ఖమ్మం

నేటి నుంచే.. కొత్త విద్యా సంవత్సరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, మార్చి 20: గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి విద్యాశాఖ సన్నద్ధమవుతోంది. ఈ నెల 21 (నేటి) నుంచి నూతన ప్రణాళికలతో నూతన విద్యా సంవత్సరం ప్రారంభించడానికి ప్రధానోపాధ్యాయులను సిద్ధం చేస్తోంది. వాస్తవానికి సీసీఈ బోధన విధానంతో సీబీఎస్‌ఈ తరహాలో కొత్త విద్యా సంవత్సరాన్ని వేసవిలోనే ప్రారంభించేందుకు గతేడాదే ప్రయత్నాలు చేసిన ప్రభుత్వం నాటి పరిస్థితుల దృష్ట్యా వాయిదా వేసింది. ఈసారి మాత్రం కచ్ఛిత నిర్ణయంతో షెడ్యూల్ ప్రకటించింది. ఈనెల 20వ తేదీలోపు 2016-17 విద్యా సంవత్సరం తుది ఫలితాలను విద్యార్థులకు అందజేసి 21వ తేదీ నుంచి విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేయాలని, ప్రవేశాలను చేపట్టాలని ఆదేశించింది. ముఖ్యంగా అంగన్‌వాడీ కేంద్రంలోని చిన్నారులను ప్రైవేట్‌కు తరలించకుండా ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేలా ప్రణాళిక రూపొందించారు. ఈనెల 21వ తేదీన ప్రారంభమయ్యే నూతన విద్యా సంవత్సరంలో ఐదురోజుల పాటు ప్రత్యేక కార్యాచరణను విద్యాశాఖ విడుదల చేసింది. ఏప్రిల్ 23వరకు కొనసాగే నూతన విద్యా సంవత్సరంలో అనుసరించాల్సిన విధులు, బాధ్యతలను విద్యాశాఖాధికారులు ప్రకటించారు. 21వ తేదీన పాఠశాలల పునప్రారంభం, ప్రవేశ ప్రకటన, దరఖాస్తుల స్వీకరణ, స్థానిక సర్పంచి, ఎస్‌ఎంసీ ఛైర్మన్, ఇతర ప్రజాప్రతినిధులతో పాఠ్య పుస్తకాలను పంపిణీ చేయాలి. ఎస్‌ఎంసీ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి, బడిబయట పిల్లలను పాఠశాలలో చేర్పించే అంశంపై చర్చించాలి. గ్రామ విద్యా రిజిస్టర్‌ను పూర్తి చేయాలి. 22న ప్రాథమిక, ప్రాథమికోన్నత ప్రధానోపాధ్యాయులు తమ పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రంలో ఉన్న చిన్నారుల జాబితాను సిద్ధం చేయాలి. అలాగే 5,7,8వ తరగతులు పూర్తి చేసిన విద్యార్థుల జాబితాను తయారు చేయాలి. ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించి బోధన ప్రణాళిక చేయాలి. 23న అంగన్‌వాడీలో ఉన్న చిన్నారులనరు 1వ తరగతిలో చేర్పించాలి. పాఠశాలలు అందంగా అలంకరించి సామూహిక అక్షరభ్యాసం చేయించాలి. పూర్వ విద్యార్థులతో, స్వచ్చంధ సంస్థల సహకారంతో నోటు పుస్తకాలు, పలకలు ఇప్పించాలి. ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు 5వ తరగతి విద్యార్థులను సమీపంలోని ఉన్నత పాఠశాలల్లో చేర్పించాలి. 24న పాఠశాలల అభివృద్ధి ప్రణాళిక తయారు చేయాలి. 25వ తేదీ నుంచి ఏప్రిల్ 15వ తేదీ వరకు విద్యార్థుల డేటా మానటరింగ్ సమాచారం సీఆర్‌పీలు ఇవ్వాలి.

సంసిద్ధతపై సందిగ్ధత

ఏటా పదో తరగతి పరీక్షలు పూర్తయ్యాక ఏప్రిల్ మాసంలో ఒకటి నుంచి 9 తరగతుల విద్యార్థులకు వార్షిక పరీక్షలు జరిగేవి. ఏప్రిల్ 23 వరకు మూల్యాంకనం, దస్త్రాల నమోదు, ఫలితాల ప్రకటన జరిగేవి. ఆ మరుసటి రోజు నుంచి వేసవి సెలవులు ఇచ్చేవారు. కానీ ఈ ఏడాది ఆ షెడ్యూల్ మారింది. ఒకటి నుంచి 9వ తరగతి వారికి పరీక్షలు ముందుగానే నిర్వహించారు. రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాలతో ఉపాధ్యాయుల్లో ఎన్నడూ లేనంత హడావుడి కనిపిస్తోంది. ఈలోపే నూతన విద్యా సంవత్సరం ప్రారంభించాలని ఉత్తర్వులు ఇవ్వడంతో ఉపాధ్యాయులు దీనికి ఎలా సన్నద్ధమవుతారన్న దానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వేసవి ఒంటిపూట బడుల్లో పాఠ్యాంశాల బోధన ఆశించిన రీతిలో సాగదని ఉపాధ్యాయ సంఘాలు పేర్కొంటున్నాయి. తాగునీటి వసతి, ఉక్కపోత నుంచి ఉపశమనానికి సౌకర్యాలు అందుబాటులో లేని పాఠశాలల్లో పాఠశాలల నిర్వహణ ఇబ్బందికరంగా ఉంటుందని వారు వాదిస్తున్నారు. అవసరమైన మేర పాఠ్య పుస్తకాలు సమకూర్చితే గాని నూతన విద్యా సంవత్సరం సజావుగా సాగదని వారు చెబుతున్నారు. గతంలో విద్యా సంవత్సరం ప్రారంభమై మూడు, నాలుగు నెలలు గడిచినా పాఠ్య పుస్తకాలు పూర్తిస్థాయిలో అందని పరిస్థితి ఉండేది. ఇప్పుడు నూతన విద్యా సంవత్సరం ప్రారంభం రోజునే పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయాలని విద్యాశాఖ ఆగమేఘాల మీద పుస్తకాలను జిల్లాకు పంపింది. కానీ ఆ పుస్తకాలు పూర్తిస్థాయిలో రాలేదు. దీంతో విద్యా బోధన ఇబ్బందికరంగా మారుతుందనే సందేహాన్ని ఉపాధ్యాయులు వ్యక్తం చేస్తున్నారు.

