ఖమ్మం

కార్మికుల సంక్షేమమే ముఖ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్, జూన్ 27: ఐటీసీ పీఎస్‌పీడీ కర్మాగారంలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలకు ముందు తమ బలాబలాను చూపిస్తున్న ఐఎన్‌టీయూసీ, టీఎన్‌టీయూసీ నేతలు కార్మికుల సంక్షేమాన్ని ఏనాడైనా పట్టించుకున్నారా అని సిఐటియూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.సాయిబాబు ప్రశ్నించారు. అపవిత్ర పొత్తులతో ఐటీసీలో కలుషిత రాజకీయాలను జొప్పించే ప్రయత్నం చేస్తున్న ఆ రెండు యూనియన్లకు కార్మికులే బుద్ధి చెప్పాలని, మెరుగైన వేతన ఒప్పందం అమలు జరగాలంటే ఈసారి సిఐటియూకు అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. భద్రాచలం సిపిఎం కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన ఐఎన్‌టీయూసి, టీఎన్‌టీయూసీ నేతల వైఖరిపై మండిపడ్డారు. ఆ రెండు సంఘాల్లో ఉన్నవి ఒకే అనుబంధ సంఘాలని, అటువంటప్పుడు వారు ఎవరికి వారు పోటీకి ఎందుకు దిగారో కూడా అర్థం కావడం లేదన్నారు. కార్మిక సంక్షేమానికి పెద్దపీట వేయగలమని బలంగా చెబుతున్నామని, అందుకే ఈసారి సిఐటియూ ఐటీసీ ఎన్నికల్లో స్వతంత్య్రంగా పోటీ చేస్తుందన్నారు. గతంలో గెలిచిన ఐఎన్‌టీయూసీ, టీఎన్‌టీయూసీ ఇనే్నళ్ల కాలంలో కార్మికులకు చేసిందేమీ లేదని, వారు నిజంగా కార్మిక సంక్షేమాన్ని పట్టించుకోని ఉంటే ఈరోజు కార్మికులు ప్రత్యామ్నయం వైపు చూసే పరిస్థితి కల్పించేవారు కాదన్నారు. మెరుగైన వేతన ఒప్పందం అంటూ పాత పాలసీనే చెబుతున్నారని, ఇనే్నళ్లలో ఎందుకు మెరుగైన వేతన ఒప్పందం చేయలేకపోయారని ప్రశ్నించారు. ఐటీసీ యాజమాన్యంతో లాలూచీ పడి కార్మిక సంక్షేమాన్ని పట్టించుకొని ఆ రెండు యూనియన్లకు కార్మికుల వద్దకు వెళ్లి ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. కర్మాగారం ప్రారంభించిన నాడు ఎంత మంది కార్మికులు ఉన్నారో ప్రస్తుతం అంతేమంది కార్మికులు ఉన్నారని, ఐటీసీ యాజమాన్యం ఈ రెండు సంఘాలతో కుమ్మక్కై మానవ వనరుల పెంపును విస్మరించిందన్నారు. ఏటేటా ఉత్పత్తి, ఉత్పాదక పెరుగుతున్నా కార్మికుల సంఖ్యలో ఎటువంటి మార్పు లేదని, కాంట్రాక్టు కార్మికులతో కాలం వెళ్లదీస్తున్నారని, దీనివల్ల ఈ ప్రాంత నిరుద్యోగులకు ఎటువంటి అవకాశాలు లేకుండా పోయాయన్నారు. గడచిన 11 వేతన ఒప్పందాల్లో కార్మికుల నోట్లో మట్టి కొట్టారని, తాజాగా మెరుగైన వేతన ఒప్పందం కుదుర్చుతామని హామీనిస్తూ అపవిత్ర పొత్తులతో కార్మికుల ముందుకొస్తున్నారని దుయ్యబట్టారు. ఇది చేస్తాం, అది చేస్తాం అని చెబుతున్న టీఎన్‌టీయూసీ, ఐఎన్‌టీయూసీ వర్గాలు ఇనే్నళ్లు ఏమి ఒరగబెట్టాయో కార్మికులకు స్పష్టం చేయాలన్నారు. ఐటీసీలో కార్మిక హక్కులు, సంక్షేమాన్ని గురించి ప్రశ్నించే తీరును ఈ రెండు యూనియన్లు యాజమాన్యంతో లాలూచీ పెట్టుకొని విస్మరించాయన్నారు. ఇప్పటికైనా కర్మాగారంలో కలుషిత రాజకీయాలను మానుకోవాలని, కార్మికుల సంక్షేమమే ముఖ్యంగా ఎవరైనా పని చేయాలన్నారు. సిఐటియూకు అవకాశం ఇస్తే మునుపెన్నడూ లేనివిధంగా మెరుగైన వేతన ఒప్పందం కుదుర్చుతామని, కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేసేలా యాజమాన్యంతో చూస్తామన్నారు. నక్షత్రం గుర్తుకు ఓటువేసి సిఐటియూ అభ్యర్థికి కార్మికులు మద్దతు ఇవ్వాలని కోరారు. సమావేశంలో సిఐటియూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జె.మల్లిఖార్జున్, రాష్ట్ర కార్యదర్శి మధు, జిల్లా కార్యదర్శి అన్నవరపు సత్యనారాయణ, జిల్లా అధ్యక్షుడు ఏజే రమేష్, బి.అప్పాచారి, బ్రహ్మాచారి, అజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.