ఖమ్మం

సింగరేణిలో ఐదేళ్లలో 25 నూతన గనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం: దేశంలో విద్యుత్ ప్లాంట్లకు అవసరమైన బొగ్గును అందించేందుకు రానున్న 5సంవత్సరాలలో సింగరేణిలో 25నూతన ప్రాజెక్టులను ప్రారంభించనున్నట్లు సింగరేణి కాలరీస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ్ధర్ తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా మంగళవారం స్థానిక ప్రకాశం స్టేడియం గ్రౌండ్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. సింగరేణి సెక్యూరిటీ సిబ్బంది గౌరవ వందనాన్ని స్వీకరించిన అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా సింగరేణి ఆధ్వర్యంలో 100 మెగావాట్ల సోలార్‌ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సింగరేణి బొగ్గు ఉత్పత్తి రంగంతో పాటు విద్యుదుత్పత్తి రంగంలో కీలకపాత్ర పోషిస్తుందన్నారు. మంచిర్యాల జిల్లా జైపూర్‌లో సింగరేణి ధర్మల్ విద్యుత్‌కేంద్రం ద్వారా 1200మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నట్లు ప్రకటించారు. సింగరేణి యాజమాన్యం ఈఏడాది 660లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. బంగారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో సింగరేణి కీలకపాత్ర పోషిస్తోందన్నారు. 2017-2018 ఆర్థిక సంవత్సరంలో నూతనంగా 5కొత్తగనులలో బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించడం జరుగుతుందన్నారు. మణుగూరు ఓపెన్‌కాస్టు, మందమర్రి కెకెఓసి, కాసిపేట-2 ఓసి, భూగర్భగని, కొత్తగూడెం ఏరియాలోని జెవిఆర్‌ఓసి-2, భూపాలపల్లిలోని కెటికె ఓసి-2 గనులలో బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించడం జరుగుతుందన్నారు. సింగరేణి కార్మికుల సంక్షేమం, ఆరోగ్యం, రక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. సింగరేణిలో డిపెండెంట్ ఎంప్లాయిమెంట్ సమస్యను పరిష్కరించేందుకు కార్మికులందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సింగరేణిలో గడిచిన రెండేళ్ళలో 5500 నూతన ఉద్యోగాలను కల్పించడం జరిగిందన్నారు. 665ఎస్‌టి బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ను జారీ చేశామని తెలిపారు. సింగరేణి సమీప గ్రామాల అభివృద్ధి కోసం సామాజిక బాధ్యతగా 20కోట్ల రూపాయాలను కేటాయించి వౌలిక సదుపాయాలను ఆగ్రామాలలో కల్పిస్తుందన్నారు. అనంతరం ఉత్తమ సింగరేణి కార్మికులను సన్మానించారు. అనంతరం పాఠశాలల విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈకార్యక్రమంలో సింగరేణి డైరెక్టర్ (పా) పవిత్రన్‌కుమార్, డైరెక్టర్లు శంకర్, చంద్రశేఖర్, భాస్కర్, జనరల్ మేనేజర్లు ఆనందరావు, మసూద్ ముజాహిద్, గుర్తింపు కార్మికసంఘం నాయకులు కెంగెర్ల మల్లయ్య, ఆకునూరి కనకరాజు తదితరులు పాల్గొన్నారు.