ఖమ్మం

మహిళలకు బతుకమ్మ సారె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(ఖిల్లా), సెప్టెంబర్ 19: ఆడపడుచులకు బతుకమ్మ పండుగను సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చీరలను అందిస్తూ అరుదైన గౌరవం కల్పిస్తోందని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. బతుకమ్మ వేడుకలను పురస్కరించుకొని మహిళలందరికి ఖమ్మం నగరంలో 73,434మంది లబ్ధిదారులకు చీరలను నగరమేయర్ పాపాలాల్‌తో కలసి పంపిణీ చేశారు. మంగళవారం 58సెంటర్లలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ల ద్వారా మహిళలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి మహిళ కొత్తబట్టలు ధరించాలనే ముఖ్యమంత్రి ఆలోచన హర్షనీయమన్నారు. కొన్ని దశాబ్దాలుగా ఎవరికి రాని ఆలోచన కెసిఆర్‌కు రావడం వెంటనే ఆచరణలోకి తీసురావడం మంచి నిర్ణయమన్నారు. తెల్లకార్డు కలిగిన ప్రతి మహిళను లబ్దిదారులుగా గుర్తించి చీరలను పంపిణీ చేసినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో డిప్యూటి మేయర్ బి మురళీ, కార్పొరేషన్ కమిషనర్ బొనగిరి శ్రీనివాస్, తహశీల్ధార్ శ్రీలత, జి కృష్ణ, ఇంచార్జ్ ఎంఇ రంజిత్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ప్రారంభమైన బతుకమ్మ సంబురాలు
వైరా, సెప్టెంబర్ 19: తెలంగాణ సంస్కృతికి నిలువుటద్దం అయిన బతుకమ్మ సంబరాలను స్థానిక టిఎస్‌ఆర్‌ఎస్ గురుకుల బాలికల పాఠశాలలో ఘనంగా ప్రారంభించారు. మంగళవారం పాఠశాల నుండి విద్యార్థులను తమఇండ్లకు పంపిస్తున్నందున బతుకమ్మ ఆట - పాటను నిర్వహించారు. ఈసందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ నాగభూషణం, ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ బత్తుల సుజాత మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆట - పాటకు నిదర్శమైన బతుకమ్మ సంబురాలు ఘనంగా జరుపుకుంటున్నామని అన్నారు. దసరా ఉత్సవాలను అందరూ జరుపుకోవాలని కోరారు. స్థానిక ప్రభుత్వ ప్రయివేటు పాఠశాలలోకూడా బతుకమ్మ సంబరాలను ప్రారంభించారు. ఈసందర్భంగా న్యూలిటిల్‌ప్లవర్స్ పాఠశాలలో వైరా డిఎస్పీ శ్రీ్ధర్‌రెడ్డి ప్రారంభించారు. మధువిద్యాలయంలో కూడా ఎంతో వైభవోపేతంగా బతుకమ్మ సంబరాలను పాఠశాల ప్రిన్సిపాల్ మల్లెంపాటి వీరభద్రం ప్రారంభించారు. స్థానిక ఠాగూర్, వాణివివేకానంద పాఠశాలల్లో కూడా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆయా పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.

బతుకమ్మ ఆట - పాటలు ఘనంగా నిర్వహించాలి
వైరా, సెప్టెంబర్ 19: తెలంగాణ బతుకమ్మ ఆట - పాటల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని జడ్పిటీసి సభ్యురాలు బొర్రా ఉమాదేవి అన్నారు. మంగళవారం స్థానిక పాతబస్టాండ్ సమీపంలో మహాబతుకమ్మ గన్నీస్ రికార్డు ఆన్‌లైన్ కార్యమ్రాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ బతుకమ్మ అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటేనే బతుకమ్మ అని ఆమె అన్నారు. తెలంగాణ సంస్కృతిని ప్రపంచమంతా తెలిసేలా బతుకమ్మ పండుగ నిర్వహించాలని అన్నారు. అనంతరం బతుకమ్మ పాటల పుస్తకాలను ఆవిష్కరించారు. ఈకార్యక్రమంలో ఎంపిపి బొంతు సమత, సర్పంచ్ బాణోతు వాలీ, వైఎస్ ఎంపిపి తన్నీరు జ్యోతి, జాగృతి జిల్లా బాధ్యులు గట్టు కరుణ, అరవింద్‌రెడ్డి, వీరభద్రం, జాగృతి మండల బాధ్యులు వెంకటేశ్వరావు, రమేష్, ఉత్తేజ్ తదితరులు పాల్గొన్నారు.