ఖమ్మం

గోదావరిలో మునిగి ఇద్దరు యువకులు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, మార్చి 12: భద్రాచలంలో హోళీ విషాదం నింపింది. హోళీ వేళ రంగులు చల్లుకుని సంబురాలు జరుపుకున్న యువకులు మాత్రం తమ ఇంట్లో తీరని విషాదాన్ని మిగిల్చి కానరాని లోకాలకు తరలి వెళ్లారు. వివరాల్లోకి వెళ్తే... హోళీ సందర్భంగా ఆదివారం యువకులు పట్టణంలో రంగులు చల్లుకున్నారు. అనంతరం గోదావరిలో స్నానానికి ఐదుగురు యువకులు దిగారు. స్నానం చేస్తూ లోతులో వీరు గల్లంతయ్యారు. వెంటనే అక్కడ వున్న జాలర్లు ముగ్గురు యువకులను కాపాడారు. కానీ ఇద్దరు మాత్రం విగత జీవులయ్యారు. వారిని స్థానిక ప్రైవేటు కళాశాలలో చదువుతున్న రాంప్రసాద్, రమేశ్ అనే ఇద్దరు యువకులుగా గుర్తించారు. వారి మృతదేహాల కోసం సిఐ బాణాల శ్రీనివాసులు, పట్టణ ఎస్సై కరుణాకర్‌లు పడవల ద్వారా జాలర్ల సాయంతో వెతికించారు. చివరకు రాంప్రసాద్, రమేశ్ అనే యువకుల మృతదేహాలను వెలికి తీశారు. పోస్టుమార్టం అనంతరం వారి కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పగించారు.
రామయ్య పెళ్లికొడుకాయనే...
* వసంతమాడిన సీతారాములు
* వైభవంగా డోలోత్సవం
* పెళ్లి పనులకు శ్రీకారం
భద్రాచలం, మార్చి 12: శ్రీ సీతారామచంద్రస్వామి హోలీ వేళ పెళ్లికొడుకుయ్యాడు. శ్రీ రామనవమి బ్రహ్మోత్సవాలకు ముందు హోలీ వేళ స్వామిని పెళ్లి కొడుకుగా చేసి, సీతారాముల వసంతోత్సవం, డోలోత్సవం నిర్వహించి పెళ్లి పనులకు శ్రీకారం చుట్టడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం పినపాక, మణుగూరు నుంచి గోటి తలంబ్రాలతో పాదయాత్రగా వచ్చిన భక్తులతో పాటు దేవస్థానం తరఫున తలంబ్రాలను చిత్రకూట మండపంలో కలిపారు. ఆర్డీఓ శివనారాయణరెడ్డి, దేవస్థానం ఇఓ తాళ్లూరి రమేశ్‌బాబులు తలంబ్రాలు తీసుకుని చిత్రకూట మండపానికి మేళతాళాలతో వచ్చారు. మహిళలు రామనామ స్మరణ చేశారు. ముందుగా అర్చకుల వేదమంత్రోచ్ఛారణల మధ్య పసుపు కొమ్ములు కొట్టారు. అనంతరం పసుపు, కుంకుమ, అత్తరుతో తలంబ్రాలు కలిపారు. కోలాటాలు ఆడుతూ మహిళలు స్వామి వేడుకకు ఉత్సాహం నింపారు. అనంతరం గర్భగుడిలో ప్రత్యేక పూజలు జరిగాయి. రామయ్యను పెళ్లికొడుకుగా తయారుచేసి ప్రాకార మండపంలో బంగారు ఊయలలో ఉంచారు. స్వామికి సకల పూజలు చేశాక హోలీ సంబరాలు ప్రారంభించారు. అనేక ద్రవ్యాలు కలిపిన జలాలతో సీతారాములకు వసంతోత్సవం చేశారు. ఆ వసంతాన్ని భక్తులపై చల్లారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.