ఖమ్మం

కెసిఆర్ మదిలో ఏముందో ....!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, ఏప్రిల్ 10: దక్షిణభారతదేశంలోనే ఖ్యాతిగడించిన ఖమ్మం జిల్లా భద్రాద్రి రామయ్య ప్రాంతం అభివృద్ధికి ఆమడదూరంలో ఉంది. విభజన నేపథ్యంలో ఏడు మండలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదలాయించారు. అప్పటి నుంచి భద్రాద్రి అభివృద్ధిపై నీలి నీడలు అలుముకున్నాయి. పోరాటాల ఫలితంగా తెలంగాణ సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం కెసిఆర్ ఏడాది క్రితం రామయ్య పెళ్ళికి హాజరై కొద్ది సేపు గడిపిన అనంతరం మణుగూరు ప్రాంతంలో పవర్‌ప్లాంట్‌కు శంకుస్థాపన చేసి వెళ్ళారు. తెలంగాణ రాష్ట్రంలో పుణ్యక్షేత్రాలను అభివృద్ధి చేసేందుకు నడుం బిగించిన కెసిఆర్ యాదగిరి గుట్టను యాదాద్రిగా మార్పు చేసి 100కోట్ల ప్రత్యేక నిధులతో ప్రపంచంలోనే అత్యంత అందమైన దేవాలయంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్న ఆయన కాస్తూకూస్తో కరీంనగర్ జిల్లాలో వేములవాడ రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఏజన్సీ ప్రాంతాలకు నిలయం కావటంతో పాటు అనేక ప్రత్యేకతలు ఉన్న భద్రాద్రి రామాలయం విషయంలో కెసిఆర్ నేటి వరకు పెదవి విప్పటం లేదు. వివాహా వేడుకలకు హాజరుకానున్న తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ భద్రాద్రి విషయంలో వరాల జల్లులు కురిపిస్తారనే శతకోటి ఆశలతో ఆ ప్రాంత గిరిపుత్రులతో పాటు ఖమ్మం జిల్లా ప్రజానీకం ఎదురుచూస్తోంది. ఇంతకు కెసిఆర్ మదిలో ఏముందోననేది తెలియాల్సి ఉంది.
ప్రధానంగా ఏడు మండలాలను తెలంగాణలో విలీనం చేసే అంశాలతో పాటు దశాబ్ధాల కాలంగా స్థిరపడ్డ గిరిజనేతరులకు ఇబ్బందికరంగా ఉన్న గిరిజన చట్టం సవరణ విషయంలో ముఖ్యమంత్రి ఏమైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా అనే ప్రశ్న ప్రధానంగా తలెత్తుతోంది. భద్రాచలం డివిజన్ అభివృద్ధి అంశంపై ముఖ్యమంత్రి నిర్థిష్టమైన ప్రకటన చేసి తక్షణమే నిధులను విడుదల చేయాలని ఆ ప్రాంతవాసులు కోరుతున్నారు. ఇంతకు భద్రాద్రి రాముడి కల్యాణ వేడుకల్లో పాల్గొని గత ఏడాదిలాగానే వెళ్తారా..? భద్రాద్రి అభివృద్ధిపై ఏమైనా ప్రకటన చేస్తారా అనేది వేచి చూడాల్సిందే మరీ....!