ఖమ్మం

వృత్తిదారులకు జీవనోపాధి కల్పించడమే ప్రభుత్వ ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(ఖిల్లా), మే 15: వృత్తిదారులను ఆదుకునేందుకు టిఆర్‌ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. రఘునాధపాలెం మండలం ఈర్లపుడి గ్రామపంచాయితీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన గ్రామసభ ద్వారా గొల్ల, కురుమ, యాదవులకు గొర్రెల పధకం లబ్దిదారులను లాటరీ ద్వారా ఎమ్మెల్యే పువ్వాడ ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గొల్ల, యాదవ, కురుమ సంఘాలకు సబ్సీడిపై గొర్రెలను ఇస్తామని చెప్పిన ప్రభుత్వ హామీని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నట్లు చెప్పారు. దానికి అనుగుణంగా ప్రతి సంఘానికి 20గొర్రెలు, 1పొట్టేలును అందిస్తున్నట్లు వెల్లడించారు. ఒక్కోక్క సంఘానికి 1,25,000రూపాయలను ఇవ్వనున్నామని అందులో ప్రభుత్వం 93750రూపాయలను సబ్సిడి ఇస్తున్నట్లు తెలిపారు. లబ్దిపొందిన కులవృత్తుల వారు ఆర్థికంగా స్థిరపడే అవకాశం కలుగుతుందన్నారు. ఇప్పటికే ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తుందన్నారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు లబ్దిపొందుతున్నారన్నారు. ఇప్పటికే మత్స్యకారులకు కోట్లాది రూపాయలను వెచ్చించి చెరువులలో చేపలు పెంచేందుకు చేపపిల్లలను ఉచితంగా పంపిణీ చేసిందన్నారు. దీని ద్వారా మత్స్యకారులు ఉపాధిపొందే అవకాశం ఉందన్నారు. అనంతరం మరుగుదొడ్లు నిర్మించుకున్న లబ్దిదారులకు 12వేల రూపాయల చెక్కును అందజేశారు. కార్యక్రమంలో పశువైద్య శాఖ ఎడి కాల నరేంద్రజెన్, తహశీల్దార్ తిరుమలాచారి, ఎంపిడిఒ ఏలూరి శ్రీనివాసరావు, పశువైద్యశాఖాధికారి కిషన్, జడ్పిటిసి వీరునాయక్, ఎంపిపి మాలోత్ శాంత పాల్గొన్నారు.

క్రమం తప్పకుండా విధులకు హాజరు కావాలి

భద్రాచలం టౌన్, మే 15: ఐటీడీఏ కార్యాలయ సిబ్బంది క్రమం తప్పకుండా విధులకు హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారిని జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు ఆదేశించారు. ఐటీడీఏ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి గిరిజన దర్బార్‌కు కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు సమస్యల పరిష్కారం కోసం అందజేసిన దరఖాస్తులను తక్షణ చర్యల నిమిత్తం సంబంధిత శాఖల అధికారులకు సిఫారసు చేస్తున్నట్లు తెలిపారు. అధికారులు దరఖాస్తులను పరిశీలించి ఫిర్యాదుదారునికి లిఖితపూర్వక సమాచారం తెలియజేయాలని సూచించారు. జూన్ 2న రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహిస్తున్నందున యూనిట్ అధికారులు శాఖాపరంగా సాధించిన ప్రగతి నివేదికలను ఈనెల 20వ తేదీ నాటికి ఐటీడీఏలోని సమాచారశాఖ కార్యాలయంలో అందజేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాల నుంచి వచ్చిన గిరిజనుల నుంచి కలెక్టర్ దరఖాస్తులు స్వీకరించారు. దర్బార్‌లో జాయింట్ కలెక్టర్ ఎం.రాంకిషన్, డీఆర్‌డీఏ పీడీ జగత్‌కుమార్‌రెడ్డి, ఎస్డీసీ వెంకటేశ్వర్లు, ఆర్డీవో శివనారాయణరెడ్డి, ఏపీవో జనరల్ కె.్భమ్‌రావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ దర్బార్‌కు రావడంతో ప్రజలు తమ సమస్యలను విన్నవించుకునేందుకు తరలివచ్చారు.