ఖమ్మం

పాప పరిహారం కోసం శిలువపై రక్తాన్ని చిందించిన ఏసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం రూరల్, ఏప్రిల్ 14: గుడ్‌ఫ్రైడే సందర్భంగా కరుణగిరిలో నిర్వహించిన ‘మహా సజీవ సిలువ యాత్ర’ భక్తులను మైమరిపించింది. 2017వ సంవత్సరానికి ముందు ఏసుప్రభువును శిలువ వేసిన సందర్భాన్ని స్థానిక నాయుడుపేటలోని కరుణగిరిలో రఘునాధపాలెం మండలం బల్లేపల్లి విరచాణ పరిధిలోని చింతగుర్తి గ్రామానికి చెందిన కినె్నర గోపాలరావు బృందం నిర్వహించిన ‘మహా సజీవ శిలువ యాత్ర’ దృశ్యాలు కళ్ళకు కట్టినట్టుగా ప్రదర్శించారు. బిషప్‌హౌజ్ సమీపంలోని ఆల్ఫా-ఒమేగా స్థూపం నుంచి కరుణగిరి పుణ్యక్షేత్రం వరకు మార్గమధ్యంలో యేసుప్రభువు సిలువ వేసిన సందర్భంలో ఆయన పడిన శ్రమలకు ప్రతీకగా తీర్చిదిద్దిన స్తూపాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తూ సజీవ సిలువ మార్గం సాగింది. అనంతరం కపాలకొండ వద్ద యేసుప్రభువుతో పాటు మరో ఇద్దరు బందిపోటు దొంగలను కూడా సిలువ వేయడం, ఆసందర్భంలో ఆయన పలికిన ఏడు పలుకులు, ఆయన మరణించిన తరువాత సమాధి చేయడం వంటి దృశ్యాలు కళ్లెదుటే జరుగుతున్నట్టుగా ఉండడంతో హాజరైన విశ్వాసులంతా కన్నీరు పెట్టుకున్నారు. ఈసందర్భంగా ఖమ్మం పీఠాధిపతి బిషప్ మైపన్‌పాల్ మాట్లాడుతూ ఆ తండ్రి ఆజ్ఞ వల్లనే యేసుప్రభువు పాప పరిహారం కోసం సిలువపై రక్తాన్ని చిందించి తన త్యాగనిరతిని చాటుకున్నారన్నారు.
సిలువ వేసే సందర్భంలో ఆయన అనుభవించిన శ్రమలు, ఆయన పలికిన ఏడు మాటలను ఖమ్మం మేత్రాసనం పీఠాధిపతి బిషప్ మైపన్‌పాల్ వివరించారు. అందరూ యేసుప్రభువు చూపిన మార్గంలో నడిచి తమ జీవితాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుకోవాలన్నారు. ఆ తండ్రి ఆదేశానుసారం యేసుప్రభువు శిలువపై ప్రాణాలు విడిచి పాపులను రక్షించాడని, ప్రజలు ఆత్మపరిశీలన చేసుకొని ముందుకు సాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మహా సజీవ సిలువ యాత్ర బృందం, వివిధ విచారణల ఫాదర్లు, భక్తులు వేలాది సంఖ్యలో పాల్గొన్నారు.