ద్విచక్ర వాహనాలు, కారు దొంగల అరెస్ట్
17 మోటార్ సెకిళ్ళు, కారు స్వాధీనం
* విలేఖరుల సమావేశంలో అడిషనల్ సిపి వెల్లడి
ఖమ్మం(ఖిల్లా), మార్చి 20: జల్సాలకు అలవాటు పడి అడ్డదారుల్లో డబ్బు సంపాదనే ధ్యేయంగా ఇద్దరు యువకులు ఖమ్మం నగరంలో ద్విచక్ర వాహనాలు, కారు దొంగిలించి పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. టూటౌన్ పోలీసులు కలెక్టరేటు, ఎన్‌టిఆర్ సర్కిల్ వద్ద వాహనాలను తనీఖీ చేస్తుండగా ఇద్దర అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారించగా ఈ దొంగతనాలు బయటపడ్డాయి. సోమవారం స్థానిక టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో అడిషనల్ సిపి సాయికృష్ణ వివరాలను వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జులూరుపాడుకు చెందిన కిలారి వినోద్, ఆంధ్రప్రదేశ్ రాష్రంలోని తూర్పుగోదావరి జిల్లా నర్సిపుడి గ్రామానికి చెందిన తోట వెంకటరమణలను గత కొన్ని నెలలుగా ఖమ్మంలో ఈ దొంగతనాలకు పాల్పడుతున్నారు. కిలారి వినోద్ గత నాలుగు నెలలుగా ఖమ్మంలో ని సర్దార్‌పటేల్ స్టేడియం వద్ద పార్కింగ్ చేసిన వాహనాలపై కన్నువేశాడు. అప్పటి నుండి ఇతను నకీలీ తాళం చేతులతో 17ద్విచక్ర వాహానలాను దొంగిలించాడు. తోట వెంకటరమణ అనే యువకుడు తూర్పుగోదావరి జిల్లా నుంచి ఖమ్మంకు తరచూ వస్తూ కార్లను దొంగిలించేందుకు దృష్టి పెట్టాడు. సరితా క్లినిక్ సెంటర్ వద్ద పార్కు చేసిన ఇండికా కారును అపహరించాడు. తరచూ వాహానాలు అపహరణకు గురికావడం, వాహనాల యజమానులు ఫిర్యాదు మేరకు అడిషన్ సిపి అదేశాల మేరకు టూటౌన్ పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి అనుమానితులు, పాత నేరస్థులను విచారించి దొంగతనాలను చేధించారు. అపహరణకు గురైన 9లక్షల విలువ గల 17ద్విచక్ర వాహానాలను, 2లక్షల విలువ చేసే కారును స్వాధీనం చేసుకొని కోర్టుకు రిమాండ్ చేసినట్లు తెలిపారు. విలేఖరుల సమావేశంలో ఎసిపి గణేష్, సిఐ రాజిరెడ్డి, ఎస్‌ఐ ఓంకార్‌లు పాల్గొన్నారు.
విజ్ఞప్తులను సత్వరం పరిష్కరించాలి
కొత్తగూడెం, మార్చి 20: ప్రజావాణిలో వచ్చిన విజ్ఞప్తులను సంబంధిత అధికారులు వెంటనే పరిష్కరింప చేసే విధంగా చర్యలు చేపట్టాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన గ్రీవెన్స్‌డేలో మాట్లాడారు. అనంతరం ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులను నిశితంగా పరిశీలించి సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలన్నారు. ఉద్యోగ నియామకానికి ప్రభుత్వ ప్రకటనలు వెలువడినప్పుడే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ప్రజావాణిలో దరఖాస్తు చేసుకోరాదని అన్నారు. మండల స్థాయిలో జారీ చేయబడిన అంత్యోదయ కార్డుల వివరాలను అందజేయాలని తహశీల్దార్లను, జిల్లాలో డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని పంచాయతీరాజ్ ఇఇ పివై రామచంద్రను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ రాంకిషన్, డిఆర్వో కిరణ్ కుమార్, డిఆర్‌డివో పిడి జగత్ కుమార్ రెడ్డి, ఆర్డీవో రవీంద్రనాధ్, డిఎంహెచ్‌వో వెంకటేశ్వరరావు, జిల్లా సంక్షేమ అధికారిణి ఝాన్సీ, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.