ఖమ్మం

వెలవెలబోతున్న ఎర్ర బంగారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏన్కూరు, మార్చి 25: ఆరుగాలం శ్రమించి పండించిన ఎర్ర బంగారానికి రోజురోజుకు ధర తగ్గిపోవటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం మిర్చి ధర పూర్తిగా తగ్గిపోవడంతో రాబోయో కాలంలో పెరుగుతుందనే ఆశతో కోల్డ్ స్టోరేజ్‌లలో నిల్వ చేసేందుకు రైతులు పోటీలు పడుతున్నారు. దీనిలో భాగంగా తల్లాడ మండలం నరసింహారావుపేట గ్రామ సమీపంలోని సాయి బాలాజి, శ్రీరామా-2 కోల్డ్ స్టోరేజిల్లో మిర్చి నిల్వ చేసేందుకు ట్రాక్టర్లతో రైతులు వేల బస్తాలు తరలిస్తున్నారు. ఏన్కూరు, జూలూరుపాడు, తల్లాడ, కొణిజర్ల, రఘునాధపాలెం, ఖమ్మం అర్భన్ తదితర మండలాల నుండి రైతులు మిర్చిని గిడ్డంగులలో నిల్వ చేసుకునేందుకు వేల క్వింటాళ్లను తరలిస్తున్నారు. ఇప్పటికే అక్కడ సాయి బాలజి కోల్డ్ స్టోరేజ్ పూర్తిగా నిండిపోవటంతో స్టోరేజ్ నిండింది అని బోర్డు పెట్టారు. ఇక అక్కడ శ్రీరామ2 స్టోరేజ్ ఒక్కటి మాత్రమే ఉండటం రైతులు భారీగా తరలి రావటంతో వాహనాలు పోటెత్తాయి. స్టోరేజ్ నుండి సుమారు కిలోమీటర్ పరిధిలో మిర్చితో ఉన్న వాహనాలు ప్రధాదాన రహదారిపై క్యూలు కట్టారు. ప్రస్తుతం ఉన్న మిర్చి ధరకు పెట్టుబడులు కూడా రావటం కష్టం అని భావించిన రైతులు భవిష్యత్తులో ధర పెరుగుతుందన్న ఆశతో గిడ్డంగులు వద్దకు పరుగులు తీస్తున్నారు. జిల్లాలో చాలా చోట్ల స్టోరేజ్‌లు నిండిపోవటంతో తల్లాడ వద్దకు చేరిన రైతులు 3 రోజులుగా గిడ్డంగిలో బస్తాలు నిల్వ చేసుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. తల్లాడ వద్ద ఉన్న కోల్డ్ స్టోరేజ్‌లలో ఒక్కొక్క దానిలో సుమారు లక్షా 30 వేలు బస్తాలు నిల్వ చేసుకొనేందుకు అవకాశం ఉన్నప్పటికీ ఇప్పటికే ఒకటి పూర్తిగా నిండిపోయింది. మరొకదానిలో నిల్వ చేసేందుకు దాని సామర్థ్యానికి మించి మిర్చి వాహనాలు తరలిరావటంతో స్టోరేజ్ యజమానులు సైతం అయోమయానికి గురవుతున్నారు. గత ఏడాది క్వింటా 11 వేలు పలికిన మిర్చి ధర, ఈ ఏడాది ప్రస్తుతం 6 వేలు మాత్రమే పలకటంతో రైతులు పండించిన మిర్చిని అమ్మలేక నిల్వ చేసుకోటానికి పరిస్థితులు అనుకూలించక సతమతమైపోతున్నారు.

పెట్టుబడిదారుల ప్రయోజనాలే లక్ష్యంగా కెసిఆర్ పరిపాలన

* సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని
కొత్తగూడెం, మార్చి 25: పెట్టుబడిదారుల ప్రయోజనాలే లక్ష్యంగా ముఖ్యమంత్రి కెసిఆర్ పరిపాలన సాగిస్తూ ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తున్నారని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. శనివారం స్థానిక శేషగిరి భవన్‌లో సిపిఐ నియోజకవర్గ ప్రజా సంఘాల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వరాష్ట్రం కోసం ప్రాణాలకు త్యగించి పోరాడిన అన్ని వర్గాల ప్రజలను అధికారం చేపట్టిన టిఆర్‌ఎస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలను రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ తక్షణమే అమలు చేయాలని లేనిపక్షంలో ప్రజలు తగిన రీతిలో బుద్దిచెపుతారని హెచ్చరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉధ్యమాలు చేస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్‌కె సాబీర్‌పాషా, నాయకులు బరిగెల సాయిలు, బందెల నర్సయ్య,గుత్తుల సత్యనారాయణ, కందుల భాస్కర్, గార్లపాటి రామనాధం, వై శ్రీనివాసరెడ్డి, సలిగంటి శ్రీనివాస్, చంద్రగిరి శ్రీనివాస్, కంచర్ల జమలయ్య, కూసన వీరభద్రయ్య, వంగా వెంకట్‌లు పాల్గొన్నారు.