ఖమ్మం

రూ.27కోట్లతో 17 బ్రిడ్జిల నిర్మాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, ఫిబ్రవరి 15: మారుమూల ప్రాంతాలలోని ప్రజలకు కనీసం వౌలిక సదుపాయాలు కల్పించటంలో భాగంగా రోడ్ల నిర్మాణ పనులు చేపడుతున్నామని, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పరిధిలోని మారుమూల ప్రాంతాలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ నిధులతో 17బ్రిడ్జిలను నిర్మిస్తున్నట్లు ఇందుకు 27.29కోట్ల నిధులు మంజూరైనట్లు రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. బుధవారం ఆయన ఆంధ్రభూమితో మాట్లాడుతూ రెండు జిల్లాల పరిధిలోని మారుమూల ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజల రవాణా కోసం బ్రిడ్జిలు అవసరమని గుర్తించి నిధుల కోసం ప్రధాన మంత్రి గ్రామ్‌సడక్ యోజన పథకం కింద 27.85కోట్లు అవసరమని ప్రతిపాదనలు పంపించినట్లుతెలిపారు. దీనికి కేంద్రం సానుకూలంగా స్పందించి 27.29కోట్లు మంజూరు చేసిందన్నారు. ఖమ్మం జిల్లాలో మూడు బ్రిడ్జిల నిర్మాణం కోసం 3.12కోట్లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 14బ్రిడ్జిల నిర్మాణం కోసం 24.73కోట్ల నిధులను మంజూరు చేసిందన్నారు. ఖమ్మం జిల్లాలోని కామేపల్లి ప్రాంతంలో వాగుపై హైలెవల్ బ్రిడ్జి, రోడ్డు నిర్మాణం, రేపల్లెవాడ, ముదిగొండ ప్రాంతాలలో రోడ్ల నిర్మాణాలు, బ్రిడ్జిల నిర్మాణాలు చేపటన్నున్నామన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దమ్మపేట మండలం నాగుపల్లి నుండి తొట్టిపంపువరక రోడ్డు నిర్మాణం, దుమ్ముగూడెం మండలంలో మెట్లవాగుపై హైలెవల్ బ్రిడ్జి, తూరుబాక నుండి వైట్‌నాగారం వరకు రోడ్డు, కొంగరవాగుపై బ్రిడ్జి, ధర్మాపురం వరకు రోడ్డు, చిన్న గుబ్బల మంగి వాగుపై బ్రిడ్జి, పైడిగూడెం వరకు రోడ్డు నిర్మాణం చేపట్టనున్నామన్నారు. గుండాల మండలంలో పెద్దవాగు, చిన్నవాగు, జలివాగులపై హైలెవల్ బ్రిడ్జిలు, శెట్టిపల్లి వరకు రోడ్డు నిర్మాణం, మర్కొడు నుండి సందిబందం వరకు రోడ్డు, పాల్వంచ మండలంలో పాల్వంచ నుండి పాండురంగపురం వరకు, ముర్రెడువాగు నుండి ఎర్రగూడెం వరకు, అందుగులగూడెం నుండి హర్సింగ్ తండా వరకు, తడికెలపుడి నుండి కొక్యాల తండా వరకు, అర్‌అండ్‌బి రోడ్డు నుండి బోడు కొత్తగూడెం వరకు రోడ్డు నిర్మాణాలు, టేకులపల్లి మండలంలో మూడు హైలెవల్ బ్రిడ్జిలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఇల్లెందు మండలంలో వాగుపై హైలెవల్ బ్రిడ్జి, మాణిక్యారం వరకు రోడ్డు నిర్మాణం చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ ఎడాదిలోనే రోడ్డు సౌకర్యం లేని అన్ని గ్రామాలకు రహదారులను ఏర్పాటు చేయనున్నామన్నారు. మారుమూల ప్రాంతంలోని గుండాల మండల కేంద్రానికి రోడ్డు నిర్మాణం పూర్తి అయి ప్రజలకు అందుబాటులోకి వచ్చిందన్నారు. ఈ ప్రాంత ప్రజలు అనేక ఏళ్ళుగా రహదారి కోసం ఎదురు చూస్తున్నారని, ఇప్పటికి దాని నిర్మాణం పూర్తి అయిందని తెలిపారు. గ్రామాల మధ్య ఉన్న లింకు రోడ్లను అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ నిధులకు తోడు కోట్లది రూపాయలు వెచ్చిస్తూ ప్రజలకు వౌళిక సదుపాయలు కల్పించే ప్రయత్నం చేస్తుందన్నారు.

