ఖమ్మం

బతుకమ్మ ఉత్సవాలను ప్రారంభించిన విద్యార్థులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేలకొండపల్లి, సెప్టెంబర్ 19 : తెలంగాణ సంస్కృతి సంప్రదాయ పండుగ బతుకమ్మ ఉత్సవాలను విద్యార్థులు ప్రారంభించారు. మంగళవారం మండలంలోని వివిద ప్రభుత్వ, ప్రైయివేట్ పాఠశాల నందు విద్యారర్థులు బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. అప్పలనర్సింహపురం గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు ఎంపిపి నందిగామ కవితరాణి విద్యార్థులతో కలసి బతుకమ్మ ఉత్సవాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మనే్న నగేష్, జానికిరాములు, యోనిక జానకిరామయ్య, శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. అలాగే నేలకొండపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు ప్రధానోపాధ్యాయులు లక్ష్మి విద్యార్థులతో బతుకమ్మ సంబరాలను నిర్వహించారు. ఈ సందర్బంగా విద్యార్థులు బతుకమ్మ పాటలతో, ఆటలతో అలరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మూర్తి, కోటేశ్వరరావు, శ్యామల, సునిత, సుజాత, శశికళ, అరుణశ్రీ, రేవతి తదితరులు పాల్గొన్నారు.

ఐలయ్య రచనకు నిరసనగా నేడు నగరం బంద్
ఖమ్మం(మామిళ్ళగూడెం), సెప్టెంబర్ 19: సామాజిక స్మగ్లర్లు కోమటోళ్ళు అంటూ ప్రొఫెసర్ ఐలయ్య రచనకు నిరసనగా బుధవారం ఖమ్మం నగరంలో బంద్‌ను పాటిస్తున్నట్లు ఆర్యవైశ్యుల సంఘం నాయకులు చెరుకూరి కృష్ణమూర్తి తెలిపారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాము పిలుపుఇచ్చిన బంద్‌కు సిపిఎం మినహ అన్ని రాజకీయ పక్షాలు మద్దతు తెలిపినట్లు ఆయన వెల్లడించారు. ప్రజలు, వ్యాపారులు బంద్‌కు సహకరించాలని కోరారు. విలేఖరుల సమావేశంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు ఉదయ్‌ప్రతాప్, కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ తిలక్, టిఆర్‌ఎస్ నాయకులు డోకుపర్తి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

నీటితొట్టెలో పడి బాలుడు మృతి
చింతకాని, సెప్టెంబర్ 19: నీటితొట్టెలో పడి బాలుడు మృతిచెందిన సంఘటన మండల పరిధిలోని నాగిలిగొండ గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన పంది నరేష్, సరితల కుమారుడు పంది నాగచైతన్య(2) ఆడుకుంటూ ఇంటి పక్కన గల కనగండి ప్రవీణ్ ఇంట్లోని నీటితొట్టెలో పడి మృతిచెందాడు. పొలం పనులకు వెళ్ళిన ప్రవీణ్ ఇంటికి వచ్చి నీటితొట్టెలో చూసేసరికి నాగచైతన్య మృతిచెంది ఉన్నాడు. నాగచైతన్య తల్లి ఇంట్లో ఉండగానే ఘోర ఘటన చోటు చేసుకుంది. మృతిచెందిన చిన్నారిని చూసి తల్లిదండ్రులు బోరున విలపించారు. బాలుడు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రాష్టస్థ్రాయి క్రీడా పోటీలకు బనిగండ్లపాడు విద్యార్థుల ఎంపిక
ఎర్రుపాలెం, సెప్టెంబర్ 19: రాష్టస్థ్రాయి క్రీడాపోటీలకు మండల పరిధిలోని బనిగండ్లపాడు జూనియర్ కాలేజి విద్యార్థులు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ ఎం రమణారెడ్డి మంగళవారం తెలిపారు. ఇటీవల భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల స్థాయిలో జరిగిన ఖోఖో, కబాడ్డి పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరచడంతో రాష్టస్థ్రాయి పోటీలకు ఎంపికైయారని తెలిపారు. బాలికల ఖోఖో విభాగంలో వెన్నపూస లక్ష్మి, సత్యప్రియ, బాలుర ఖోఖో పోటీలలో అభిలాష్, బాస్కరరెడ్డి, కబాడ్డి పోటీలలో హరికృష్ణలు, అండర్ 19విభాగంలో ఈ నెల 26తేదిన రంగారెడ్డి జిల్లాలలో జరిగే రాష్టస్థ్రాయి పోటీలలో ఆడనున్నారని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను ప్రిన్సిపాల్, అద్యాపకులు అభినందించారు.