ఖమ్మం

ఏరియా ఆసుపత్రిలో అన్నపురెడ్డిపల్లి విద్యార్థులకు వైద్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, మార్చి 11: కల్తీ ఆహారం కారణంగా అస్వస్థతకు గురైన ఆన్నపురెడ్డి గురుకుల పాఠశాల విద్యార్థులకు కొత్తగూడెం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో శనివారం చికిత్స చేస్తున్నారు. వినయ్, రాము, సాయిబాబు, చందూ, నాగేంద్రబాబు, హరీష్‌లతోపాటు 36 మంది విద్యార్థులకు ఇక్కడ వైద్య సిబ్బంది చికిత్స ప్రారంభించారు. ఒకే బెడ్‌పై ఇద్దరు చొప్పున విద్యార్థులకు వైద్య సేవలు అందిస్తున్నారు. విద్యార్థులను చూసేందుకు తల్లిదండ్రులు, బంధువులు ఆసుపత్రికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. పాఠశాల సిబ్బంది ఆహారం అందించే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగా విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారని బంధువులు, విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు, ఖమ్మం జడ్పీ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత, కొత్తగూడెం మున్సిపల్ చైర్‌పర్సన్ పులి గీత, మండల పరిషత్ అధ్యక్షురాలు బానోతు కీస్లీ, టిఆర్‌ఎస్ నాయకులు కంచర్ల చంద్రశేఖర్ రావు విద్యార్థులను పరామర్శించారు. విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. సంఘటనకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కొత్తగూడెం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వైద్యులు జనార్ధన్ రావు, రూబీ జాక్సన్, వినోద్‌తోపాటు సిబ్బంది చికిత్స చేస్తున్నారు.