ఖమ్మం

రాష్ట్రాన్ని దోచుకు తింటున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మధిర, ఏప్రిల్ 28: ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఆధ్వర్యంలో మంత్రులు రాష్ట్రాన్ని దోచుకుతింటున్నారని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్, మధిర శాసన సభ్యుడు మల్లు భట్టివిక్రమార్క ఆరోపించారు. శుక్రవారం మండల పరిధిలోని కృష్ణాపురం గ్రామంలో రూ.10 లక్షల ఎంఎల్‌ఎ నిధులతో నిర్మించనున్న సిసి రోడ్డు నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆగ్రామ సర్పంచ్ కర్నాటి రామారావు అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ యువకుల బలిదానాలకు చలించిన సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని మిగులు నిధులతో ఏర్పాటు చేస్తే గద్దెనెక్కిన టిఆర్‌ఎస్ పాలకులు సొమ్మునంతటిని దోచుకుంటున్నారన్నారు. సిసి రోడ్డుకు శంకుస్థాపనలు చేస్తే బట్టి జేబులో డబ్బులా అని మంత్రి తుమ్మల మాట్లాడారని కెసిఆర్ అయ్యా, తాత, తుమ్మల అబ్బ సొత్తు కాదని ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన డబ్బులను అభివృద్ధి కోసం వినియోగించాలన్నారు. జాలిముడి నా జీవిత ఆశయం అని చెప్పుకొని అయిదు సంవత్సరాలు శాసన సభ్యుడిగా పనిచేసి ప్రాజెక్టు గురించి పట్టించుకోని వ్యక్తి రంగుమార్చి అడ్డగోలుగా మాడ్లాడితే సహించేది లేదని పరోక్షంగా రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాలపై విమర్శలు చేశారు. మంత్రి తుమ్మల నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని ఏది పడితే అది మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. బహుళార్థ సాధక ప్రాజెక్టుగా భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని జాలిముడి ప్రాజెక్టును నిర్మిస్తే దానిపై విమర్శలు చేస్తున్నారని ఆప్రాజెక్టు ఆవశ్యకత ప్రజలకు తెలుసునన్నారు. జాలిముడి ప్రాజెక్టుపై మధిర, బోనకల్ మండలాల్లో ఏ గ్రామంలోనైనా చర్చకు సిద్ధమన్నారు. కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్టుల ద్వారా వచ్చిన నీళ్ళను దారి మళ్ళించి తమ గొప్పలుగా చెప్పుకుంటున్నారన్నారు. ప్రాజెక్టుల పేరుతో దోపిడీ చేస్తున్నారని, 2019లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక విచారణ జరిపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి వేమిరెడ్డి వెంకట్రావమ్మ, జడ్‌పిటిసి మూడ్ ప్రియాంక, ఎండిటిసి గుజ్జు జ్యోతి కాంగ్రెస్ నాయకులు వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి సూరంశెట్టి కిశోర్, మిరియాల రమణగుప్త, చావా వేణు, రంగా హనుమంతరావు, దారా బాలరాజు, రాయపట్నం సర్పంచ్ బొమ్మకంటి హరిబాబు తదితరులు పాల్గొన్నారు.

భక్తులే ముఖ్యం
* ఆలయాల అభివృద్ధికి టిటిడి తోడ్పాటు
* ఎమ్మెల్యే సండ్ర
ఖమ్మం(గాంధీచౌక్), ఏప్రిల్ 28: తిరుమల తిరుపతి దేవస్థానం లక్ష్యంలో భక్తులే ముఖ్యమని, జిల్లాలో ఆలయాల అభివృద్ధికి టిటిడి తోడ్పాటు ఎప్పుడు ఉంటుందని సత్తుపల్లి ఎమ్మెల్యే, టిటిడి పాలక మండలి సభ్యుడు సండ్ర వెంకటవీరయ్య అన్నారు. శుక్రవారం స్థానిక గోశాలలో ఆయన గోవులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయినప్పటికి టిటిడి ఆధ్వర్యంలో ఇరు రాష్ట్రంలలోని ముఖ్య ఆలయాల అభివృద్ధికి అనేక విధాలుగా తోడ్పాటు అందించారని, ఇక ముందు కూడా అందిస్తారని వెల్లడించారు. తిరుమలలో కూడా భక్తులకు పెద్దపీఠ వేస్తున్నారని టిటిడి పాలక మండలి ఎప్పుడు భక్తుల కోసమే పాటుపడుతుందన్నారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం, కందుకూరు, జమలాపురం, జీళ్ళచెర్వు, నాయకన్‌గూడెంలలోని దేవాలయాల అభివృద్ధి కోసం టిటిడి కోట్ల రూపాయలను ఖర్చు చేసిందన్నారు. అలాగే విగ్రహాల కోసం 75శాతం రాయితీని కల్పించిందన్నారు. దేవాలయాల అభివృద్ధితో పాటు భక్తులకు అనేక వైద్య సౌకర్యాలను కూడా ఉచితంగా టిటిడి కల్పించిందన్నారు. తాను పాలకమండలిలో ఉన్నప్పటి నుండి జిల్లా నుండి సుమారు 60వేల మందికి దర్శన సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. తన పదవికాలం ముగిసినప్పటికి జిల్లా భక్తులకు తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. అలాగే సత్తుపల్లి, గార్ల, నెమలికొణిజర్లలలో గోశాల నిర్మాణానికి 27లక్షల 50వేల రూపాయలతో నిర్మించేందుకు ప్రణాళికలు సిద్దమవుతున్నట్లు తెలిపారు. తనకు పాలక మండలిలో సభ్యుడిగా నియమించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూరపాటి వెంకటేశ్వర్లు, దుద్దుకూరి సుమంత్, తోటకూరి శివయ్య, ఎలూరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.