ఖమ్మం

వారసత్వ ఉద్యోగాలపై నువ్వంటే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, సెప్టెంబర్ 24: సింగరేణి కాలరీస్‌లో వారసత్వ ఉద్యోగాలను పోగొట్టింది నువ్వంటే.. నువ్వంటూ కార్మిక సంఘాలు నవ్వుల పాలవుతున్నాయి. సింగరేణిలో 1997 వరకు వారసత్వ ఉద్యోగాలు సజావుగా సాగినప్పటికీ 1998 నుంచి వారసత్వ ఉద్యోగాల నియామకాలను రద్దు చేశారు. ఐదు ప్రధాన కార్మిక సంఘాలే వారసత్వ ఉద్యోగాల రద్దుకు కారణమని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆరోపిస్తుంది. తెలంగాణ రాష్ట్రం వస్తే సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు కల్పిస్తామని వాగ్ధానం చేసిన టిఆర్‌ఎస్ వారసత్వ ఉద్యోగాల రద్దుకు కుట్ర పన్నిందని ప్రధాన కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో ప్రధాన కార్మిక సంఘాలు వారసత్వ ఉద్యోగాలను ఆయుధంగా తీసుకుని ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. న్యాయస్థానాలు వారసత్వ ఉద్యోగాల నియామకాలను రద్దు చేసినప్పటికీ ఎదో విధంగా నియామకాలను చేపడతామని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం తరపున ప్రచారం చేస్తున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డిలు ఎన్నికల ప్రచారంలో హామీలు కురిపిస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హాయాంలో రద్దయిన వారసత్వ ఉద్యోగాలు టిఆర్‌ఎస్ ప్రభుత్వంలో వస్తాయని ఎదురు చూసిన నిరుద్యోగులకు నిరాశే ఎదురైంది. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో ప్రధాన ఎజెండాగా వారసత్వ ఉద్యోగాలు తెరపైకి వచ్చాయి. గత జనవరి నుంచి వాసరత్వ ఉద్యోగాల కోసం సుమారు 8వేల మందికి పైగా దరఖాస్తులు చేసున్నప్పటికీ న్యాయస్థానం రద్దు చేసింది. సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాల్లో వారసత్వ ఉద్యోగాల వలన 30వేల మంది కార్మిక కుటుంబాలకు లబ్ధి చేకూరే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వ నిర్ణయాల వలన వారసత్వ ఉద్యోగాలు పెండింగ్‌లో పడ్డాయి. ఈ ఏడాది అధికశాతం మంది కార్మికులు రిటైర్మైంట్ అవుతున్న నేపధ్యంలో యూనియన్ ఎన్నికల్లో విజయం సాధిస్తారో వారసత్వ ఉద్యోగ నియామకాలు ఎప్పుడు జరుపుతారోనని నిరుద్యోగ యువకులు ఎదురు చూస్తున్నారు.