ఖమ్మం

తెరాసలో తీరని గ్రూపుల సమస్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్, ఏప్రిల్ 21: తెరాస అధికారం చేపట్టి మూడేళ్లు కావస్తున్నా భద్రాచలం గులాబీదళం గాడిలో పడలేదు. నాయకుల్లో గ్రూపు తగాదాల కారణంగా కార్యకర్తల బాగోగులు పట్టించుకునే దిక్కే లేకుండా పోతోంది. ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరించడంతో పార్టీలో స్తబ్ధత నెలకొంది. పార్టీ ఆదేశాల మేరకు భద్రాచలం నియోజకవర్గ, మండల నూతన కమిటీల ఎన్నిక తీవ్ర వివాదానికి దారి తీసింది. కొత్తవారి చేరికతో ఉద్యమకాలం నుంచి పార్టీలో మమేకమైన నాయకుల్లో అభద్రతాభావం పెరగగా.. అగ్గికి ఆజ్యం పోసినట్లు సంస్థాగత ఎన్నికలు సరికొత్త వివాదానికి దారి తీశాయి. పార్టీ పరిశీలకుడు, ఎమ్మెల్యే బాలసాని సమక్షంలో నియోజకవర్గ, పట్టణ కమిటీలను నియమించేందుకు వారం రోజుల క్రితం ఏర్పాటు చేసిన సమావేశం రసాభసగా మారగా, నూతన కమిటీని ఎవరికి చెప్పకుండా నియమించారని సీనియర్లు ఆరోపిస్తున్నారు. తెరాస సీనియర్ నాయకులు తమ అసంతృప్తిని బహిరంగంగానే వెళ్లగక్కినా తమ మాటలను పెడచెవిన పెట్టడం వివాదమైంది. ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణకు పిండ ప్రదానం చేసేవరకూ పరిస్థితి వెళ్లిందంటే గులాబీదళంలో అసంతృప్తి ఏ మేరకు ఉందో అర్ధం చేసుకోవచ్చు.
టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టిన తర్వాత సంస్థాగత ఎన్నికలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా భద్రాచల నియోజకవర్గ, మండల కమిటీల ఎన్నిక ఏకపక్షంగా సాగిందని, గుట్టుచప్పుడు కాకుండా, ఎవరినీ సంప్రదించకుండా కమిటీలు వేయడం ఏమిటని సీనియర్ నాయకులు ధ్వజమెత్తుతున్నారు. ఆంధ్రాకు చెందిన వ్యక్తి వివిధ పార్టీల్లో ఉండి అధికార దాహంతో తెరాసలో చేరారని, ఆయనను ఏకంగా నియోజకవర్గ ఇంఛార్జ్‌గా నియమించడం సీనియర్లకు మింగుడు పడటం లేదు. నియోజకవర్గ ఇంఛార్జ్‌గా మానె రామకృష్ణను నియమించడంపై సీనియర్లు భగ్గుమన్నారు. ఎమ్మెల్సీ బాలసాని సమక్షంలో ఎన్నిక కోసం నిర్వహించిన సమావేశం సీనియర్లు ధ్వజమెత్తడంతో ఇటీవల వాయిదా పడింది. అయితే దొడ్డిదారిన కమిటీలు వేశారని, కమిటీల్లో ఆది నుంచి పార్టీ జెండాలు మోసిన వారిని విస్మరించారని సీనియర్లు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా ఎన్నికల పరిశీలకుడిగా ఉన్న బాలసానిపై సీనియర్ నేతలు ఆగ్రహంతో ఉన్నారు. పార్టీ కోసం పనిచేసిన వారిని గౌరవించాల్సిందేనని, పార్టీ అభివృద్ధి కోసం ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి గౌరవిస్తామని బాలసాని చెప్పినా కమిటీల నియామకం ఏకపక్షంగా జరగడంతో సీనియర్ నేతలు తీవ్ర నిరసన తెలుపుతున్నారు. రెండు రోజుల క్రితం బాలసాని తీరును నిరసిస్తూ గోదావరిలో ఆయన పేరిట ప్రదానం చేసి విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు పణంగా పెట్టిన తమకు ఎటువంటి గుర్తింపు ఇవ్వకుండా వివిధ పార్టీల నుంచి రాజకీయ లబ్ధి కోసం చేరిన వారికి పదవులు ఇవ్వడం తమను అవమానించినట్టేనని వారు పేర్కొంటున్నారు. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్లెక్సీని కాలితో తన్ని ధ్వంసం చేసిన వ్యక్తికి పదవి ఇవ్వడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. జిల్లాస్థాయి నేతలు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా కమిటీలు వేయకుండా స్వలాభాల కోసం తమవారికే పదవులు కట్టబెడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే పార్టీ బలోపేతం మాట అటుంచితే క్యాడర్ కనిపించదని, ఈ విషయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జోక్యం చేసుకోవాలని సీనియర్ నేతలు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఆది నుంచి గ్రూపు రాజకీయాలు నడుస్తున్న భద్రాచలం టీఆర్‌ఎస్‌లో సంస్థాగత ఎన్నికలు తెచ్చిన కయ్యం మరింత జఠిలమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.