ఖమ్మం

నేటి నుండి కల్వరి మహిమోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(కల్చరల్), అక్టోబర్ 23: ఖమ్మంలోని ఎస్‌ఆర్‌అండ్ బిజిఎన్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఈ నెల 24 నుంచి 27 వరకు జరిగే కల్వరి మహిమోత్సవాలకు ఖమ్మం నగర, పరిసర ప్రాంతాల నుండి ప్రజలు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కన్వీనర్ వేముల సత్యం పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కల్వరి టెంపుల్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు జరిగే ఈ మహిమోత్సవాలకు వ్యవస్థాపక అధ్యక్షులు, అంతర్జాతీయ ప్రసంగీకులు డాక్టర్ పి సతీష్‌కుమార్ హాజరై నాలుగు రోజులపాటు ప్రసంగిస్తారని తెలిపారు. కుల మత వర్గ, వయో భేదం లేకుండా ప్రతి ఒక్కరూ ఈ మహిమోత్సవాలకు హాజరుకావచ్చునన్నారు. క్రీస్తు బోధనలు, మంచి వర్తమానాన్ని ప్రజలకు అందించనున్నారని తెలిపారు. టెంపుల్ కళాకారులచే భక్తి గీతాలపనలు, స్కిట్స్, వాక్య పరిచర్య కార్యక్రమాలు ఎంతో వినోదాన్ని అందిస్తాయన్నారు. అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని డాక్టర్ పి సతీష్‌కుమార్ దీవెనలు పొంది జీవితంలో ఎలా మెలగాలో తెలుసుకోవచ్చునన్నారు.
సాగు నీరందించి పంటలు కాపాడాలి
కల్లూరు, అక్టోబర్ 23: సాగర్ కాల్వ ద్వారా సోమవారం విడుదల చేసిన సాగు నీటిని 1500 క్యూసెక్కులకు తగ్గకుండా సరఫరా చేసి పంటలను కాపాడాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. కల్లూరు వచ్చిన ఆయన ఎనె్నస్పీ ఇఇ నరసింహారావును కలిసి చివరి పంటలకు కూడా సాగునీరు అందే విధంగా సరఫరా చేసి పంటలను కాపాడాలని కోరారు. ఇప్పటికే వరి పంటకు ఎన్నడూ లేని విధంగా దోమపోటు ఆశించి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని వరి పంట చేతికొచ్చేంత వరకు సాగునీరు అందించి పంటలు చేతికందే విధంగా కృషి చేయాలని వివరించారు. స్పందించిన ఇఇ ఎమ్మెల్యేతో మాట్లాడుతూ 1500 క్యూసెక్కులకు తగ్గకుండా నీటి సరఫరా పది రోజులపాటు జరుగుతుందని ఆ తర్వాత మరికొన్ని రోజులు ఇదే పద్ధతిలో సాగునీరు విడుదలవుతుందని తెలిపారు. ఎనె్నస్పీ డిఇ రాంప్రసాదు, టిడిపి నాయకులు కాటంనేని వెంకటేశ్వరరావు, బోబోలు లక్ష్మణరావు పాల్గొన్నారు.
9 లక్షల విలువైన గుట్కా పట్టివేత
ఖమ్మం (జమ్మిబండ), అక్టోబర్ 23: ఖమ్మం త్రీటౌన్ ప్రాంతంలోని పంపింగ్‌వెల్ రోడ్డులో డంప్ చేస్తున్న తొమ్మిది లక్షల విలువైన గుట్కాను టాస్క్ఫోర్స్ అధికారులు సోమవారం పట్టుకున్నారు. కర్ణాటక రాష్ట్రం బీదర్ నుండి అక్రమంగా తరలిస్తున్న తొమ్మిది లక్షల రూపాయల విలువైన గుట్కా, కైని, అంబర్ ప్యాకెట్లను టాస్క్ఫోర్స్ అధికారులు దాడి చేసి మూడు వాహనాలతో పాటు ముగ్గురు డ్రైవర్లు, ట్రేడర్ దోసా అశోక్, సందీప్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ టాస్క్ఫోర్స్ దాడుల్లో సిఐ ఆంజనేయులు, ఎస్‌ఐ కరుణాకర్, సిబ్బంది పాల్గొన్నారు.