ఖమ్మం

ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆకస్మిక తనిఖీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, ఫిబ్రవరి 20: కొత్తగూడెం పట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రులు, డయాగ్నొస్టిక్ సెంటర్లను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వెంకటేశ్వరరావు సోమవారం ఆకస్మిక తనఖీలు నిర్వహించారు. ఆసుపత్రులకు సంబంధించిన అనుమతులు, రిజిస్టర్లు, వినియోగిస్తున్న పరికరాలు, ధరల పట్టిక, వైద్యుల వివరాలను ఆసుపత్రి బోర్డుపై ఉంచాలని ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించే ఆసుపత్రులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొత్తగూడెం పట్టణంలోని సురక్ష హాస్పిటల్, మెడికేర్ డయాగ్నస్టిక్ సెంటర్, వందన నర్శింగ్ హోం, నేషనల్ డయాగ్నటిక్ సెంటర్, స్మైల్‌కేర్ తదితర సెంటర్లలో తనిఖీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారులు భాస్కర్‌నాయక్, బిన్ని కృష్ణ, సత్యప్రసాద్, నాగభూషణం, రాజు, ప్రశాంత్, ప్రభాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

నిరుద్యోగ ర్యాలీకి అనుమతి ఇవ్వాల్సిందే
* ఎమ్మెల్యే సండ్ర
సత్తుపల్లి, ఫిబ్రవరి 20: ఈ నెల 22న కోదండరాం తలపెట్టిన నిరుద్యోగ ర్యాలీకి ప్రజాస్వామ్యయుతంగా అనుమతి ఇవ్వాల్సిందేనని, ఇది రాచరిక వ్యవస్థ కాదని, ప్రజాస్వామ్య పరిపాలన అని పాలకులు గుర్తెరగాలని సత్తుపల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సోమవారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమానికి గుండెకాయ అయిన ఉస్మానియా క్యాంపస్‌కువెళ్ళే దైర్యం తెలంగాణ మంత్రులకు లేదన్నారు. ఎన్నికల సమయంలో ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తరువాత నిరుద్యోగులకు వంచిందని విమర్శించారు. నిరుద్యోగ యువకుల కోసం గతేడాది స్వయం ఉపాధి పథకాల కింద మంజూరైన రుణాలను తక్షణం అందించాలన్నారు. తల్లాడ మండలంలో రెండు బ్యాంకులు రుణాలు మంజూరైన బ్యాంక్ కానె్సంట్ ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టడం సరైన చర్య కాదన్నారు. కలెక్టర్ బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటు చేసి నిరుద్యోగులకు రుణాలు ఇచ్చేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. బ్యాంకర్లు సామాజిక దృక్పదంతో పనిచేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బిసి మైనార్టీ వర్గాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. మూడేళ్ళలో తెలంగాణలో ఉపాధిహామి అభివృద్ధి పనులు అటకెక్కాయన్నారు. ఎమ్మెల్యే, ఎంపిల కంట్రిబ్యూషన్ నిధులతో ఉపాధిహామి పనులు కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంటే దానిని కూడా రాజకీయం చేయటం సరికాదన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను సక్రమంగా ఖర్చు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో టిడిపి మండల, పట్టణ అధ్యక్షులు దొడ్డా శంకర్‌రావు, కూసంపూడి మహేష్, అద్దంకి అనీల్, కంభంపాటి మల్లిఖార్జున్‌రావు, ఎస్‌కె చాంద్‌పాషా, దూదిపాళ్ళ రాంబాబు, చల్లగుళ్ళ కిట్టు, గిరి, గోవర్థన్, మోటపోతుల జగన్నాధం, నాగేశ్వరరావు, వాడపల్లి ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

భార్యను హత్య చేసి భర్త ఆత్మహత్య
ఖమ్మం(ఖిల్లా), ఫిబ్రవరి 20: పెళ్లయన నాలుగు నెలలకే భార్యను హత్యచేసి భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఖమ్మం నగరంలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం ప్రకాష్‌నగర్‌కు చెందిన ఉమ(22) పాకబండ బజార్‌కు చెందిన యర్రం ప్రసాద్‌రెడ్డి(32) నాలుగు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. స్థానిక పాకబండ బజార్‌లో నివాసముంటున్న వారిరువురి మధ్య తరచూ మనస్పర్దలు చోటు చేసుకుంటున్నాయి. సోమవారం భార్య ఉమను ఉరివేసి చంపిన కొద్ది సమయానికే సారధినగర్ ప్రాంతంలో రైల్వేట్రాక్ మీద ప్రసాద్‌రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతురాలికి చిన్నతనంలోనే చనిపోవడంతో అమ్మమ్మ అన్నబత్తుల రంగమ్మ వద్ద పెరిగింది. నాలుగు నెలల క్రితం ఒక వివాహంలో యర్రం ఉమను చూసిన ప్రసాద్‌రెడ్డి పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నాడు. వన్‌టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.