ఖమ్మం

పారదర్శకంగానే లబ్ధిదారుల ఎంపిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సత్తుపల్లి, నవంబర్ 19: అభివృద్ధి పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా నిలిచిందని రోడ్డు, భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం సత్తుపల్లి అయ్యగారిపేట సమీపంలో వాణి విద్యాలయం గురుకుల పాఠశాల ఆవరణలో టిఆర్‌ఎస్ పార్టీ కుటుంబ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా విచ్చేసిన తుమ్మల సందర్భంగా మాట్లాడుతూ ఏ పథకమైనా లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరుగుతుందన్నారు. గతంలో ఇలా లేదన్నారు. ఇష్టారాజ్యంగా ఉండేదన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి కెసిఆర్ పారదర్శకానికి ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. అర్హత ఉన్న రైతులకు ప్రభుత్వ పథకాలు అందాలంటే అసలైన రైతులకు ప్రభుత్వం సాయం అందాలన్నా రైతు పాసు పుస్తకాలు తప్పుల తడకగా ఉండటమే కాక దొంగ పాసుపుస్తకాలు కూడా ఉన్నాయన్నారు. ఈ నేపధ్యంలో ప్రభుత్వం బృహత్తర కార్యాచరణకు పూనుకుందన్నారు. రైతుల భాగస్వామ్యంతోనే రైతు సమన్వయ కమిటీలు ఏర్పాటు చేయటం ద్వారా ఆయా కమిటీల పర్యవేక్షణలో అసలైన రైతులకు పక్కాగా పాసుపుస్తకాలు అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జూన్ 1 నుంచి మొదలవుతుందన్నారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఒక ఎత్తయితే రైతు పుస్తకాలు ఒక ఎత్తన్నారు. రూ. 50వేల కోట్లతో మంచినీటి పథకాలు, రూ లక్ష కోట్లతో విద్యుత్ పథకాలు, రూ.లక్షన్నర కోట్లతో నీటిపారుదల పథకాలు ఇలా అనేక పథకాలు టిఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేయడం జరుగుతుందన్నారు. ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాల్సిన భాద్యత కార్యకర్తలపై ఉందన్నారు. గత ప్రభుత్వాలు అమలు చేయని పథకాలెన్నో టిఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, జడ్పి చైర్మన్ గడిపల్లి కవిత, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శులు తక్కళ్ళపల్లి రవీందర్‌రావు, నూకల మాట్లాడారు. ఎస్సి కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి అధ్యక్షతన జరిగిన ఈ సభలో రాష్ట్ర నాయకులు బండి గుర్నాథరెడ్డి, నియోజకవర్గ నాయకులు గాదె సత్యనారాయణ, మట్టా దయానంద్‌విజయ్‌కుమయార్, చల్లగుండ్ల నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.

భద్రాద్రిలో మహిళ దారుణ హత్య
భద్రాచలం టౌన్, నవంబర్ 19: భద్రాచలం పట్టణంలో ఒక మహిళ ఆదివారం దారుణ హత్యకు గురైంది. పట్టణంలోని శ్రీకృష్ణ దేవాలయానికి అనుబంధంగా ఉన్న కాటేజీలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కాటేజీకి శనివారం ఇద్దరు వచ్చి తాము దంపతులమని చెప్పి గదిని అద్దెకు తీసుకున్నారు. అనంతరం వారి బంధువులమంటూ ఒక మహిళ, ఇద్దరు పురుషులు కాటేజీకి వచ్చి గదిని అద్దెకు తీసుకున్నారు. ఈ క్రమంలో ఆదివారం కాటేజీ నిర్వాహకుడు రాము వచ్చి చూడగా వారు అద్దెకు తీసుకున్న రెండు గదుల్లో ఒక గదికి తాళం వేసి ఉంది. మరో గదికి సంబంధించిన తాళాలు అక్కడే ఉన్నాయి. అనంతరం కాటేజీ సిబ్బంది ఆ గది తలుపులు తీసి శుభ్రం చేస్తుండగా బాత్‌రూమ్‌లో ఒక మహిళ విగతజీవిగా పడి ఉంది. దీంతో కాటేజీ నిర్వాహకుడు రాము పట్టణ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఏఎస్పీ సునీల్‌దత్, సిఐ బాణాల శ్రీనివాసులు, ఎస్సైలు కరుణాకర్, హరిసింగ్‌రాథోడ్‌లు డాగ్‌స్వ్కాడ్‌తో సంఘటన స్థలికి చేరుకున్నారు. కాటేజీ నిర్వాహకుడిని, సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. డాగ్ స్వ్కాడ్‌తో గదిని నిశితంగా పరిశీలించి ఆధారాలు సేకరించారు. గది నుంచి ప్రారంభమైన డాగ్‌స్వ్కాడ్ గోదావరి కరకట్ట మీదుగా ఆర్డీసీ బస్టాండ్ వరకు వచ్చి ఆగింది. హత్యకు పాల్పడిన వారు బస్సు ద్వారా వెళ్లి ఉంటారని భావిస్తున్నారు. పూర్తి వివరాలు సేకరిస్తున్నామని, త్వరలోనే కేసును చేధిస్తామని పోలీసులు తెలిపారు.