రైతు సంక్షేమమే కెసిఆర్ ధ్యేయం
* ఎఎంసి చైర్మన్ కృష్ణ
ఖమ్మం(గాంధీచౌక్), ఏప్రిల్ 14: రాష్ట్రంలోని రైతులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా నూతన తెలంగాణ రాష్ట్రంలో రైతు సంక్షేమమే ధ్యేయంగా కెసిఆర్ పాలన నడుస్తోందని, రైతుల కోసం రానున్న రోజుల్లో అనేక పథకాలు ప్రవేశ పెట్టనున్నట్లు ఖమ్మం వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఆర్‌జెసి కృష్ణ పేర్కొన్నారు. రాష్ట్రంలో రైతుల కోసం ఎకరానికి 4వేలు, ఉచిత ఎరువులు వంటి భహత్తరమైన పథకాలను ప్రవేశ పెట్టిన సందర్భంగా శుక్రవారం మార్కెట్‌లో కెసిఆర్ చిత్రపటానికి రైతులతో కలసి మార్కెట్ కమిటీ సభ్యులు పాలాభిషేకం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కృష్ణ మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో రైతుల కోసం ప్రవేశపెట్టని ఆద్భుతమైన పథకాలను ప్రవేశ పెట్టిన ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్‌కే దక్కిందన్నారు. దీంతో పాటు పగటిపూట ఉచిత విద్యుత్, గోదావరి జలాలను లక్ష ఎకరాలకు వినియోగించుకునేందుకు ప్రణాళికలు, సక్రమంగా విత్తనాల పంపిణీ, గోదాంల మంజూరు, ట్రాక్టర్లు వంటి సౌకర్యాలను అందించేందుకు కెసిఆర్ ప్రభుత్వం రానున్న బడ్జెట్‌లో ప్రవేశపెట్టి అమలు చేసే విధంగా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. మే నెల నుండే రైతుల ఖాతాలలో ఎకరాకు నాలుగు వేల చొప్పున జమ చేయనున్నట్లు, ఐదు ఎరువు కట్టలను అందించేందుకు సిద్దం చేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే డ్రిఫ్ ఇరిగేషన్ నాబార్డు ద్వారా ఆయా కులాలను భట్టి రాయితీలను, 75శాతం అధిక సబ్సీడి ఇస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉందన్నారు. రైతుల కోసం పాటుపడుతున్న టిఆర్‌ఎస్ ప్రభుత్వానికి ఎల్లవేళలా అండగా ఉండాలన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కార్యదర్శి ప్రసాదరావు, నీలం కృష్ణ, డైరక్టర్ చారి, వైస్ మనోహర్, ఎర్రా అప్పారావు, గడ్డం త్రీలోక్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

కస్టోడియన్ భూమిపై కేసు నమోదు
* పోలీస్‌స్టేషన్‌కెళ్లిన ఇరువర్గాలు
కల్లూరు, ఏప్రిల్ 14: కల్లూరు రెవెన్యూ పరిధిలోని సర్వేనెంబరు 19లో ఉన్న 7కుంటల స్థలం మాదంటూ అటవీశాఖ, కాదు మాకిచ్చారంటూ మసీదు కమిటి నాయకులు ఒకరిపైనొకరు ఆరోపించుకోవటంతో పరిష్కారానికి ఇరువర్గాలు పోలీస్టేషన్‌కు చేరుకున్నారు. ఈ విషయమై అటవీశాఖాధి కారి (ఎఫ్‌ఎస్‌ఓ) కృష్ణమూర్తి మాట్లాడుతూ ముస్లిం నాయకులు ఆరోపిస్తున్న స్థలం తమ శాఖదేనని దీనిక సంబంధించి అన్ని అనుమతులున్నాయని తెలిపారు. ఈ అనుమతులతోనే ఈ స్థలంలో బోరు నిర్మించేందుకు వెళ్లగా అడ్డుకున్నట్లు తెలిపారు. త్వరలో అన్ని ఆధారాలను పోలీస్టేషన్‌లో సమర్పించి తమ పనులు ప్రారంభించనున్నట్లు కృష్ణమూర్తి తెలిపారు. ఇదిలా ఉండగా ముస్లిం కమిటీ అధ్యక్షుడు సయ్యద్ ఆలీ మాట్లాడుతూ షాదీఖానాను అభివృద్ధి చేసేందుకు ఖాళీగా ఉన్న ఈ స్థలాన్ని ప్రభుత్వం నుండి తీసుకునేందుకు మంత్రులతో, అధికారులను కలిసి వివరించగా తమ కమిటికి ఇచ్చేందుకు సానుకూలంగా ఉన్నందున అడ్డుకున్నామని అన్నారు. దీనిక సంబంధించిన ఆధారాలను త్వరలో పోలీస్టేషన్‌లో అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లీం నాయకులు సయ్యద్ ఖాసీం, ఇస్మాయిల్, ఖలీజ్, అజారుద్దీన్, కమల్‌పాషా తదితరులు పాల్గొన్నారు.