ఖమ్మం

ఓరుగల్లుకుగులాబిదండు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, ఏప్రిల్ 27: ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పరిధిలోని ప్రతి గ్రామం నుంచి ప్రజలు ఓరుగల్లుకు వెళ్ళారు. అధికార టిఆర్‌ఎస్ 16వ వార్షికోత్సవ సభకు బస్సులు, రైళ్ళు, ప్రత్యేక వాహనాలతో పాటు ట్రాక్టర్లు, ఎడ్లబండ్లు, మోటార్ సైకిళ్ళ ద్వారా తరలివెళ్ళారు. రెండు జిల్లాల పరిధిలోని ఏ ప్రధాన రహదారి చూసినా వాహనాలతో కిక్కిరిసిపోయాయి. నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్ రోడ్డు బోసిపోగా వరంగల్ రోడ్డు మాత్రం కిక్కిరిసిపోయింది. డప్పులు, దరువులు, పాటలు, ఆటలతో రోడ్లన్నీ కళావేదికలుగా మారాయి. అనేక చోట్ల ఆయా గ్రామాల ప్రజలు టిఆర్‌ఎస్ సభకు వెళ్తున్న వారికి మజ్జిగా, మంచినీరు అందించారు. రోడ్లన్నీ గులాబిమయంగా మారడంతో పాటు వాహనాలు కూడా గులాబిదండు మాదిరిగా కనిపించాయి. రెండు జిల్లాల పరిధిలోని ప్రతి గ్రామం నుంచి వాహనాలు కదలిరావడం విశేషం. ఉదయం నుంచే ట్రాక్టర్లు, ముందు రోజు నుంచే ఎడ్లబండ్లు ర్యాలీలుగా బయల్దేరి వెళ్ళాయి. గురువారం ఉదయం ట్రాక్టర్ల ర్యాలీని రాష్టమ్రంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే అజయ్‌కుమార్‌లు ప్రారంభించారు. అనంతరం ఆటోల ర్యాలీని ప్రారంభించిన నేతలు ఖమ్మం రైల్వేస్టేషన్ నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రైలును జెండాఊపి ప్రారంభించారు. ఇదే తరహాలో జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి మండలాల వారీగా వాహనాలన్ని ఒకేసారి ఓరుగల్లుకు హోరెత్తించుకుంటూ తరలివెళ్ళాయి.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల, ఎమ్మెల్యే పొంగులేటి, ఎంపి అజయ్‌కుమార్‌లు మాట్లాడుతూ ఆయా గ్రామాల్లోని ప్రజలు పార్టీలకతీతంగా టిఆర్‌ఎస్ సభకు తరలి వెళ్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావించిన తర్వాత ఇంత పెద్దమొత్తంలో ప్రజలు భారీగా తరలివెళ్ళడం ప్రభుత్వ పనితీరును తెలియజేస్తుందన్నారు. టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్థి కార్యక్రమాలు ప్రజలను తమవైపుకు తిప్పాయన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా దేశానికే ఆదర్శంగా ఉండేలా చేపడుతున్న అభివృద్థి సంక్షేమ కార్యక్రమాలు తమను ముందు నిలుపుతున్నాయన్నారు. ఈ వేదిక ద్వారానే మరిన్ని కార్యక్రమాలను ముఖ్యమంత్రి ప్రకటించనున్నారని వెల్లడించారు. స్వచ్ఛందంగా తరలివస్తున్న ప్రజలకు కృతజ్ఞత తెలుపుతూనే వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నారు.

