ఖమ్మం

బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికలు, పోస్టర్ల ఆవిష్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, మార్చి 25: శ్రీసీతారామచంద్రస్వామి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికలు, పోస్టర్లను శనివారం హైదరాబాదులో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సున్నం రాజయ్య, కోరం కనకయ్య, మదన్‌లాల్, పాయం వెంకటేశ్వర్లు, తాటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ ఆవిష్కరించారు. భద్రాచలం నుంచి దేవస్థానం ఈఓ తాళ్లూరి రమేశ్‌బాబు, అర్చకులు మురళీకృష్ణమాచార్యులు, శ్రావణకుమారాచార్యులు ఆహ్వాన పత్రికలు, వాల్‌పోస్టర్లను తీసుకెళ్లారు. ఈ సందర్భంగా వీరు ముందుగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సాంస్కృతిక శాఖ కార్యదర్శి రమణాచారి, దేవాదాయ కమిషనర్‌కు ఆశ్వీరచనం ఇచ్చి దేవస్థానం తరఫున ప్రసాదం అందజేశారు. అనంతరం పోస్టర్లు, బ్రహ్మోత్సవాల ఆహ్వన పత్రికలను ఆవిష్కరించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కమిషనర్లు, ముఖ్య కార్యదర్శులకు అందజేశారు. ఈ నెల 29 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభవౌతున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 4 సాయంత్రం ఎదుర్కోలు, 5న శ్రీరామనవమి సీతారాముల కల్యాణం, 6న పట్ట్భాషేకం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రులకు రాజలాంఛనాలతో ఆహ్వానపత్రికలు అందజేసి, బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించనున్నట్లు తెలిపారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఇంద్రకరణ్‌రెడ్డి ఏర్పాట్ల గురించి ఆరా తీశారు. ఈ నెల 29 నాటికల్లా శ్రీరామనవమి ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని భక్తులకు విరివిగా మంచినీరు అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిసి అనిల్ కుమార్, కత్తి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

ఈనామ్‌పై మారని తీరు
ఖమ్మం(గాంధీచౌక్), మార్చి 25: ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో ఈనామ్‌పై వ్యాపారులు తీరు మారటం లేదు. శనివారం ఈనామ్ పద్ధతిలో పత్తి కొనుగోళ్ళు చేసేందుకు వ్యాపారులు నిరాకరించారు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ నెల 22న ఈనామ్‌కు వ్యతిరేకంగా ఖమ్మం మార్కెట్‌లో సమ్మె చేసేందుకు సిద్ధమైన వ్యాపారులు, రైతు సంఘాలతో జిల్లా జాయింట్ కలెక్టర్ నిర్వహించిన సమావేశంలో వ్యాపారులు సమ్మెను 15 రోజులు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ 15 రోజులు ఈనామ్ ద్వారానే పంటలను కొనుగోలు చేస్తామని చెప్పిన వ్యాపారులు తిరిగి ఈనామ్ ద్వారా పంటలను కొనుగోలు చేయలేమంటూ కొనుగోళ్ళు నిలిపివేశారు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. దీంతో మార్కెట్ కమిటీ చైర్మన్ ఆర్‌జెసి కృష్ణ జెసికి ఫోన్ ద్వారా వివరించారు. జెసి అందుబాటులో లేకపోవటంతో ఖమ్మం ఆర్డీవో పూర్ణచంద్రరావును మార్కెట్‌కు పంపించారు. వ్యాపారులతో ఆర్డీవో చర్చలు జరిపినా వ్యాపారులు మాత్రం ఈనామ్ ద్వారా కొనుగోళ్ళు చేయాలేమని ఆర్డీవోకు తెలిపి చర్చలు జరపకుండానే బయటకు వచ్చేశారు. అనంతరం వ్యాపారులు పంటలను కొనుగోళ్ళు చేయకుండా వర్తక సంఘం కార్యాలయంలో చర్చలు జరుపుకొన్న తరువాత కొనుగోళ్ళు చేస్తామని చెప్పి వెళ్ళిపోయారు. దీంతో 12 గంటలకు కార్యదర్శి ప్రసాదరావు వ్యాపారులకు ఫోన్ చేసి ఈనామ్ ద్వారా పంటలను కొనుగోలు చేయాలని, రైతులను ఇబ్బందుల పెట్టవద్దని చెప్పటంతో వ్యాపారులు 12 గంటల తరువాత బిడ్డింగ్ చేసుకొని కొనుగోళ్ళు జరిపారు.
ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో రోజురోజుకు వివాదంగా మారుతున్న ఈనామ్ వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈనామ్ పద్ధతి ముందుగా వరంగల్‌లో ప్రారంభించిన తరువాతే ఖమ్మం మార్కెట్‌లో చేయాలని వ్యాపారులు చేస్తున్న డిమాండ్‌కు అధికారులు ఏ రకంగా స్పందిస్తారనది ప్రశ్నార్థకంగా మారింది. దీనిపై అసలు నిర్ణయం తీసుకునే వరకు రైతులకు తిప్పలు తప్పటం లేదు.