సిఎంకి చిత్తశుద్ధి ఉంటే
బీసీ సబ్‌ప్లాన్ అమలు చేయాలి
* సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
మధిర, ఫిబ్రవరి 15: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర జనాభాలో 52 శాతం ఉన్న బిసిలకు సబ్‌ప్లాన్ చట్టం అమలు చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న మహాజన పాదయాత్ర 122వ రోజు మధిరకు చేరుకుంది. ఈ సందర్భంగా స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలో సిపిఎం పట్టణ కార్యదర్శి పాపినేని రామనర్సయ్య అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ సామాజిక న్యాయంతోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి జరుగుతుందన్నారు. రాష్ట్రంలో 52శాతం బిసిలకు సబ్‌ప్లాన్ చట్టం అమలు చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బిసి, ఎంబిసిలు రాష్ట్ర జనాభలో 93శాతం ఉన్నారని వారి అభివృద్ధి కోసమే మహజన పాదయాత్రను నిర్వహించడం జరుగుతుందన్నారు. మహాజన పాదయాత్ర ప్రారంభించిన తరువాత ముఖ్యమంత్రి కుల మీటింగ్‌లు పెట్టి వారిని మోసం చేస్తున్నారన్నారు. స్వయంగా కెసిఆర్ పాదయాత్రను అడ్డుకోవాలని పిలుపునిచ్చాడని రాష్ట్రంలోని 25జిల్లాల్లో 1270 గ్రామాల్లో 3300 కిలోమీటర్ల పాదయాత్ర జరిగితే ఏ ఒక్క చోటా అడ్డుకున్న దాఖలాలు లేకపోవడంతో పాటు ప్రజలు పూలుచల్లి హారతులు ఇచ్చి ఘనస్వాగతం పలికారన్నారు. ప్రతి కాంట్రాక్ట్ ఉద్యోగిని పర్మినెంట్ చేస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి వారికి కనీస వేతన చట్టం ప్రకారం వేతనాలు కూడ ఇవ్వడంలేదన్నారు. విద్యా, ఉద్యోగాలలో బిసిలకు ఎబిసిడి కోట ప్రకారం రిజ్వర్వేషన్లు ఉన్న స్థానిక సంస్థల్లో దామాషాలో రిజర్వేషన్లు లేకపోవడంతో తక్కువ జనాభ ఉన్న బిసి కులాలకు చెందిన వారు ప్రాతినిధ్యం వహించలేకపోతున్నారన్నారు. రాష్ట్రంలో 4,800 స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఉంటే వారిలో ఎక్కువ జనాభా ఉన్న బిసి ప్రజాప్రతినిధులు 3600 మంది ఉండటమే దీనికి నిదర్శమన్నారు. కెసిఆర్ మెడలు వంచైనా అసంఘటిత రంగ కార్మికులకు కనీస వేతన చట్టం అమలు చేసేలా ఉద్యమం చేపడతామన్నారు. మహాజన పాదయాత్ర ముగింపు సందర్భంగా మార్చి 19వ తేదిన హైదరబాద్‌లో నిర్వహించే పొలికేక మహాసభకు ప్రజలు లక్షలాదిగా హాజరై ప్రభుత్వం కళ్ళు తెరిపించేల విజయవంతం చేయలని కోరారు. ఈ సభలో పార్టీ నాయకులు పోతినేని సుదర్శన్‌రావు, పొన్నం వెంకటేశ్వరావు, ఎం సాయిబాబు, కల్యాణం వెంకటేశ్వరరావు, బండి రమేష్, కట్టా గాంధీ, ఎస్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.