ఖమ్మం

హైదరాబాద్ ధర్నాలో జిల్లా నేతలకు గాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, మే 15: ఉద్రిక్తతకు దారితీసిన హైదరాబాద్ ధర్నాలో జిల్లాకు చెందిన అనేక మంది పాల్గొనగా పలువురికి గాయాలయ్యాయి. సిపిఎం, సిపిఐ జిల్లా కార్యదర్శులు పొన్నం వెంకటేశ్వరరావు, బాగం హేమంతరావు, సిపిఐ(ఎంఎల్)న్యూడెమోక్రసి రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు నేతృత్వంలో ఆయా పార్టీల నేతలు, కార్యకర్తలు సోమవారం హైదరాబాద్‌లో జరిగిన ధర్నాకు భారీగా తరలివెళ్ళారు. ఇందిరాపార్కు వద్ద ఉన్న ధర్నాచౌక్‌ను తరలించవద్దంటూ జెఏసి, వామపక్షాలు కలిసి చేసిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. ఈ క్రమంలో జిల్లాకు చెందిన ప్రదీప్, శ్రీనివాస్, పుల్లయ్య, రమేష్ తదితరులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ సందర్భంగా రంగారావు, హేమంతరావు, వెంకటేశ్వరరావులు మాట్లాడుతూ ప్రభుత్వం దురుద్దేశంతోనే ధర్నాచౌక్‌ను తరలిస్తున్నదని, ఉద్యమం ద్వారా అధికారంలోకి వచ్చిన కెసిఆర్ అదే ఉద్యమాలను అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. గతంలో చంద్రబాబు అనుసరించిన విధానాలనే కెసిఆర్ కూడా అనుసరిస్తున్నారన్నారు. ప్రజలను, ప్రజా ఉద్యమాలను అణగతొక్కాలని చూస్తే మరింత ఉదృతమవుతాయని గుర్తుంచుకోవాలన్నారు. తెలంగాణ కోసం ఆందోళనలు చేస్తూ ఖమ్మం జిల్లాకు వస్తే అప్పటి ప్రభుత్వంపై పోరాడి ఆయనను భద్రంగా చూసుకున్నామని గుర్తుచేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజల హక్కులను కాలరాసేందుకు ప్రయత్నించిన వారు చరిత్రలో కలిసిపోయారని, కెసిఆర్ పరిస్థితి కూడా అదే విధంగా ఉంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు, స్థానికులతో కలిసి పార్టీల నేతలపై దాడులు చేయించారని, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. వామపక్ష పార్టీల కార్యకర్తలపై దాడిచేసి గాయపర్చిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అవసరమైతే ప్రభుత్వ విధానాలను ప్రజల్లో ఎండగట్టేందుకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ప్రతి ఇంటికి మంచినీరిస్తాం
ఖమ్మం(ఖిల్లా), మే 15: ఇంటింటికి తాగునీరు ఇచ్చితీరుతామని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. సోమవారం ఆయన క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మిషన్‌భగిరధ ద్వారా ఇంటింటికి తాగునీరు అందించాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కెసిర్ అన్ని చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. 230కోట్లతో జీళ్ళచెరువులో నిర్మాణం పూర్తి చేసుకున్న మాస్టర్ బ్యాలెన్సీంగ్ రిజర్వాయర్ ద్వారా ఖమ్మం కార్పొరేషన్‌లోని అన్ని డివిజన్లకు ప్రతిరోజు నీరు అందిస్తామన్నారు. అందుకు సంబంధించి అసంపూర్తిగా ఉన్న పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. కార్పొరేషన్ పరిధిలో ఉన్న 14ఓవర్‌హెడ్ ట్యాంక్‌ల ద్వారా తాగునీరు అందించేందుకు కార్యచరణ పకడ్బందిగా అమలు జరపాలన్నారు. జీళ్ళచెరువు రిజర్వాయర్ నుండి మొత్తం 350కిలోమీటర్ల మేర పైపులైన్ పనులు అయ్యాయని, ఇప్పటికే రిజర్వాయర్ ప్రధాన పెప్‌లైన్ నుండి కొన్ని ట్యాంక్‌లకు అనుసంధానం చేసినట్లు తెలిపారు. విలీన గ్రామపంచాయితీల్లోను అదేస్థాయిలో నీటి సరఫరా పెప్‌లైన్ పనులను పర్యవేక్షించాలన్నారు. ముఖ్యంగా ఇరుకు ప్రాంతాల్లో ఎగుడుదిగుడు ఉన్న ప్రాంతాల్లో పైప్‌లైన్‌ను సమాంతరంగా వచ్చే విధంగా పనులు చేపట్టాలన్నారు. ఈ ప్రాజెక్ట్‌ను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ ప్రారంభించనున్నారని అందుకు వాటర్‌గ్రిడ్ పెలాన్‌ను సిద్దం చేయాలన్నారు. సమీక్షా సమావేశంలో వాటర్‌గ్రిడ్ డిఈ మాణిక్యరాజు, పబ్లిక్‌హెల్త్ డిఈ రంజిత్, ఎల్‌అండ్‌టి కంపెనీ ప్రాజెక్ట్ మేనేజర్‌లు మురుగన్, సందీప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.