ఖమ్మం

మరో రామదాసును మరిచారు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్, నవంబర్ 23 భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో దశవిధ ఉత్సవాల రూపకర్త ఆయన. రామయ్యకు ఉదయం సుప్రభాతం నుంచి రాత్రి పవళింపు సేవ వరకు వివిధ రకాల ఉత్సవాలను ఏర్పాటు చేసిన ఘనత ఆయనది. పైగా వాటికి తగిన విధంగా కీర్తనలను రచనావిష్కరణ చేసిన గొప్పతనం ఆయనది. ఆయనే రాజా తూము లక్ష్మీ నరసింహదాసు. భద్రాద్రా రాముడి సేవ కోసం ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా వదిలేసి రామభక్తిలో తరించిన అపర భక్తుడు ఆయన. తీర్థయాత్రలు చేస్తూ భద్రాచలం వచ్చి తన స్నేహితుడైన వరద రామదాసు సాయంతో ఆలయాభివృద్ధికి నడుం బిగించిన రామ భక్తుడు. కానీ అంతటి మహనీయుడిని భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం అధికారులు విస్మరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. భక్త రామదాసు తర్వాత రామయ్యను కొలిచిన అంతటి మహాభక్తుడు తూము నరసింహదాసు. ఆ మహనీయుని పేరిట ఒక స్మారక మం దిరం, ఆయన రచించిన అజరామరమైన కీర్తనలను ప్రచారం చేసిన దాఖలాలు లేవు. మూడేళ్ల క్రితం మాఢవీధుల అభివృద్ధి పేరుతో శతాబ్ధాల కాలంగా ఉన్న తూము నరిసింహదాసు ఇంటిని తొలగించారు. ఆయల ప్రాంగణంలో భక్తరామదాసు విగ్రహాన్ని చేయగా, తూము నరసింహదాసు విగ్రహాన్ని కూడా నిర్మిస్తే సముచితంగా ఉంటుందనే అభిప్రాయం రామభక్తుల్లో ఉంది. కానీ ఆ దిశగా దేవస్థానం అధికారులు చర్యలు తీసుకోవడం లేదు.
రామయ్యకే దర్జా తెచ్చిన దాసుడు
భద్రాచలం దేవస్థానంలో దశవిధ ఉత్సవాల్లో అత్యంత కీలకమైంది ద ర్బారుసేవ. ఇది ప్రపంచంలో ఏ క్షేత్ర ంలో నిర్వహించనటువంటి ప్రత్యేక సేవ. దర్బారు సేవతో రామచంద్రుడికి తూము నరసింహదాసు దర్జాను తె చ్చారు. అంతేకాకుండా ‘పూజ సే య రే.. బంగారు పూలతో పూజ సేయరే’ వంటి మధురాతి మధురమైన కీర్తనలను ఆయన రూపొందించారు. ఇలా మరో రామదాసుగా ప్రసిద్ధగాంచిన రాజా తూము లక్ష్మీ నరసింహదాసు ఇచ్చిన స్ఫూర్తితోనే 1998లో 108 బంగారు పుష్పాలను చినజీయర్‌స్వా మి రామయ్య సేవకు సమర్పించారు. కాగా తొము నరసింహదాసు చెక్కించిన శిలాశాసనాలు, రామ స్తంభం నేటికీ భద్రాద్రి ఆలయంలో భక్తులకు దర్శనమిస్తున్నాయి. ఆనాడు ఆచరించిన ఉత్సవాదులకి అక్షర రూపంగా అవి కనిపిస్తాయి. శుక్రవారం రాజా తూము లక్ష్మీ నరసింహదాసు 227వ జయంతిని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఉదయం గిరి ప్రదక్షిణ, భక్తి సంగీత కార్యక్రమాలు ఏర్పాటు చేశా రు. ఈసారైనా ఆయనకు ఘనమైన నివాళి అర్పిస్తూ స్మారక మందిరం ఏర్పాటుపై దేవస్థానం నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని రామభక్తులు భావిస్తున్నారు.