ఖమ్మం

మిర్చి మంటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(గాంధీచౌక్), ఏప్రిల్ 9: రాష్ట్రంలో మిర్చి మంటలు రోజురోజుకు రగులుతున్నాయి. పండించిన మిర్చి పంటకు ధరలేక రైతు కుప్పకూలిపోయాడు. పంట ప్రారంభంలో క్వింటా 12వేలు మద్దతు ధర పలకగా ప్రస్తుతం పంట చేతికివచ్చి అమ్ముకునే సమయంలో నాలుగు వేలకు పడిపోయింది. దీంతో మార్కెట్‌కు వెళ్ళవల్సిన రైతు రోడ్డెక్కాడు. జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా రైతుకు కాంగ్రెస్, టిడిపి, వామపక్ష పార్టీలు అండగా నిలిచి ఆందోళన బాటపట్టారు. ఎక్కడ పడితే అక్కడ రోడ్లపై మిర్చి దగ్దం చేస్తూ నిరసనలు తెలుపుతున్నారు. ఇంత జరుగుతున్నప్పటికీ పాలకపక్షాలు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుంది. వ్యవసాయ కమిటీ యార్డులలో మిర్చి కుప్పలు తెప్పలుగా వచ్చి పడ్డాయి. ప్రకృతి కరుణించక పోవడం, నకిలీ విత్తనాలు, నకిలి ఎరువులతో నష్టపోతున్న రైతుకు ఈ ఏడాది ప్రకృతి కొంతమేరకు కరుణించినప్పటికీ ప్రభుత్వం మద్దతు ధర కల్పించక పోవడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పత్తికి ప్రత్యామ్నయంగా పంటలు వేయాలని చెప్పిన ప్రభుత్వం మిర్చి మద్దతు ధర విషయంలో చేతులేత్తెయడంతో రైతాంగం పరిస్థితి అగమ్యఘోచరంగా తయారైంది. ప్రభుత్వం పట్టిపట్టనట్లుగా ఉండటంతో వ్యాపారులు కుమ్మక్కై రైతును మరింతగా దోచుకుంటున్నారు. ఎకరం పొలంలో పండించిన మిర్చి ఏరేందుకు కూలీలు దొరకక నానా యాతన పడుతున్నారు. కూలీ రేట్లు పెరగడంతో మిర్చి ఏరేందుకు కూలీలకే దాదాపు 40వేల రూపాయలను వెచ్చించవల్సి వస్తుంది. ఒక కూలీ విషయమే ఇలా ఉంటే పెట్టుబడి మరింత దారుణంగా తయారైంది. వీటన్నింటికి తోడు మద్దతు ధర లభించక పోవడంతో కొంత మంది రైతులు పంటను పొలంలోనే దున్నుతున్నారు. కడుపుమండిన రైతు వ్యవసాయ మార్కెట్లలో మిర్చిని దగ్ధం చేసి తన ఆవేదనను వ్యక్త పరుస్తున్నారు. రైతు దారుణ పరిస్థితిన గమనించిన ప్రతి పక్ష పార్టీలైన కాంగ్రెస్, టిడిపి, సిపిఐ, సిపిఎం, న్యూడెమోక్రసిలు రైతుకు అండగా నిలచి ఆందోళన బాట పట్టారు.