ఖమ్మం

సింగరేణి చరిత్రలో ఉత్పత్తి రికార్డు సాధించిన జెవిఆర్ ఓసి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సత్తుపల్లి, మార్చి 20: సింగరేణి బొగ్గుగనుల చరిత్రలో సత్తుపల్లి జలగం వెంగళరావు ఓపెన్ కాస్ట్ బొగ్గుగని ఏడాదిలో 50 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించి సరికొత్త రికార్డును నెలకొల్పిందని జెవిఆర్ ఓసి ప్రాజెక్టు అధికారి వి చంద్రవౌళి చెప్పారు. రికార్డు స్థాయిలో ఉత్పత్తి సాధించిన సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యధిక ఉత్పత్తితో ముందుకు సాగుతున్న జెవిఆర్ ఓసి 19-3-2017 నాటికి 2016-17 సంవత్సరానికి మైన్ల చరిత్రలోనే తొలిసారిగా 50లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించి సరికొత్త రికార్డును నెలకొల్పిందని చెప్పారు. సమయానికి అనుగుణంగా ప్రణాళికలు రచించుకుంటూ రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తిని సాధిస్తున్న జెవిఆర్ ఓసి సింగరేణి సంస్థ మనుగడలో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. 50లక్షల టన్నుల ఉత్పత్తి సాధిస్తున్న ఇతర ఓపెన్‌కాస్డ్ మైన్‌ల వైశాల్యంతో పోల్చుకుంటే జెవిఆర్ ఓసి గని వైశాల్యం చాలా చిన్నదన్నారు. అయినప్పటికి కార్మికులందరూ కలిసికట్టుగా శ్రమించడం ద్వారా ఈ తరహా అత్యున్నత ఉత్పత్తిని సాధించి రికార్డు నెలకొల్పారన్నారు. ఇదే తరహా స్ఫూర్తితో వచ్చే ఏడాది నిర్ధేశించిన 55లక్షల ఉత్పత్తిని సాధించే దిశగా కలిసి కృషి చేద్దామని కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ వెంకటాచారి, ప్రాజెక్టు ఇంజనీర్ దామోదర్‌రావు, అడిషనల్ మేనేజర్ నరసింహాస్వామి, సంక్షేమాధికారి సతీష్‌కుమార్, గుర్తింపు సంఘం నాయకులు చెన్నకేశవరావు, ఉపేంద్రాచారి ఇతర అధికారులు, సూపర్‌వైజర్లు, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.

పేలుడు పదార్థాలు సరఫరా చేస్తున్న ముఠా అరెస్టు

మణుగూరు, మార్చి 20: మావోయిస్టులకు పేలుడు పదార్థాలు సరఫరా చేస్తున్న ముఠాను మణుగూరు పోలీసులు పట్టుకున్నారు. మండల పరిధిలోని కొండాయిగూడెం గ్రామం నుంచి గోదావరి రేవు దాటి చర్ల వెళ్లేందుకు సిద్ధమవుతుండగా పక్కా సమాచారం ప్రకారం పోలీసులు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని సోదా చేయగా వారి వద్ద పేలుడుకు ఉపయోగించే 3వేల మీటర్ల డీకార్డు ఎక్స్‌పోజివ్ వైరు, రూ.20 వేల నగదు లభించింది. ఇందుకు సంబంధించి పట్టుబడిన నిందితుల్లో గుంజి విక్రమ్ చర్ల మండలం దేవరనాగారం గ్రామానికి చెందిన వ్యక్తి కాగా, మరో వ్యక్తి సోడె దేవాది ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లాకు తోగ్గూడెం గ్రామస్తుడిగా పోలీసులు గుర్తించారు. మరో కీలక వ్యక్తి ఖమ్మం జిల్లా పాలేరు మండలం వెంకటేశ్వరకాలనీకి చెందిన కుంచం రాజుగా పోలీసులు నిర్థారించారు. నిందితులను విచారించిన పోలీసులు స్థానిక డీయస్పీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో డీయస్పీ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. మణుగూరు డీయస్పీ అశోక్‌కుమార్ కథనం ప్రకారం ఖమ్మం జిల్లా పాలేరుకు చెందిన రాజు ఆ పరిసర ప్రాంతాల్లో తన వద్ద ఉన్న కంప్రెషర్ డ్రిల్లింగ్ మిషన్ సహాయంతో క్వారీల్లో మందుగుండు నింపేందుకు డ్రిల్లింగ్ చేస్తుంటాడు. ఈ క్రమంలో మహబూబాబాద్ జిల్లాకు చెందిన పేలుడు పదార్థాల సరఫరా అనుమతి ఉన్న మోహన్ అనే వ్యక్తి నుంచి డీకార్డు ఎక్స్‌పోజిల్ కేబుల్ కొనేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. చర్ల మండలంలో జరిగిన సంతలో బీజాపూర్‌కు చెందిన సోడె దేవా ద్వారా మావోయిస్టులు నిందితుల్లో ఒకరైన విక్రమ్‌కు రూ.80వేలు కేబుల్ కొనుగోలు చేసేందుకు అందజేశారు. వీరు పాలేరుకు చెందిన రాజు ద్వారా మోహన్ వద్దకు వెళ్లి కేబుల్ కొని వాటిని మావోయిస్టులకు అందజేసేందుకు మణుగూరు చేరుకున్నారు. పక్కా సమాచారంతో గోదావరి ఒడ్డున నది దాటేందుకు సిద్ధంగా ఉన్న ముగ్గురు నిందితులను కేబుల్‌తో సహా పట్టుకొని వారి వద్ద ఉన్న రూ.20వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు, నిందితులను మణుగూరు కోర్టులో హాజరుపర్చనున్నట్లు డీయస్పీ తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తుల ధ్వంసమే ధ్యేయంగా మావోయిస్టులు చేస్తున్న దుశ్చర్యలను డీయస్పీ తీవ్రంగా ఖండించారు. అదేవిధంగా నిందితులను పట్టుకోవడంలో కీలకపాత్ర పోషించిన మణుగూరు సీఐ మొగిలి, ఎస్సై నరహరి, సిబ్బందిని ఆయన అభినందించారు.