ఖమ్మం

పంట భూములకు భూసార పరీక్షలు తప్పనిసరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కల్లూరు, మే 15: రైతులు తమ పంట భూముల్లో తప్పని సరిగా భూసార పరీక్షల చేయించుకోవాలని డిసిసిబి చైర్మెన్ మువ్వా విజయ్‌బాబు పేర్కొన్నారు. సోమవారం మండలపరిధిలోని చండ్రుపట్ల గ్రామంలో నిర్వహించిన మనతెలంగాణ - మనవ్యవసాయం కార్యక్రమానికి హాజరైన మువ్వా రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ రైతులు పంట భూములకు భూసార పరీక్షలు నిర్వహించుకునేందుకు వీలుగా ప్రతి 5వేల ఎకరాలకు ఒక ఎఇఓతో పాటు భూసార పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. రైతులకు పంటల సాగుపై పరికరాలు అందించేందుకు 50 శాతం సబ్సిడీలపై కావాల్సిన వాటిని కొనుగోలు చేసుకోవచ్చన్నారు. పంట సాగుల్లో రైతులకు అందుబాటులో ఉండేందుకు ఏఇఓలకు వడ్డీ లేకుండా మోటార్ సైకిళ్లను పంపిణి చేయనున్నట్లు ఆయన తెలిపారు. రైతులకు ఎకరాకు రూ. లక్ష రుణ సదుపాయాన్ని కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయన్నారు. రైతు సంక్షేమం కోసం పాటు పడే కెసిఆర్ ప్రభుత్వం రైతు ఏది కోరుకుంటే అది ఇచ్చేందుకు సిద్ధంగా ఉందన్నారు.

గొర్రెల యూనిట్ల ఎంపిక ప్రక్రియ ప్రారంభం
ఎర్రుపాలెం, మే 15: మండల పరిధిలో అన్ని గ్రామాల్లో ఓంటరి మహిళల పెన్షన్, గొర్రెల యూనిట్ల లబ్దిదారుల ఎంపిక ప్రక్రియను తాహశీల్దార్ కె మాదవి, ఎంపిడిఓ డి శ్రీనివాసరావు, పశువైద్యాధికారి అర్చనల ఆధ్వర్యంలో సోమవారం గ్రామపంచాయితీ కార్యాలయాలలో గ్రామ సర్పంచ్‌ల అధ్యక్షతన నిర్వహించారు. గుంటుపల్లి, గోపవరం, భీమవరం, అయ్యవారిగూడెం, మామునూరు, చొప్పకట్లపాలెం, బనిగండ్లపాడు గ్రామాలలో ఒంటరి మహిళల నుండి దరఖాస్థులను స్వీకరించారు. గొర్రెల కాపరుల సంఘం సభ్యులుగా చేరిన వారిని లాటరీ పద్దతి ద్వారా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా తహశీల్ధార్ మాదవి మాట్లాడుతూ మండలంలో ఒంటరి మహిళలు 286మంది ఉన్నారని తెలిపారు. ఆరుగ్రామాల్లో 88మందిని ఎంపిక చేసినట్లు వెల్లడించారు. అలాగే 50శాతం గోర్రెల కాపరుల లబ్దిదారులను ఎంపిక చేసినట్లు తెలిపారు. 18వ తేది వరకు అన్ని గ్రామ పంచాయితీలలో ఒంటరి మహిళల దరఖాస్తులను స్వీకరించి పరిశీలించనున్నట్లు తెలిపారు. 23వ తేది నుండి ఎంపికైన జాబితాను అన్‌లైన్ చేయనున్నట్లు తెలిపారు.