ఖమ్మం

పండుగ ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, ఆగస్టు 22: గణేష్ నవరాత్రి ఉత్సవాలను శాంతియుత సహృద్భావ వాతావరణంలో జరుపుకోవాలని ఖమ్మం పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ అన్నారు. మంగళవారం కమిషనరేట్ పరిధిలోని పోలీస్ అధికారులతో గణేష్ నవరాత్రి ఉత్సావాల నిర్వహణ, బక్రిద్ పండుగల శాంతిభద్రతల అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 25నుండి తొమ్మిది రోజుల పాటు గణేష్ నవరాత్రుల ఉత్సావాలు జరుపుకొనున్న నేపధ్యంలో పోలీస్ బందోబస్తు, ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. సుమారుగా 3,500వరకు వినాయక విగ్రహాల ఏర్పాటు చేయానున్నారనే అంచానతో ప్రతి గణేష్ మండపం వద్ద పోలీస్ పాయింట్ బుక్ ఏర్పాటు చేసి పోలీస్ సిబ్బంది పకడ్బందిగా విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని అదేశించారు. అలాగే ఆయా ప్రాంతాల ఎస్‌హెచ్‌వోలు మండపాలను విధిగా సందర్శించాలన్నారు. మండపాల వద్ద ప్రతిరోజు ఆర్గనైజింగ్ కమిటీ నుంచి ఒకరు బాధ్యతగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. మండపాల సమీపంలో పేకట, అసభ్యకర డ్యాన్స్‌లు వంటి అసాంఘీక కార్యక్రమాలు జరగకుండా చూడాలన్నారు. గణేష్ విగ్రహల ఏర్పాటులో సంబందిత శాఖల అనుమతి, నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని సూచించారు. వినాయక నిమజ్జనం చివరి రోజు లైటింగ్, బారిగేట్స్, ఫస్ట్‌ఎయిడ్, పోలీస్ హెల్ప్‌లైన్ సెంటర్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. గణపతి నవరాత్రి ఉత్సవ కమిటీ, శాంతిపరిరక్షణ కమిటీతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ సలహాలు, సూచనలను పరిగణలోకి తీసుకొని గణేష్ నవరాత్రుల రాబోయే బక్రిద్ పండుగలను ప్రశాంత వాతావరణంలో జరిగేలా సహకరించాలన్నారు. ఈ సమావేశంలో ఎసిపిలు ఇస్మాయిల్, సురేష్‌కుమార్, గణేష్, రాజేష్, శ్రీ్ధర్‌రెడ్డి, సిఎఆర్ ఏసిపి వెంకటేశ్వర్లు, సిఐలు పాల్గొన్నారు.

మట్టి విగ్రహాలతోనే ఉత్సవాలు జరపాలి
* ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్
ఖమ్మం(ఖిల్లా), ఆగస్టు 22: గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా, వినాయకచవితిని పురస్కరించుకొని మండపాలలో మట్టి గణేష్ విగ్రహాలనే పూజించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. మంగళవారం స్థానిక 23వ డివిజన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన మట్లాడుతూ నగర ప్రజలు గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలని, ఈ ఉత్సవాలలో తప్పనిసరిగా భక్తులు మట్టి విగ్రహాలతో పూజలు నిర్వహించాలన్నారు. మట్టి విగ్రహాల వలన పర్యావరణాన్ని కాపాడిన వారౌతారన్నారు. మట్టి నిమజ్జనంతో నీరు కూడా కలుషితం కాకుండా ఉంటుందని పేర్కొన్నారు. ఈ విషయంలో ఉత్సవ కమిటీ నిర్వహకులు సరైన నిర్ణయం తీసుకొని తప్పనిసరిగా మట్టి విగ్రహాలతోనే ఉత్సవాలు నిర్వహించాలని సూచించారు. ప్లాస్టఆఫ్‌పారిస్ వల్ల ముప్పు వాటిల్లుందన్నారు. నిమజ్జనం ద్వారా దాదాపు నెల రోజుల పాటు నీరు కలుషితమై తాగేందుకు వీలులేకుండా ఉంటుందన్నారు. ప్లాస్టఆఫ్‌పారీస్‌తో చేసిన విగ్రహాల నిమజ్జనం వల్ల కలుషితం అయిన నీరు వాడకంతో ప్రజలకు అనేక ఆనారోగ్యాల భారిన పడతారన్నారు. దీనిపై ప్రజలకు విస్తృతంగా ప్రచారం చేసి ఉత్సవ కమిటీలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటి మేయర్ బత్తుల మురళీ, కార్పొరేటర్లు శశికళ, నాగరాజు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.