వారసత్వ ఉద్యోగాలపై చర్చలు విఫలం
* మే 25 మరో సమావేశానికి నిర్ణయం
కొత్తగూడెం, ఏప్రిల్ 27: సింగరేణి కాలరీస్‌లో వారసత్వ ఉద్యోగాలపై చర్చించేందుకు సింగరేణి యాజమాన్యం, జాతీయ కార్మిక సంఘాలు గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన చర్చలు విఫలమయ్యాయి. ఐదు జాతీయ కార్మిక సంఘాల ప్రతినిధులు, రీజినల్ లేబర్ కమీషనర్, సింగరేణి డైరెక్టర్ పా, జియం పర్సనల్లు వారసత్వ ఉద్యోగాల ఏర్పాటుపై సుధీర్గంగా చర్చించారు. వారసత్వ ఉద్యోగాలను కోర్టు రద్దుచేయడం భవిష్యత్తులో సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు ఎలా ఏర్పాటు చేయాలనే అంశాలపై చర్చించారు. న్యాయ సలహాదారుల సలహాలు, సూచనలు తీసుకుని మరో సమావేశంలో భవిష్యత్తు ప్రణాళికలను రూపొందించేందుకు మే25 వతేదీన సమావేశం నిర్వహించుకోవాలని నిర్ణయించారు. ఈసమావేశంలో డిప్యూటి చీఫ్ లేబర్ కమీషనర్ శ్యామ్‌సుందర్, సింగరేణి డైరెక్ట పా పవిత్రన్‌కుమార్, జియం పర్సనల్ ఆనందరావు, డెఫ్యూటి జియం అనిల్‌కుమార్, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అద్యక్షుడు వై గట్టయ్య, సింగరేణి కోల్‌మైన్స్ లేబర్ యూనియన్ అధ్యక్షుడు జనక్ ప్రసాద్, సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు రాజిరెడ్డి, హెచ్‌ఎంఎస్ కార్యదర్శి రియాజ్ అహ్మద్, బియంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు చింతల సూర్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

వేయి వసంతాల భక్తాగ్రేసరుడు
భద్రాచలం టౌన్, ఏప్రిల్ 27: అపార వ్యాఖ్యాన రచనా నైపుణ్యం, ద్రవిడ భాషా ప్రావీణ్యం, భక్తి పారవశ్యం, విలక్షణ ప్రతిభ, ఉత్తమ శిష్య లక్షణం, ఉత్తమాచార్య లక్షణం, ఔదార్యం, సమతాభావం, వాద పటిమ, ఆలయ నిర్వహణ సామర్ధ్యం, దీర్ఘ దార్శనికత, కవితా చాతుర్యం వీటి కలబోత భగవత్ రామానుజాచార్యులు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. నిమ్న వర్గాల నుంచి బ్రాహ్మణ వర్గాల వరకు భక్తి తత్వాన్ని ఆయన ప్రబోధించారు. దాదాపు వేయి సంవత్సరాల పూర్వమే కుల రహిత సమాజాన్ని నిర్మించాలని తపించారు. కుల భేదం, లింగ భేదం అనేవి పనికిరావని విస్తృత ప్రచారం చేసింది కూడా ఆయనే. అన్ని యుగాల్లోనూ శ్రీ మహావిష్ణువును శరణాగతితో కొలిచిన భక్తాగ్రేసరుడు రామానుజాచార్యులు. ఆ మహనీయుడు అవతరించి వేయి సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఈ నెల 27 నుంచి మే 3వ తేదీ వరకు సహస్రాబ్ధి ఉత్సవాలు నిర్వహించాలని భద్రాచలం దేవస్థానం సంకల్పించింది. రామానుజాచార్యుల వారి విశిష్ట సేవల దృష్ట్యా సహస్రాబ్ధి ఉత్సవాలతో భద్రాద్రి దేవస్థానం గురువారం నుంచి ఉత్సవాలకు శ్రీకారం చుట్టింది.
ఘనంగా ఉత్సవాలు: భగవత్ రామానుజాచార్యుల సహస్రాబ్ధి ఉత్సవాలను చినజీయర్‌స్వామి ఆదేశాల మేరకు భద్రాచలం దేవస్థానంలో గురువారం ఘనంగా ప్రారంభించారు. ఉదయం 25 కలశాలతో రామానుజాచార్యులకు అభిషేకం చేశారు. సహస్ర నామార్చన చేశారు. అనంతరం సాయంత్రం దివ్య ప్రబంధ పారాయణ, సేవా కాలం, మంగళా శాసనం, శాత్తుమురై తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గోష్టి, ఆలయ చుట్టుసేవ జరిగింది. శ్రీ సీతారామచంద్రస్వామి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నదీ జలాలతో స్వామివారి పాదుకల వద్ద అభిషేకం నిర్వహించారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహ వచనం అనంతరం కంకణధారణ చేశారు. కల్యాణంలో భక్తుల గోత్రనామాలను స్వామికి విన్నవించారు. నిత్య కల్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భద్రాచలం ఆర్డీవో శివనారాయణరెడ్డి దంపతులు ఉత్సవాల్లో పాల్గొని స్వామి దర్శనం చేసుకున్నారు.

