ఖమ్మం

డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళకు కొత్త కష్టాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, సెప్టెంబర్ 24: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్ళ నిర్మాణాలకు కొత్తకష్టాలు వస్తున్నాయి. 5.04లక్షల వ్యయంతో నిర్మిస్తున్న డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్ళు నిర్మించేందుకు మొదటి నుంచి కాంట్రాక్టర్లు ఆసక్తి చూపడంలేదు. తాజాగా ఆ సమస్య మరింత అధికమైంది. ఆయా నియోజకవర్గాల పరిధిలో ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్లను బుజ్జగించి సమాజ సేవ అనుకొని పని చేయాలని నచ్చజెప్పి ఇళ్ళ నిర్మాణ కార్యక్రమాలను అప్పగించారు. నిర్ణీత పనిని బట్టి ప్రభుత్వం బిల్లులు అందించాల్సి ఉంది. అయితే ఖమ్మం జిల్లాలో ఇప్పటికే నిర్మాణం ప్రారంభమైన సుమారు 1100ఇళ్ళు వివిధ దశల్లో ఉండగా అందులో మెజార్టీ ప్రస్తుతం పనులు జరగడంలేదు. ప్రభుత్వం నుంచి బిల్లులు రాకపోవడం వలనే పనులు చేయకలేపోతున్నామని కాంట్రాక్టర్లు వెల్లడిస్తున్నారు. ఒక ఇంటిలో పూర్తయిన పనిని ఉన్నతాధికారులు చెక్ తనిఖీ చేసి కలెక్టర్‌కు నివేదిక సమర్పిస్తే ఆయన దానిని ఆమోదించి తన లాగిన్ నుంచే డబ్బులు చెల్లించాల్సి ఉంది. అయితే ఈ ప్రక్రియకు అధిక సమయం పడుతుండటం, కలెక్టర్‌కు ప్రభుత్వం బతుకమ్మ చీరెలు, భూ సమగ్ర సర్వే, మిషన్ భగీరథ, హరితహారం లాంటి ప్రధాన పనులను కూడా ప్రధానమైనవంటూ అప్పగించడంతో అన్ని పనులు పూర్తిచేయలేక ఇబ్బందులు పడుతున్నారు. బిల్లులు చెల్లించేందుకు సమయం కూడా లేకుండా పోతున్నది. ఇదే విషయాన్ని జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్ రాష్టమ్రంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు స్పష్టంగా వెల్లడించారు. రెండురోజుల క్రితం ఖమ్మంలో జరిగిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ వ్యక్తిగతంగా ఈ పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయలేకపోతున్నామని ఆవేదనగా చెప్పుకొచ్చారు. సిబ్బంది లేమి కారణంగా అనేక పనులను సకాలంలో పూర్తిచేయలేకపోతున్నామని ఆందోళన చెందారు. దీనికి మంత్రి ప్రభుత్వానికి నివేదిక పంపాలని చెప్పినప్పటికీ సమావేశానికి హాజరైన ఇతర అధికారులు కూడా కలెక్టర్ అభిప్రాయంతో ఏకీభవించడం గమనార్హం. పేదల కోసం అతి తక్కువ ఖర్చుతో ఇళ్ళను నిర్మిస్తున్న ప్రభుత్వం అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంటున్నదని మరికొంత మంది అధికారులు పేర్కొంటున్నారు. ఇళ్ళ నిర్మాణాలకు తోడు ఆ ప్రాంతంలో సరైన నీటి సౌకర్యం లేకపోవడం, దానికి ప్రత్యామ్నయం చూపించలేకపోవడం కూడా కారణంగా తెలుస్తోంది. స్థానిక శాసన సభ్యుని కోటాలో ఇళ్ళ నిర్మాణాలు జరిగే ప్రదేశాల్లో అవసరమైతే బోర్లు వేయాలని తుమ్మల నాగేశ్వరరావు సూచించినప్పటికీ శాసన సభ్యుని కోటా నిధులు ఇప్పటికే పూర్తయిపోవడంతో అలా వేయలేమని జిల్లా కలెక్టరే మంత్రికి స్వయంగా చెప్పడం విశేషం. ప్రభుత్వం తమకివ్వాల్సిన బడ్జెట్‌ను ఎప్పటికప్పుడు విడుదల చేయిస్తే కష్టమైనా ప్రభుత్వానికి అండగా ఉండేందుకు త్వరగా నిర్మాణాలు పూర్తి చేస్తామని కాంట్రాక్టర్లు చెబుతున్నారు.