ఖమ్మం

సీతారాముల కల్యాణం చూతము రారండి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, ఏప్రిల్ 14: జగదభిరాముడి జగత్కాల్యాణానికి సమయం ఆసన్నమైంది. సీతారాముల కల్యాణాన్ని కళ్లారా వీక్షించాలని జగమంతా భద్రాద్రిలో మకాం వేసింది. రఘురాముడు శ్రీరాముడు.. సుగుణాల రాశి సీతమ్మ.. పక్కన కూర్చుంటే.. ఆ దృశ్యం వీక్షించి తరించాలని భక్తకోటి భద్రాద్రికి పయనమైంది. భక్తజన తాకిడితో భద్రాద్రి కిటకిటలాడుతోంది. అశేష భక్తజనవాహిని నడుమ నేడు రామయ్య కళ్యాణం వైభవోపేతంగా జరగడానికి సకల సన్నాహాలు జరిగాయి. శిల్పకళా శోభితమైన మిథిలానగరం కళ్యాణ మండపంలో రామయ్య సీతమ్మను పరిణయ మాడనున్నారు. దీనికోసం యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. గోదావరి పుణ్యస్నానాలు ఆచరించి, చలువ పందిళ్ల నీడలో ఒళ్లంతా కళ్లు చేసుకొని జగత్కాల్యాణం వీక్షించేందుకు భక్తకోటి ఎదురు చూస్తోంది. మరికొద్ది గంటల్లో దశరథ తనయుడు శ్రీరాముడు.. జనక మహారాజు కుమార్తె సీతమ్మను కల్యాణమాడనున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలతో భద్రాద్రికి వస్తున్నారు. ఈ నేపథ్యంలో యంత్రాంగం గట్టి బందోబస్తు ఏర్పాటు చేసింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కలెక్టర్ డిఎస్ లోకేశ్‌కుమార్, ఎస్పీ షానవాజ్ ఖాసీం గురువారం ఏర్పాట్లను సమీక్షించారు.
సర్వం సిద్ధం
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగే శ్రీ సీతారాముల కల్యాణానికి భద్రాద్రి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. మరికొన్ని గంటల్లో లోక కళ్యాణం జరగనుంది. సప్తవర్ణాల వెలుగులు, సరికొత్త హంగులతో భద్రాద్రి పట్టణానికి కళ వచ్చిపడింది. ఎండలు మండుతున్నా లెక్క చేయకుండా భక్తులు రామయ్య కల్యాణం తిలకించేందుకు ముందుగానే భద్రాచలం చేరుకున్నారు. రామనామ స్మరణతో భక్తులు రామయ్యను కొలుస్తున్నారు. పట్టణంలో ఏ వీధి చూసినా రామనామస్మరణతో పులకించిపోతోంది. కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. దేవాదాయ, రెవెన్యూ, పంచాయితీరాజ్, ట్రాన్స్‌కో.. తదితర శాఖల ఆధ్వర్యంలో ఏర్పాట్లను పూర్తి చేశారు. భక్తులకు చలువ పందిళ్లు, షామియానాలు ఏర్పాటు చేశారు. తాగునీటి సమస్య తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు. స్వచ్ఛంద సంస్థల సేవలు అందిస్తున్నాయి. పోలీసులు భద్రాద్రిని ఆధీనంలోకి తీసుకుని గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. రామయ్య కల్యాణ వేదిక మిథిలా మైదానం శిల్పకళా శోభితమై లోక కల్యాణానికి సిద్ధమైంది. మిథిలాస్టేడియాన్ని పోలీసులు ముమ్మరంగా తనిఖీ చేశారు.
అభిజిత్ లగ్నంలో..
వసంతపక్ష ప్రయుక్తంగా నవాహ్నిక దీక్షతో జరిగే బ్రహ్మోత్సవాల్లో ప్రధానమైన మహోత్సవం సీతారాముల కల్యాణం. ఈ వివాహ వేడుక శుక్రవారం అభిజిత్ లగ్నంలో ఉదయం 10.30 గంటల నుంచి 12.30 గంటల వరకు జరగనుంది. కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించేందుకు దైవజ్ఞులు ఈ ముహూర్తాన్ని నిర్ణయించారు.
పోలీసు వలయంలో భద్రాద్రి
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణం, స్వామివారి పట్ట్భాషేకం మహోత్సవాల సందర్భంగా జిల్లా పోలీసు యంత్రాంగం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి, గవర్నర్ రాక కోసం ఏర్పాటు చేసిన హెలీప్యాడ్, వసతిగృహం, కళ్యాణ మండపం తదితర ప్రాంతాల్లో ప్రత్యేక పోలీసు బలగాలను మోహరించారు. సిఎం భద్రతా సిబ్బంది ముందుగా సిఎం వసతిగృహాన్ని స్వాధీనం చేసుకున్నారు.