రోడ్లన్నీ గులాబి మయం

కొత్తగూడెం, ఏప్రిల్ 27: తెలంగాణ రాష్ట్ర సమితి 16వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని వరంగల్‌లో నిర్వహించే భహిరంగ సభకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నలుమూలలనుండి టి ఆర్ ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. మణుగూరు, కొత్తగూడెం నుండి ప్రత్యే రైలును కార్యకర్తల కోసం ఏర్పాటు చేశారు. వాహనాల ద్వారా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, రైతులు ట్రాక్టర్లద్వారా వరంగల్‌కు తరలి వెళ్ళారు. కొత్తగూడెం శాసన సభ్యుడు జలగం వెంకటరావు నేతృత్వంలో కొత్తగూడెం నియోజకవర్గంలోని పాల్వంచ, కొత్తగూడెం మున్సిపాలిటితోపాటు సుజాతనగర్, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి మండలాలతోపాటు గ్రామీణ ప్రాంతాలనుండి కార్యకర్తలను రైలు మార్గం ద్వారా తరలించారు. ప్రయాణంలో కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అల్పాహారం, మంచినీల్ల ప్యాకెట్లను సరఫరాచేశారు. కొత్తగూడెం రైల్వే స్టేషన్‌లో వరంగల్ వెళ్ళే రైలుకు ఎమ్మెల్యే పచ్చ జెండా ఉపి ప్రారంభించారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ పులి గీత, మండల పరిషత్ అధ్యక్షురాలు బానోత్ కేస్లి, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ మాలోత్ హరిలాల్, టిఆర్‌ఎస్ నాయకులు జివికె మనోహర్, కంచర్ల చంద్రశేఖర్, లక్ష్మీబాయి, సోమరాజు మనోహర్, కాలవ భాస్కర్, రజాక్, గంగాధర్, శివ, చిన్న తదితరులు పాల్గొన్నారు.

వడదెబ్బతో వృద్దురాలు మృతి

అశ్వారావుపేట, ఏప్రిల్ 27: మండల పరిధిలోని బచ్చువారిగూడెంకు గ్రామానికి చెందిన రామినేని శాంతమ్మ(90) అనే వృద్దురాలు గురువారం వడదెబ్బతో మృతి చెందింది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో అస్వస్తకు గురైన శాంతమ్మ ఇంట్లోనే ఒక్కసారిగా కుప్పకూలిపోయి చనిపోయింది. శాంతమ్మకు ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు.

