ఖమ్మం

కుల భోజనాల సంస్కృతి చాలా ప్రమాదకరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్, నవంబర్ 19: ‘మనుషులంతా ఒక్కటవ్వాల్సిన చోట కులాలు, మతాల పేరుతో విడదీస్తున్నారు. ప్రకృతిలో రకరకాల చెట్లు కలిసే ఉంటున్నాయి. అలాంటి చెట్ల కింద భోజనాల పేరుతో వెళ్లే మనుషులు మాత్రం కుల భోజనాల పేరుతో విడిపోతున్నార’ని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య కళాకారిణి విమలక్క ఆవేదన వ్యక్తం చేశారు. సాంఘిక సమానత్వం పేరుతో సిపిఎం ఆధ్వర్యంలో స్థానిక రాజుపేట కాలనీలోని ఎలైట్ గార్డెన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన జన భోజనాల కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. పెద్ద కులస్తులకు కుల సంఘాలు అవసరం లేదు కానీ చిన్న కులాలు దోపిడీకి గురవుతున్నాయని, వారికి కుల సంఘం అవసరం, వర్గపోరాటాలు అవసరమన్నారు. కుల భోజనాలు ప్రస్తుత పరిస్థితుల్లో చాలా ప్రమాదకరమని ఆమె పేర్కొన్నారు. కులాలు, మతాలు కుల భోజనాల పేరుతో ప్రజలను విభజించి పాలించే అవసరం పాలకులకు మాత్రమే ఉంటుందని, ప్రజలు వాటికి లోనుకాకూడదన్నారు. సమాజం కోసం మాన్ని కూకటివేళ్ళతో పీకేయాలని పిలుపునిచ్చారు. బ్రాహ్మణీయ భావజాలాన్ని ప్రచారం చేస్తున్నారని వారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. తల్లిదండ్రులకు ప్రతి ఒక్కరూ జీవితకాలం రుణపడి ఉండాలన్నారు. తల్లిదండ్రులను ప్రేమించలేని వాడు సమాజాన్ని ప్రేమించలేడన్నారు. కుల, మతరహిత సమాజం కోసం జరిగే న్యాయ పోరాటాల్లో అందరూ కలిసి రావాలని కోరారు. ఇలాంటి జన భోజనాల సంస్కృతిని సిపిఎం భద్రాచలం పట్టణ కమిటీ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ సంస్కృతి తెలంగాణ రాష్టమ్రంతా విస్తరించాలని కోరుకుంటున్నానని ఆమె తెలిపారు. తన చివరి రక్తం బొట్టు వరకు ప్రజల సమస్యలపై పోరాడుతూనే, ప్రజల మధ్యే ఉంటానన్నారు. అనంతరం తన బృందంతో కలిసి ఆమె పలు పాటలు ఆలపించారు. సిపిఎం పట్టణ కార్యదర్శి భీమవరపు వెంకటరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సున్నం రాజయ్య, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు పొతినేని సుదర్శన్ మాట్లాడుతూ కులం పేరుతో ప్రజలపై ప్రస్తుతం దాడులు జరుగుతున్నాయన్నారు. టీమాస్ ఆధ్వర్యంలో డిసెంబర్ 6 నుంచి సామాజిక జన భోజనాల కార్యక్రమాలు నిర్వసిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా చిన్నారులు, యువతులు, మహిళలు ఆటపాటలతో సంతోషంగా గడిపారు. చిన్నారులు నృత్యాలు చేస్తూ సందడి చేశారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి కాసాని ఐలయ్య, అన్నరవుపు కనకయ్య, మచ్చా వెంకటేశ్వర్లు, ఏజే రమేష్, వై.రవికుమార్, రేణుక, కారం పుల్లయ్య, ఎంబీ నర్సారెడ్డి, గడ్డం స్వామి, వైవీ రామారావు, చుక్కా మాధవరావు, ప్రసాద్, జ్యోతి, సంతోష్, కుసుమ, లీలావతి, గంగ, శేఖర్, పౌల్‌రాజ్, సుధాకర్, ఖాన్, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

ప్రత్యామ్నాయం కమ్యూనిస్టులే
* సీపీఎం జిల్లా కార్యదర్శి పొన్నం వెంకటేశ్వరరావు
ఖమ్మం(కల్చరల్), నవంబర్ 19: పీడిత ప్రజల సమస్యలపై పోరుకు కమ్యూనిస్టులే ప్రత్యామ్నాయం అని సిపిఎం జిల్లా కార్యదర్శి పొన్నం వెంకటేశ్వరరావు అన్నారు. ఆదివారం రిక్కాబజార్ సెంటర్‌లో గల స్టడీసర్కిల్ కాలేజి ఆవరణలో సిపిఎం వన్‌టౌన్ కమిటీ మహాసభ జరిగింది. ఎఎస్ కుమార్, దాసరి నాగేశ్వరరావు, షేక్ బేగం, పుట్టా రవి అధ్యక్షవర్గంగా జరిగిన ఈ మహాసభలో ప్రారంభ సూచికంగా పార్టీ జెండాను పార్టీ సీనియర్ నాయకుడు బి చంద్రారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో పొన్నం మాట్లాడుతూ కెసిఆర్ కేవలం మాటల గారడీ చేస్తూ ప్రజల్ని మోసం చేస్తూ పాలన సాగిస్తున్నాడని విమర్శించారు. డబుల్‌బెడ్‌రూం ఇళ్ళు ఖమ్మం నగరంలో నేటికి ఒక్కటీ పూర్తికాలేదని, అర్హులైన పేదలంతా వాటి కోసం ఎదురుచూస్తున్నారన్నారు. ప్రతి కార్యకర్త పార్టీని బలోపేతం చేసేందుకు కృషిచేయాలని కోరారు. ప్రజా సమస్యలపై మరింత చొరవతో పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మహాసభలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు బుగ్గవీటి సరళ, నున్నా నాగేశ్వరరావు, పార్టీ జిల్లా నాయకులు కె నర్సయ్య, అఫ్రోజ్ సమీనా, యర్రా శ్రీనివాసరావు, వై విక్రమ్, గట్టు రమాదేవి, బండారు యాకయ్య, షేక్ మీరాసాహెబ్, వన్‌టౌన్ నాయకులు మర్రి బాబురావు, ఎంఎ ఖయ్యూం, సరస్వతి, భాస్కర్‌రాజు, సిహెచ్ పుల్లారావు, వంజాకు లక్ష్మినారాయణ, నాగిశెట్టి యాదగిరి, గట్టు గిరిధర్, బి అనసూర్య, కిరణ్, బి అజిత, సత్తార్, జాలా శ్రీనివాసరావు, ఎన్ కృష్ణారావు, నాగూల్‌మీరా, కె సరస్వతి తదితరులు పాల్గొన్నారు.