ఖమ్మం

కెటిపిఎస్ 6వ దశ స్టేషన్ యూనిట్ ట్రాన్స్‌ఫార్మర్‌లో చెలరేగిన మంటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాల్వంచ, సెప్టెంబర్ 19: స్థానిక కెటిపిఎస్ 6వ దశ కర్మాగారంలోని స్టేషన్ యూనిట్ ట్రాన్స్‌ఫార్మర్‌లో మంగళవారం అగ్నిప్రమాదం సంభవించింది. ఇందుకు సంబంధించిన వివరాలిలావున్నాయి. కర్మాగారంలోని జనరేషన్ ట్రాన్స్‌ఫార్మర్ ప్రక్కనే ఉన్న స్టేషన్ యూనిట్ ట్రాన్స్‌ఫార్మర్‌లో ఉదయం యధావిధిగా ఉద్యోగులు, కార్మికులు విధులు నిర్వహిస్తుండగానే ఒక్కసారిగి స్టేషన్ యూనిట్‌లో మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని గమనించిన ఉద్యోగులు, కార్మికులు సంబంధిత అధికారులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించటంతో సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు, 3 ఫైరింజన్ల ద్వారా మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అధికారులు, ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి రాకముందే స్టేషన్ యూనిట్ ట్రాన్స్‌ఫార్మర్‌లో ఉన్న మల్టీఫైర్ సిస్టమ్స్ ఒపెన్ కావటంతో భారీ అగ్నిప్రమాదం తప్పినట్లైంది. మంటలు చెలరేగిన స్టేషన్ యూనిట్ పక్కనే కర్మాగారానికి సంబంధించిన జనరేషన్ ట్రాన్స్‌ఫార్మర్ కూడా ఉంది. అయితే ఈ రెండింటి మధ్య ఫైర్ సేఫ్టీవాల్ ఉండటంతో జనరేషన్ ట్రాన్స్‌ఫార్మర్‌లోకి మంటలు వ్యాపించక పోవటంతో మరింత అగ్నిప్రమాదం తప్పినట్లైంది. స్టేషన్ యూనిట్‌లో జరిగిన అగ్నిప్రమాదంతో యూనిట్‌లో ఉన్న ఎలక్ట్రికల్ వైర్లు, విలువైన విద్యుత్ పరికరాలు కాలి బూడిదయ్యాయి. ఈ ప్రమాదంలో సుమారు రూ.60లక్షల మేర ఆస్థి నష్టం వాటిల్లినట్లు 5,6 దశల ఛీఫ్ ఇంజనీర్ టిఎస్‌ఎన్ మూర్తి విలేఖర్లకు తెలిపారు. కాగా ఈ అగ్నిప్రమాదంతో 500మెగావాట్ల సామర్ధ్యం గల 6వ దశ 11వ యూనిట్‌లో విద్యుత్ ఉత్పత్తి స్తంభించింది. మంటలు చెలరేగిన స్టేషన్ యూనిట్‌లో సిఇ ఆధ్వర్యంలో వెంటనే మరమ్మత్తు పనులు చేపట్టారు.

బతుకమ్మ చీర ఆడపడుచులకు సారె
నేలకొండపల్లి, సెప్టెంబర్ 19: తెలంగాణ ఆడపడుచులకు పండుగ కనుకగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ బతుకమ్మ చీరతో ప్రతి ఇంటికి సారెను పంపిస్తున్నట్లు నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ శాఖమూరి రమేష్ తెలిపారు. మంగళవారం నేలకొండపల్లి బతుకమ్మ చీరల పంపిణి కార్యక్రమంను ఆయన ప్రారంభించారు. అనంతరం రమేష్ మాట్లాడుతూ ప్రతి ఇంటా ఆడపడుచులు సంతోషంగా ఉండాలనే ఉద్దేశ్యంతో బతుకమ్మ చీరలను అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రతి ఆడపడుచూ కొత్త చీరలతో పండుగను కుటుంబ సభ్యులతో ఆనందగా జరుపుకోవాలని కేసిఆర్ లక్ష్యంమన్నారు. బతుకమ్మ చీరలతో ప్రతి ఇంటా పండుగ వాతవరణం ప్రారంభమైనదన్నారు. ఆడపడుచులను ఎప్పుడు చిరునవ్వుతో ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. మండల తహసీల్దార్ దొడ్డారపు సైదులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ పది రోజుల ముందే గ్రామాలలో పండుగ వాతావరణం తీసుకువచ్చారన్నారు. ప్రతి గ్రామంలో ఆడపడుచులు సంతోషంగా ఉండాలనే ఈ బతుకమ్మ చీరలను అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎంపిడివో ఆళ్ళ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో ప్రతి పండుగను ఆనందగా ప్రజలు జరుపుకోవాలనే ఉద్దేశ్యంతో బట్టల పంపిణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ పెద్ద పండుగ దసరాను ఆడపడుచులు అనందగా నిర్వహించుకునేందుకు బతుకమ్మ చీరలను అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్మిక సంఘం అధ్యక్షుడు కాసాని నాగేశ్వరరావు, నేలకొండపల్లి పట్టణ టిఆర్‌ఎస్ అధ్యక్షుడు మైసా శంకర్, ఎంపిటిసి చిలకల సీతారావమ్మ, వార్డు సభ్యులు మోరం మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. అలాగే నేలకొండపల్లి ఐకేసి కార్యాలయం నందు ఎంపిపి నందిగామ కవితరాణి బతుకమ్మ చీరల పంపిణి కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు ఎంఇవో పురుషోత్తమరావు బతుకమ్మ చీరలను పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు సుజాత, మోరం మల్లయ్య, టిఆర్‌ఎస్ మహిళ విభాగం అధ్యక్షురాలు స్వర్ణ, ఎంపిటిసి శీలం వెంకటలక్ష్మి, సామల కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.