పామాయిల్ ఫ్యాక్టరీ ట్రైల్న్ ప్రారంభం
దమ్మపేట, ఏప్రిల్ 27: మండల పరిధిలోని అప్పారావుపేటలో నూతనంగా నిర్మించిన ఫామాయిల్ ఫ్యాక్టరీని అధికారులు ట్రైల్న్ ప్రారంభించారు. గంటకు 60టన్నుల సామర్ధ్యంతో గానుగాడే ఈ కర్మాగారం తొలివిడుతలో గంటకు 30టన్నుల సామర్థ్యంతో గానుగాడేలా డిజైన్ చేశారు. ఫ్యాక్టరీ సివిల్ కన్‌సెక్షన్ ఈ ఈ రామారావు, ఫ్యాక్టరీ కన్‌సెక్షన్ మేనేజర్ శ్రీకాంత్‌రెడ్డి గురువారం ట్రైల్ రన్‌ను ప్రారంభించారు. ట్రైల్ రన్‌లో సంతృప్తి వ్యక్తం చేసిన అధికారులు శనివారం ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లుచే లాంచనంగా ట్రైల్ రన్‌ను ప్రారంభనించనున్నారు. మే నెలలో ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ ఫ్యాక్టరీని ప్రారంభిస్తారు.

జీయర్ మఠం నుంచి పట్టువస్త్రాలు

భద్రాచలం టౌన్, ఏప్రిల్ 27: భగవత్ రామానుజాచార్యులు సహస్రాబ్ధి ఉత్సవాల సందర్భంగా భద్రాచలం దేవస్థానంలో మే 1వ తేదీన జరిగే తిరుమంజనోత్సవంలో జీయర్ మఠం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. స్థానిక జీయర్ మఠంలో గురువారం తిరుమంజనోత్సవ ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. రామానుజ సేవా సమితి, వికాస తరంగణి ఆధ్వర్యంలో తిరుమంజనోత్సవానికి కావాల్సిన సమస్తం అందజేస్తారని జి.మురళీకృష్ణమాచార్యులు, జి.వెంకటాచార్యులు, పి.కమలకుమారి, చక్రవర్తి తెలిపారు. ఆ రోజు జీయర్ మఠం నుంచి శోభాయాత్ర ప్రారంభమవుతుందని, గిరి ప్రదక్షిణ జరుగుతుందని వారు తెలిపారు. సమావేశంలో శ్రీదేవి, కృష్ణకుమారి, చూడామణి పాల్గొన్నారు.

ఆదివాసీల భూములు లాక్కునే ఆలోచన విరమించుకోవాలి
భద్రాచలం టౌన్, ఏప్రిల్ 27: సీతారామ ప్రాజెక్టు నిర్మాణం కోసం ఆదివాసీల వ్యవసాయ భూములను లాక్కోవాలన్న ప్రభుత్వ ఆలోచనను విరమించుకోవాలని గోండ్వానా సంక్షేమ పరిషత్ డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం భద్రాచలంలోని అంబేద్కర్ సెంటర్ నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి ఆర్డీవో శివనారాయణరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముర్రం వీరభద్రం మాట్లాడుతూ ఆదివాసీలు సాగు చేసుకుంటున్న భూములకు రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వాలు ఆ భూములను గుంజుకోవాలని ఆలోచన చేయడం దారుణమన్నారు. ఈ ప్రయత్నాలను ప్రభుత్వం విరమించుకోకపోతే ఊరుకునేది లేదన్నారు. ఇప్పటికే వేలాది ఎకరాల ఆదివాసీల భూములను గిరిజనేతరులు కబ్జా చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని, ఆ భూములను స్వాధీనం చేసుకోవాల్సి ఉండగా అది మరిచి ఆదివాసీల భూములను లాక్కోవాలని చూడటం అన్యాయమన్నారు. ప్రాజెక్టు పేరుతో ఇప్పటికే ఎంతోమంది నిరాశ్రయులయ్యారని, ఇప్పటికైనా ప్రభుత్వాలు ఆదివాసీల భూములకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. వలస గిరిజనేతరుల ఆధీనంలో ఉన్న వేలాది ఎకరాల భూములను తక్షణ స్వాధీనం చేసుకోవాలన్నారు. హెచ్‌ఆర్‌ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దాగం ఆదినారాయణ మాట్లాడుతూ బంగారు తెలంగాణ అంటే ఆదివాసీల జీవితాలను నాశనం చేయడమా అని ప్రశ్నించారు. ఆదివాసీల సాగులో ఉన్న భూములను సర్వే చేసి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.