రకాలుగా అదుకోవాలని కోరారు.